Asianet News TeluguAsianet News Telugu

జొమాటో కస్టమర్లకు ఫ్రీ వాలెట్ పార్కింగ్......

రెస్టారెంట్ల చురుకైన భాగస్వామ్యంతో ‘గోల్డ్‌‌‌‌ స్పెషల్‌‌‌‌’ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనుకుంటున్నామని జొమాటో సీఈఓ దీపిందర్‌‌‌‌ గోయెల్‌‌‌‌ వెల్లడించారు. గోల్డ్‌‌‌‌ కస్టమర్లకు మరిన్ని అదనపు ప్రయోజనాలు కల్పించనున్నట్లు తెలిపారు. దేశంలోని ప్రముఖ రెస్టారెంట్లతో కలిసి వాటిని అందించనున్నట్లు పేర్కొన్నారు.

Zomato 'Gold Special' soon with better deals:Deepinder Goyal
Author
Hyderabad, First Published Nov 12, 2019, 10:10 AM IST

న్యూఢిల్లీ: ఆన్ లైన్ ఫుడ్ అగ్రిగ్రేటర్ ‘జొమాటో’ లాగవుట్‌‌‌‌ క్యాంపెయిన్​తో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా గోల్డ్‌‌‌‌ మెంబర్లకు స్పెషల్‌‌‌‌ డీల్స్‌‌‌‌తో కొత్త ప్రోగ్రామ్‌ ప్రకటించింది. ఇందులో ఫ్రీ వ్యాలెట్‌‌‌‌ పార్కింగ్‌‌‌‌ వసతి కూడా ఉంటుంది. భవిష్యత్‌లో 20 కోట్ల మందికి సర్వీస్‌‌‌‌ అందించాలని లక్ష్యం‌‌గా పెట్టుకున్నామని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ తెలిపారు. 

రెస్టారెంట్ల చురుకైన భాగస్వామ్యంతో ‘గోల్డ్‌‌‌‌ స్పెషల్‌‌‌‌’ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనుకుంటున్నామని జొమాటో సీఈఓ దీపిందర్‌‌‌‌ గోయెల్‌‌‌‌ వెల్లడించారు. గోల్డ్‌‌‌‌ కస్టమర్లకు మరిన్ని అదనపు ప్రయోజనాలు కల్పించనున్నట్లు తెలిపారు. దేశంలోని ప్రముఖ రెస్టారెంట్లతో కలిసి వాటిని అందించనున్నట్లు పేర్కొన్నారు.

aslo read ఆధార్ న్యూ రూల్స్: పుట్టిన తేదీ, పేరు మార్పు ఒక్కసారే

గత అక్టోబర్‌‌‌‌ నెలలో కొత్తగా 1.10 లక్షల మంది గోల్డ్‌‌‌‌ మెంబర్లుగా చేరినట్లు జొమాటో చెబుతోంది. తమ ప్రయాణంలో ఒడిదొడుకులు నెలకొని ఉన్నా, గోల్డ్‌‌‌‌ మెంబర్‌‌‌‌షిప్‌‌‌‌ను కస్టమర్లు ఇష్టపడుతున్నారనడానికి ఇదే నిదర్శనమని జొమాటో సీఈఓ దీపిందర్ గోయెల్‌‌‌‌ తెలిపారు. 

గోల్డ్‌‌‌‌ మెంబర్‌‌‌‌ షిప్‌‌‌‌ స్కీములోని కొన్ని యూజర్‌‌‌‌ పాలసీలు నచ్చకపోవడంతో కొన్ని రెస్టారెంట్లు జొమాటోకు వ్యతిరేకంగా లాగౌట్‌‌‌‌ క్యాంపెయిన్‌‌‌‌ మొదలెట్టాయి. ప్రత్యేకించి ఆగస్టు 15 తర్వాత నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఎఐ), జొమాటో మధ్య పరస్పరం ఆరోపణల యుద్ధం మొదలైంది. ఫలితంగా వేల రెస్టారెంట్లు ‘లాగౌవ్’ క్యాంపెయిన్ చేపట్టాయి.

Zomato 'Gold Special' soon with better deals:Deepinder Goyal

జొమాటో గోల్డ్ పాలసీకి వ్యతిరేకంగా కొన్ని వారాల క్రితం రెస్టారెంట్లు ఆందోళనకు శ్రీకారం చుట్టాయి. దీంతో వందలాది మంది గోల్డ్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్లతో కలిసి మాట్లాడి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నాక గోల్డ్‌‌‌‌ మెంబర్‌‌‌‌షిప్‌‌‌‌లో కొన్ని మార్పులు తీసుకొచ్చామని జొమాటో సీఈఓ దీపిందర్ గోయెల్‌‌‌‌ చెప్పారు. 70 శాతం మంది ‘జొమాటో గోల్డ్’లో మార్పులకు సానుకూలంగా స్పందిస్తున్నారన్నారు. 

also read  అలీబాబా సింగిల్స్ డే సేల్స్ : గంటలో 12 బిలియన్ల సేల్స్

జొమాటో దేశం మొత్తం మీద రోజూ 1.5 లక్షల రెస్టారెంట్ల నుంచి 13 లక్షల ఆర్డర్లను డెలివరీ చేస్తోంది. ఒక్కో రెస్టారెంట్‌‌‌‌కూ చూస్తే రోజుకు పది కంటే ఎక్కువే ఆర్డర్లను డెలివరీ చేస్తోంది. మన దేశంలోని 50 నగరాల పరిధిలో జొమాటో కిచెన్‌‌‌‌లు పని చేస్తున్నాయి. ప్రస్తుతం 556 నగరాల పరిధిలో జొమాటో వినియోగదారులకు సేవలందిస్తోంది.

వీటికి అదనంగా జొమాటోకు 110 కిచెన్‌‌‌‌ హబ్‌‌‌‌లు ఏర్పాటు దశలో ఉన్నాయి. మొత్తం మీద 663 కిచెన్‌‌‌‌ యూనిట్లు, కియోస్క్‌‌‌‌లు అందుబాటులో ఉన్నట్లు జొమాటో తెలిపింది. 2019–20 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో  రెవెన్యూ మూడు రెట్లు పెరిగి 205 మిలియన్‌‌‌‌ డాలర్లకు చేరినట్లు పేర్కొంది. పార్టనర్ల నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా లో రేటెడ్ కస్టమర్లను బ్లాక్ చేస్తున్నట్లు దీపిందర్ గోయల్ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios