ఎస్‌బి‌ఐలో ఎకౌంట్ తీస్తున్నారా...అయితే మీకోసమే ఇది...

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి కస్టమర్లకు ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. వీటిల్లో సేవింగ్స్ అకౌంట్ సర్వీసులు కూడా ఒక భాగమే. అందరితోపాటు చిన్నారులకు కూడా బ్యాంక్‌లో అకౌంట్ సేవలు అందుబాటులో ఉన్నాయి.

sbi announces new saving accounts for childrens

దేశంలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఇప్పుడు రెండు ప్రత్యేకమైన అకౌంట్లను అందిస్తోంది. పెహ్లా కదమ్, పెహ్లీ ఉడాన్ అనేవి వీటి పేర్లు. స్టేట్ బ్యాంక్ ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం ఈ అకౌంట్లను లాంచ్ చేసింది. వీటి ద్వారా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సంబంధిత అంశాల గురించి చిన్నారులకు అవగాహన కల్పించొచ్చు.

also read  బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారా... అయితే మీకో గుడ్ న్యూస్..

ఈ కొత్త అకౌంట్ కలిగిన పిల్లలు అన్ని రకాల బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించొచ్చు. ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు కూడా వీరికి అందుబాటులో ఉంటాయి. అకౌంట్ ద్వారా జరిపే ప్రతి కొనుగోళ్లపై పరిమితి ఉంటుంది. ఈ ఖాతాలకు ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు. ఈ అకౌంట్లలో గరిష్టంగా రూ.10 లక్షల వరకు బ్యాలెన్స్ కలిగి ఉండొచ్చు.

అయితే అకౌంట్ తెరిచిన వారికి చెక్‌బుక్ కూడా అందజేస్తారు. ఇందులో పిల్లల పేరుతో సహ ఉంటుంది. చెక్‌బుక్‌ను పిల్లల తల్లిదండ్రులకు అందజేస్తారు. ఇంకా ఏటీఎం కార్డు అందజేస్తారు ఆ కార్డు పై చిన్న పిల్లల ఫోటో ప్రింట్ అయి వస్తుంది. ప్రతి అక్కౌంట్ లాగే రోజుకు రూ.5,000 వరకు క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు.

also read 1.5%కే 1.71 లక్షల కోట్ల డాలర్లు: సౌదీ ఆరామ్క్ ఐపీఓ రికార్డులు

కార్డ్ ద్వారా  బిల్ పేమెంట్స్, టాప్ అప్స్ వంటి ఫెసిలిటీలు కూడా ఉంటాయి. ఒక ట్రాన్సాక్షన్ పరిమితి రూ.2 వేల వరకు ఉంటుంది.ఈ అకౌంట్‌పై చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం కూడా ఉంది. పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ కూడా లభిస్తుంది. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios