Asianet News TeluguAsianet News Telugu

ఆధార్ న్యూ రూల్స్: పుట్టిన తేదీ, పేరు మార్పు ఒక్కసారే

ఆధార్ నూతన నిబంధనలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. మార్పులకు అనుమతించడంతో దుర్వినియోగం చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో పుట్టిన తేదీ, పేరుపై ఒక్కసారి మార్చడానికి మాత్రమే అనుమతినిస్తూ తాజాగా విశిష్ఠ ప్రాదికార గుర్తింపు సంస్థ (ఉడాయ్) ఆంక్షలు అమలులోకి తెచ్చింది. 

aadhar card new rules on name and DOB
Author
Hyderabad, First Published Nov 11, 2019, 3:52 PM IST

న్యూఢిల్లీ: ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ చేసుకోవాలనుకుంటున్నారా? పేరు, పుట్టిన తేదీ తదితర అంశాలు మార్చుకోవాలనుకుంటే మాత్రం మీరు ఇది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. గతంలో మాదిరిగా ఇకపై ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోడానికి కుదరదు.

ఆధార్‌ కార్డులో మార్పులు చేర్పులపై భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ (ఉడాయ్‌) కొత్తగా ఆంక్షలు తీసుకు వచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై ఆధార్‌లో పుట్టిన తేదీని కేవలం ఒకసారి మాత్రమే మార్చుకునేందుకు వీలు ఉంటుంది. 

aslo read  అలీబాబా సింగిల్స్ డే సేల్స్ : గంటలో 12 బిలియన్ల సేల్స్

ఆధార్‌ కార్డు జారీ చేసినప్పుడు పేరు, పుట్టినతేదీ ఇలా దేనిలోనైనా పొరబాట్లు ఉంటే సరిదిద్దుకోడానికి వీలుగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకునే వీలుంది. ఆధార్‌ అప్‌డేట్‌ అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో మార్పులు చేర్పులపై ఉడాయ్‌ కొత్తగా నిబంధనలు తీసుకొచ్చింది. 

ముఖ్యంగా పేరు, పుట్టినతేదీని ఇష్టానుసారంగా మార్చుకునే వీలు లేకుండా ఆధార్ పరిమితులు విధించింది. ఈ నిబంధనల ప్రకారం ఆధార్‌ కార్డుపై మీ పేరులో తప్పులుంటే ఇకపై కేవలం రెండు సార్లు మాత్రమే మార్పు చేసుకునే అవకాశం ఉంటుంది.

aadhar card new rules on name and DOB

పుట్టిన తేదీ, లింగం విషయంలో తగిన ఆధారాలతో కేవలం ఒక్కసారే మార్చుకునేందుకు అనుమతినిస్తోంది. ఆధార్‌ కార్డులో ప్రస్తుతం ఉన్న పుట్టినతేదీకి మూడేళ్లు తక్కువ గానీ, ఎక్కువ గానీ మార్చుకునేందుకు మాత్రమే అవకాశముంటుంది. పుట్టినతేదీ మార్చుకోడానికి కచ్చితంగా ధ్రువపత్రం ఉండాల్సిందే. 

aslo read ఆర్సెల్ మిట్టల్.. కార్పొరేట్లలోనే ఓ సక్సెస్ స్టోరీ.. పల్లె నుంచి లండన్ వరకు..

నిర్దేశిత సంఖ్య కంటే ఎక్కువ సార్లు కార్డుదారు తన పేరు, పుట్టినతేదీ, లింగ మార్పులు చేసుకోవాలంటే ఆ వ్యక్తి దగ్గర్లోని ఆధార్‌ ప్రాంతీయ కార్యాలయాన్ని సందర్శించాల్సి ఉంటుంది. మార్పులపై ధ్రువపత్రాలను ఈ-మెయిల్‌ లేదా పోస్టు ద్వారా పంపాలి. సంబంధిత ధ్రువపత్రాలతో పాటు ఎందుకు తమ అభ్యర్థనను అంగీకరించాలో కూడా వివరించాల్సి ఉంటుంది. 

ఆధార్ ప్రాంతీయ కార్యాలయం కార్డుదారు నుంచి అదనపు సమాచారం కోరే అవకాశం కూడా ఉంది. అవసరమైతే క్షేత్ర స్థాయి వెరిఫికేషన్‌ కూడా ఉంటుంది. మార్పు కోసం వచ్చిన అభ్యర్థన నిజమైందేనని నిర్ధరణకు వస్తే అప్పుడు కార్డును అప్‌డేట్‌ చేస్తారు.

Follow Us:
Download App:
  • android
  • ios