వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించే NEET UG 2025 ఫలితాలు నేడు వెలువడ్డాయి. నీట్ లో అమ్మాయిలు వెనకబడ్డారు… టాప్ 10 ర్యాంకర్స్ లో కేవలం ఒకే ఒక యువతి ఉంది. ఆలిండియా టాపర్ ఎవరో తెలుసా?
NEET UG 2025 Results: నీట్ యూజీ పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా 1236531 మంది విద్యార్థులు వైద్య విద్యకు అర్హత సాధించారు. రాజస్థాన్ కు చెందిన మహేష్ కుమార్ మొదటి స్థానంలో నిలిచాడు. తాజా పలితాల్లో అమ్మాయిలు నిరాశపర్చారు… టాప్ టెన్ ర్యాంక్స్ లో కేవలం ఒకే ఒక్క అమ్మాయి నిలిచింది.
NEET UG 2025 టాప్ 10 ర్యాంకర్లు వీరే :
1. మహేష్ కుమార్ - ఫస్ట్ ర్యాంక్ (686 మార్కులు, 99.9999547 శాతం)(రాజస్థాన్)
2. ఉత్కర్ష్ అవధియా - సెకండ్ ర్యాంక్ (99.9999095 శాతం)
3. క్రిషాంక్ జోషి - మూడవ ర్యాంక్ (99.9998189 శాతం)
4. మృణాల్ కిషోర్ ఝా - నాలుగో ర్యాంక్ (99.9998189 శాతం)
5. అవికా అగర్వాల్ - ఐదో ర్యాంక్ (99.999832 శాతం)
6. జెనిల్ వినోద్ భాయ్ భయానీ - ఆరో ర్యాంక్ (99.9996832 శాతం)
7. కేశవ్ మిట్టల్ - ఏడో ర్యాంక్ (99.9996832 శాతం)
8. ఝా భవ్య చిరాగ్ - ఎనిమిదవ ర్యాంక్ (99.9996379 శాతం)
9. హర్ష్ కేదావత్ - తొమ్మిదవ ర్యాంక్ (99.9995474 శాతం)
10. ఆరవ్ అగర్వాల్ - పదవ ర్యాంక్ (99.9995474 శాతం)
అమ్మాయికి టాప్ 5 ర్యాంక్... ఎవరీ అవికా అగర్వాల్?
నీట్ యూజి 2025 పలితాల్లో అమ్మాయిలు కాస్త వెనకబడ్డారనే చెప్పాలి. ఆలిండియా స్థాయిలో టాప్ 10 ర్యాంకుల్లో కేవలం అవికా అగర్వాల్ ఒక్కరే నిలిచారు. ఆమె 5వ ర్యాంక్ సాధించారు. 99 శాతానికి పైగా పర్సంటేజ్ సాధించింది ఈ డిల్లీ యువతి. ఈమె మినహా టాప్ 10 ర్యాంకర్స్ లో అందరూ అబ్బాయిలే.
NEET UG 2025 లో తెలుగు విద్యార్థుల సత్తా
తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు లక్షన్నరమంది విద్యార్థులు NEET(నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్) రాసారు. తెలంగాణలోనే 72 వేలమందిలో పరీక్షరాస్తే 41,584... ఆంధ్ర ప్రదేశ్ నుండి 70 వేలమందికి పైగా రాస్తే 36,776 మంది అర్హత సాధించారు,
తెలుగు విద్యార్థుల్లో కాకర్ల జీవన్ సాయికుమార్ 18, కార్తీక్ రామ్ 19, షణ్ముఖ నిషాంత్ 37, మంగరి వరుణ్ 46, యడ్రంగి షణ్ముఖ్ 48, కొడవటి మోహిత్ శ్రీరామ్ 56వ ర్యాంకు సాధించారు.