ముంబై: దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ మోటార్స్ తాజాగా ఆవిష్కరించనున్న ‘క్రెటా2020’ మోడల్ కారుకు భారీ బుకింగ్స్ నమోదవుతున్నాయి. ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించిన ఈ కారు బుకింగ్స్ ప్రారంభించిన మొదటి వారంలోనే దాదాపు 10 వేల మార్కును దాటేసింది. ఈ నెల రెండో తేదీ నుంచి హ్యుండాయ్ క్రెటా బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.

క్రెటా 2020 మోడల్ కారు కావాలని కోరుకునే వారు రూ.25వేలు చెల్లించి వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. ఈ కారు ఈ నెల 17వ తేదీన విపణిలోకి రానున్నది. కొత్త క్రెటా కారు లుక్స్‌లో చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇంటీరియర్‌లోనూ పలు మార్పులు చేసినట్లు సమాచారం.

also read సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ఈ-ట్రాక్టర్‌ వచ్చేసింది...త్వరలో అందుబాటులోకి..

బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ కారు డీజిల్, పెట్రోల్ వేరియంట్లలో లభించనున్నది. ఈ కారులో వాడే ఇంజిన్‌ను హ్యుండాయ్ మోటార్స్ తన అనుబంధ కియా మోటార్స్ నుంచి తీసుకొస్తున్నది. హ్యుండాయ్ మోటార్స్ భారత్ మార్కెటింగ్ సర్వీస్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ ‘నూతన క్రెటా కారును ఎంపిక చేసుకున్న మా విలువైన కస్టమర్ల నుంచి వచ్చిన స్పందనతో సంతోషిస్తున్నాం’ అని పేర్కొన్నారు.

హ్యుండాయ్ మోటార్స్ తన సరికొత్త క్రెటా మోడల్ కారును ఈ, ఈఎక్స్, ఎన్, ఎన్ఎక్స్, ఎన్ఎక్స్ (ఓ) అనే ఐదు వేరియంట్లలో విపణిలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. ఇవి మూడు ఇంజిన్ ఆప్షన్లలో లబిస్తాయి. టు డ్యుయల్ టోన్ పెయింట్ స్కీమ్‌లలో పది డిఫరెంట్ రంగుల్లో వినియోగదారులకు క్రెటా కారు అందుబాటులోకి రానుంది. 

1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ల వీజీటీ డీజిల్, 1.4 లీటర్ టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజిన్లలో విక్రయానికి క్రెటాకారు సిద్ధమవుతున్నది. 1.5 లీటర్ పెట్రోల్ డీజిల్, పెట్రోల్ ఇంజిన్లు 113 బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తాయి. 1.4 టర్బో పెట్రోల్ ఇంజిన్ 138 బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తుంది. 1.4 కప్పా టర్బో జీడీఐ పెట్రోల్ వేరియంట్ కారు 7-స్పీడ్ డీసీటీ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తుంది.

also read ట్రాఫిక్ నుండి ఆకాశంలోకి ఎగిరే కారు...వచ్చే ఏడాది అందుబాటులోకి...

2020 క్రెటా మోడల్ కార్ల ధరలు రూ.10 లక్షల నుంచి రూ.17 లక్షల మధ్య ఉంటుందని అంచనా. ధరల శ్రేణిలో పోలిస్తే కియా సెల్టోస్, ఎంజీ మోటార్స్ వారి హెక్టార్, టాటా మోటార్స్ సారథ్యంలోని హారియర్ మోడల్ కార్లతో హ్యుండాయ్ క్రెటా తల పడనున్నది. 

3డీ కాస్కేడింగ్ గ్రిల్లే, ట్రియో బీమ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, బూమరాంగ్ షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఈ కారుకు నూతన లుక్ అందిస్తాయి. ఎల్ఈడీ టెయిల్ లైట్స్, ఎల్ఈడీ హైమౌంట్ స్టాప్ ల్యాంప్, ట్విన్ టిప్ ఎగ్జాస్ట్ అండ్ ఏరోడైనమిక్ రేర్ స్పాయిలర్, రూఫ్ రెయిల్స్, ఓఆర్వీఎంస్, 17 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ అదనపు ఆకర్షణ కానున్నాయి.