గ్రేటర్ నోయిడా: ఆటో ఎక్స్‌పో 2020 ప్రారంభించిన తరువాత 3వ రోజున మారుతి సుజుకి సరికొత్త ఇగ్నిస్ విడుదల చేసింది. దాని ప్రీమియం డీలర్‌షిప్ అయిన నెక్సాలో భాగంగా లాంచ్ అయిన ఈ కారులో చిన్న మార్పులు చేర్చారు. అయితే ఇది కొత్త బిఎస్‌ 6 ఇంజన్‌తో  వచ్చేసింది.

కొత్త కారు డాష్ బోర్డ్ లో కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం రూపంలో కొన్ని అప్‌గ్రేడ్‌లు, కొత్త కలర్ ఆప్షన్స్, డిజైన్ ట్వీక్‌ తో పాటు కొత్త  ఎస్‌యూవీ లాగా కనిపించేలా చేస్తుంది.కొత్త ఇగ్నిస్ మారుతి సుజుకి  కె12 1.2-లీటర్ ఇంజన్‌తో వస్తుంది. ఇది ఇప్పటికీ అదే పవర్, అదే టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 83 హార్స్ పవర్ తో 113 ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది.

also read ప్రపంచంలోనే అత్యధిక కార్లను ఉత్పత్తి చేసే కార్ ప్లాంట్ పై కరోన దెబ్బ...

అయితే ఈ కారు ఇంధన సామర్థ్యం మార్పులపై కంపెనీ  ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.పాత బి‌ఎస్ 4 వెర్షన్‌లో ఏ‌ఆర్‌ఏ‌ఐ క్లెయిమ్ చేసిన మైలేజ్ ప్రకారం లీటర్ కి 20.89 కిలోమీటర్లు. ఈ కారు ముందు ఇంకా  వెనుక వైపు కొత్త లుక్కింగ్ డిజైన్ కలిగి ఉంటుంది.

కార్ ముందు బంపర్స్  ఫాక్స్ స్కఫ్ ప్లేట్లను పొందుతాయి. లూసెంట్ ఆరెంజ్, టర్కోయిస్ బ్లూ అనే సింగిల్ టోన్‌లో కంపెనీ రెండు కొత్త కలర్ ఆప్షన్లను తిసుకొచ్చింది. డ్యూయల్ టోన్ కలర్స్ పొందడానికి ఆసక్తి గల కొనుగోలుదారులు మూడు కొత్త కలర్ ఆప్షన్ పొందుతారు. నెక్సా బ్లూ, బ్లాక్ లూసెంట్  ఆరెంజ్, సిల్వర్ నెక్సా బ్లూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి.

also read మార్కెట్లోకి కొత్త ఈ బైక్... ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు...

ఇంటీరియర్స్ పరంగా చూస్తే కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం మినహాయించి డాష్‌బోర్డ్ చాలావరకు పాత వెర్షన్ లాగానే ఉంటుంది. మారుతి సుజుకి స్మార్ట్‌ప్లే స్టూడియోతో ఇగ్నిస్‌ కారులో 7 అంగుళాల స్క్రీన్ ను అప్‌గ్రేడ్ చేసింది. ఆటొ ఎక్స్‌పో 2వ రోజు ప్రారంభించిన తరువాత కొత్త బి‌ఎస్ 6 బ్రెజ్జా కారులో స్మార్ట్‌ప్లే స్టూడియో సపోర్ట్ కూడా లభించింది.

ఇందులో పెద్దగా మార్పులు లేనప్పటికీ, ఈ కొత్త అప్‌గ్రేడ్ మారుతి ఇగ్నిస్ దాని కొత్త ఎంట్రీ సెగ్మెంట్ ఎస్-ప్రెస్సో, బ్రెజ్జా మధ్య  ఉండడానికి సహాయపడుతుంది. సాధారణంగా ఎస్‌యూవీ కార్లకు లూక్స్, పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇగ్నిస్ కొత్త లుక్స్ తో వచ్చింది. కొత్త ఇగ్నిస్‌ కారు బుకింగ్‌లు కూడా అందుబాటులో ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది.