బెంగళూరుకు చెందిన స్విగ్గి  సంస్థ మరియు గురుగ్రామ్ చెందిన జోమాటో విలీనంపై ఒక నివేదిక ఇచ్చాయి. అభివృద్ధి చెందుతున్న ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ మార్కెట్లో జోమటో, స్వీగ్గి అతిపెద్ద ఫుడ్ డెలివేరి సంస్థలు. అయితే వాటి విలీనం పై జోమాటో సి‌ఈ‌ఓ దీపీందర్ గోయల్ మంగళవారం ఈ వార్తలపై  ఖండించారు.

జోమాటో ప్రతినిధి మాట్లాడుతూ" తాజాగా వస్తున్న  ఉహాగానాలు పూర్తిగా అవాస్తవం".  తాము విలీనం గురించి ఎవరితోనూ చర్చలు జరపలేదని చెప్పారు. "మేము మా వ్యాపారం పై మంచి దృష్టి కేంద్రీకరించాము అలాగే లాభాలలో గొప్ప విజయాన్ని పొందుతున్నాము".అని చెప్పారు.

also read  ఎస్‌బి‌ఐలో ఎకౌంట్ తీస్తున్నారా...అయితే మీకోసమే ఇది...

 అయితే స్విగ్గి ఈ నివేదికపై స్పందించడానికి నిరాకరించారు. భారతీయ మార్కెట్లో ఫుడ్ డెలివరీ యాప్‌లతో పోటీ పడటానికి అమెజాన్ తన స్వంత ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ విభాగాన్ని ప్రారంభించడానికి సన్నద్ధమవుతోంది."అమెజాన్ మరియు ఉబెర్ ఈట్స్ వంటి కొత్త సంస్థల ప్రవేశంతో జోమాటో మరియు స్విగ్గీ విలీనం లాభదాయకంగా ఉంటుంది" అని మిస్టర్ రామ్ IANS కి చెప్పారు.

జోమాటో ప్రస్తుతం భారతదేశంలోని 1,50,000 రెస్టారెంట్ల నుండి రోజుకు 13 లక్షల ఆర్డర్‌లను, ఒక రెస్టారెంట్ నుండి రోజుకు 10 కంటే ఎక్కువ ఆర్డర్‌లకు పంపిణీ చేస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో కంపెనీ ఆదాయం మూడు రెట్లు పెరిగింది. 2018-2019లో ఇదే కాలంలో 63 మిలియన్ల నుండి  205 మిలియన్లకు చేరింది . ప్రస్తుతం జోమాటో మాత్రం 556 నగరాల్లో ఉంది.

స్విగ్గి తన సేవలను భారతదేశంలోని 500 నగరాలకు విస్తరించింది.గత ఆరు నెలల్లో 60వేల కొత్త రెస్టారెంట్లను స్విగ్గి జోడించింది. ఇది 2019 డిసెంబర్ నాటికి 600 నగరాలకు విస్తరిస్తుందని తెలిపారు. ఏప్రిల్ 2019 నుండి స్విగ్గి రెస్టారెంట్ భాగస్వాముల సంఖ్యను దాదాపు 1.8 రెట్లు పెరిగి ప్రస్తుతం 1.4 లక్షల రెస్టారెంట్లకు పెంచింది. టైర్ -3 మరియు టైర్ -4 నగరాల్లో ప్రత్యేకంగా స్విగ్గి గత ఆరు నెలల్లో 15 వేలకు పైగా  రెస్టారెంట్లలోకి  ప్రవేశించింది.

aslo read బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారా... అయితే మీకో గుడ్ న్యూస్..

బిజినెస్ కన్సల్టెన్సీ సంస్థ మార్కెట్ రీసెర్చ్ ఫ్యూచర్  తాజా అధ్యయనం ప్రకారం భారతదేశంలో ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డరింగ్ మార్కెట్ ఏటా 16 శాతానికి పైగా పెరిగి 2023 నాటికి 17.02 బిలియన్ డాలర్లను తాకే అవకాశం ఉందని రీసెర్చ్ లో పేర్కొంది. భారతదేశంలో పెరుగుతున్న ఫుడ్ టెక్ పరిశ్రమలో కొనసాగడమే కాకుండా తన వినియోగదారులకు నిరంతర డెలివరీ అనుభవం కోసం రెస్టారెంట్ భాగస్వాములతో బలమైన సంబంధాలను ఏర్పరుస్తున్నట్లు ఉబెర్ ఈట్స్ గత వారం ఐ‌ఏ‌ఎన్‌ఎస్ కు తెలిపింది.

రాబోయే మూడేళ్లలో భారతదేశంలో ఫుడ్ టెక్ పరిశ్రమ 4 బిలియన్ డాలర్ల నుండి 15 బిలియన్ డాలర్లకు పెరుగునుంది.ఒకవేళ జోమాటో-స్విగ్గి విలీనం జరిగితే వెంటనే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) పరిశీలనలోకి వస్తుంది.