జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ సంచలన నిర్ణయం..తన సంపదలో సింహ భాగం దాన ధర్మాలకు కేటాయిస్తున్నట్లు ప్రకటన
Zerodha’s Nikhil Kamath ప్రముఖ పారిశ్రామికవేత్త స్టార్టప్ సంచలనం నిఖిల్ కామత్ తన సంపదలో సింహభాగం సామాజిక కార్యక్రమాలకు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించాడు. గివింగ్ ప్లెడ్జ్ ఫౌండేషన్ కు తన సంపదను కేటాయిస్తున్నట్లు ప్రకటించిన సంచలనంగా నిలిచారు.
Zerodha’s Nikhil Kamath కార్పొరేట్ ప్రపంచంలో దానధర్మాలు చేయడం అనేది ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తోంది. తమ జీవితకాలంలో కోట్లాది రూపాయలను సంపాదించి పరిశ్రమలను స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పించిన అనంతరం కూడా కొంతమంది కార్పోరేట్ దానకర్ణుడు తమ సంపదలో చాలా భాగాన్ని విరాళంగా ఇచ్చేస్తూ ఉంటారు. గతంలో మన భారత దేశంలో విషయానికి వస్తే అజీజ్ ప్రేమ్ జీ, హెచ్ సీఎల్ వ్యవస్థాపకుడు శివనాడార్ ఈ కోవకు చెందిన వారిలో ఉన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన సంపదలో దాదాపు ఎక్కువ భాగం దానధర్మాలకే ఖర్చు పెట్టేశాడు. అతనితోపాటు వారెన్ బఫెట్ సైతం ఫిలాంత్రఫీపై తమ సంపదలో ఎక్కువ భాగం కేటాయించారు. తాజాగా ఆ కోవలోకే జేరోదా సంస్థ కో ఫౌండర్ నిఖిల్ కామత్ కూడా చేరబోతున్నారు.
ఈ 35 సంవత్సరాల మిలియనీర్ తాను సంపాదించిన సంపదలో పెద్ద మొత్తాన్ని వారెన్ బఫెట్, బిల్ గేట్స్ 2010లో స్థాపించిన గివింగ్ ప్లెడ్జ్ ఫౌండేషన్ కు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. గివింగ్ ప్లెడ్జ్ ఫౌండేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా సంపన్న కార్పొరేట్ వ్యక్తుల నుంచి సంపదను సేకరించి ఆ డబ్బుతో అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ సంస్థలో ఒప్పందం చేసుకున్న అనంతరం తమ సంపదలో పెద్ద మొత్తాన్ని సామాజిక కార్యక్రమాలకు కేటాయించాల్సి ఉంటుంది.
గతంలో ఈ తరహాలో తమ సంపదను విరాళంగా ప్రకటించిన దాతల్లో అజీమ్ ప్రేమ్జీ, కిరణ్ మజుందార్ షా, నందన్ నీలేకని ముందు వరుసలో ఉన్నారు. ఈ సందర్భంగా నిఖిల్ కామత్ ఓ ప్రకటన చేస్తూ గివింగ్ ప్లేడ్జ్ సంస్థ ప్రపంచాన్ని మార్చేందుకు ఎంతో కృషి చేస్తుందని కొనియాడారు తాను కేటాయించిన డబ్బును సంస్థ సద్వినియోగం చేస్తుందని పూర్తి నమ్మకంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిఖిల్ కామత్ ప్రకటించారు. నా వయసు చిన్నదైనప్పటికీ నేను తీసుకున్న నిర్ణయం చాలా పెద్దదని నాకు తెలుసు కానీ నేను తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మందికి సహాయంగా నిలుస్తుందని తాను భావిస్తున్నానని సమాజం పట్ల తనకు ఉన్న బాధ్యతకు ఇది నిదర్శనం అని కామత్ పేర్కొన్నారు
ఇక నిఖిల్ కామత్ విషయానికి వస్తే 17 ఏళ్ల వయస్సులోనే స్టాక్ మార్కెట్ రంగంలో ప్రవేశించి పూర్తిస్థాయిలో నైపుణ్యం సంపాదించాడు. గడచిన రెండు దశాబ్దాల్లో కామత్ తనదైన ముద్ర వేసుకున్నాడు. జరోధా పేరిట ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కు సహవ్యవస్థపకుడిగా నిఖిల్ తన సత్తా చాటాడు ముఖ్యంగా ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగంలో జరోధ ఒక విప్లవం ఆత్మకమైన మార్పులు తెచ్చింది అని చెప్పవచ్చు.
ఇదిలా ఉంటే కేవలం నిఖిల్ కామత్ ఈ విరాళం మాత్రమే కాదు ఇప్పటికే తన కంపెనీలో ఓ పండును సృష్టించి పలు ఎన్జీవోలను సైతం నడుపుతున్నట్లు తెలుస్తోంది ఈ ఎన్జీవోలు ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణ పైన ఎక్కువగా దృష్టి సారిస్తున్నాయి.
ఇక గివింగ్ ప్లెడ్జ్ సంస్థ విషయానికి వస్తే ఈ సంస్థ 2010లో సంపన్నులు అయినా వారెన్ బఫెట్, బిల్ గేట్స్ స్థాపించారు ఈ సంస్థలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫిలాంత్రఫిస్టుల సంపదను సద్వినియోగం చేసేందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది.