న్యూఢిల్లీ: దేశీయ కార్ల పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఏడాది కాలంగా ఆర్థికమాంద్యంతో వాహన ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ కార్ల పరిశ్రమకు కష్టాలు తప్పవనే సంకేతాలు కార్ల తయారీదారులు, మోటారు సైకిళ్లు కం స్కూటర్ల తయారీ సంస్థల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.

ప్రధానంగా కరోనా వైరస్‌ దెబ్బకు విదేశాలనుంచే దిగుమతి అయ్యే ముడిసరుకు నిలిచిపోయింది. అయితే ఆటో మొబైల్‌ రంగంపై కరోనా ప్రభావం కచ్చితంగా ఉంటుందని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ అసోసియేషన్‌ (సియామ్‌) వెల్లడించింది.

also read హ్యుండాయ్ క్రెటా 2020 సరికొత్త రికార్డు: ఒక్క వారంలోనే ఫుల్ డిమాండ్

పరిశ్రమకు విదేశాలనుంచి వచ్చే ముడిసరుకు కీలకం. అందులో చైనా నుంచి 10 శాతం ముడి సరుకు భారత్‌లోని ఆటోమొబైల్‌ పరిశ్రమకు ఉపకరిస్తున్నది. ప్రస్తుతం కరోనా దెబ్బకు ముడిసరుకు రావటంలేదని ఆటో పరిశ్రమ యాజమాన్యాలు చెబుతున్నాయి.

ఈ ఏడాది ప్రారంభంలో చైనా నుంచి భారత్‌లోని ఆటో పరిశ్రమకు అవసరమైన ముడిసరుకు దిగుమతి చేసుకున్నది. ఆ తర్వాత కరోనా వైరస్‌ సోకటంతో...కార్ల పరిశ్రమకు కష్టాలు మొదలయ్యాయి. దీంతో దేశీయ మార్కెట్లో బీఎస్‌..6 వాహనాల ఉత్పత్తిపై ప్రభావం పడనున్నదని సియామ్‌ అధ్యక్షుడు రాజన్‌ వదేరా ఆందోళన వ్యక్తం చేశారు.

వాహనాల తయారీకి అవసరమైన సామాగ్రి చైనా నుంచి సరఫరా కావటంలేదు. దీంతో ప్యాసింజర్‌ వెహికల్స్‌, కమర్షియల్‌ వెహికల్స్‌, త్రీవీలర్స్‌, ఎలక్ట్రానిక్‌ వెహికల్‌తో సహా అన్ని సెగ్మెంట్ల ఉత్పత్తులపై ప్రభావం పడుతున్నది.

also read సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ఈ-ట్రాక్టర్‌ వచ్చేసింది...త్వరలో అందుబాటులోకి..

సప్లయి తగ్గట్టుగా డిమాండ్‌ పూర్తి చేయటానికి ప్రత్యామ్నాయంగా దేశంలో ఎక్కడైనా ముడి అవసరాలు దొరుకుతాయా అని ఆటో పరిశ్రమ ఆరా తీస్తున్నది. అయితే ఈ అన్వేషణతో ఉత్పత్తికి చాలా సమయం పడుతుందని అంచనా.

పైగా చైనా నుంచి వచ్చే ముడి సరుకులను దేశీయ ఆటో పరిశ్రమల్లో వాడటం అలవాటు పడ్డారు. దేశీయంగా సేకరించే వస్తువుల నాణ్యత ప్రమాణాలకు ఎంతవరకు ఉపయోగపడతాయోనన్న అనుమానాలు పరిశ్రమవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ కష్టాల నుంచి గట్టెక్కడమెలా అనే అంశాలతో ఓ నివేదిక ను తయారుచేసి కేంద్రంతో చర్చిస్తున్నట్టు సియామ్‌ తెలిపింది.