Asianet News TeluguAsianet News Telugu

ఎలక్ట్రానికా ఇండియా 2024 కి యోగి సర్కార్ ఆతిథ్యం

యోగి ప్రభుత్వం సెప్టెంబర్ 11-13 తేదీల్లో గ్రేటర్ నోయిడాలో ఎలక్ట్రానికా ఇండియా 2024 కి ఆతిథ్యం ఇస్తోంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

Yogi govt hosts Electronica India 2024 showcasing UPs electronics prowess AKP
Author
First Published Sep 10, 2024, 10:36 PM IST | Last Updated Sep 10, 2024, 10:36 PM IST

 లక్నో: ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 11 నుండి 13 వరకు గ్రేటర్ నోయిడాలో సరికొత్త కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఇండియా ఎక్స్‌పో మార్ట్‌లో ఎలక్ట్రానికా ఇండియా 2024 ను నిర్వహించేందుకు యోగి సర్కార్ సిద్దమయ్యింది. దక్షిణాసియాలోనే అతిపెద్ద అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో ఇదీ ఒకటి. ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలకు చెందిన 872 మంది ప్రదర్శకులు ఎలక్ట్రానిక్ పరికరాలు, నూతన ఆవిష్కరనలను ప్రదర్శించనున్నారు. యూఎస్, తైవాన్, టర్కీ, సింగపూర్‌తో సహా 24 దేశాల నుండి ప్రముఖ కంపెనీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి.

ఆతిథ్య రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో తమ స్నేహపూర్వక విధానాలు ఎలక్ట్రానిక్ క్లస్టర్‌ల అభివృద్ధి గురించి వివరించనుంది. తద్వారా పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. పెట్టుబడి పెట్టేందుకు ముందుకువచ్చే సంస్థలకు ప్రోత్సాహకాలు అందించనుంది యూపీ సర్కార్. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు వివరించనున్నారు. ఈ కార్యక్రమం ఉత్తరప్రదేశ్ బ్రాండ్ వాల్యూను అంతర్జాతీయ స్థాయిలో పెంచడానికే కాదు రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి అవకాశాలు పెంచేందుకు తోడ్పడుతుంది. 

ఎలక్ట్రానికా ఇండియా 2024 3D ప్రింటింగ్, అడిటివ్ తయారీ, ఆటోమోటివ్,  EV టెక్నాలజీ, కాంపోనెంట్ మౌంటింగ్, కాయిల్ వేర్ ఉత్పత్తి, డిస్ప్లే ఆండ్ LED, ఎలక్ట్రానిక్ తయారీ సేవలు, హైబ్రిడ్ కాంపోనెంట్ తయారీ, సెమీకండక్టర్లుచ వైర్‌లెస్ టెక్నాలజీతో సహా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో 52 కీలక రంగాలపై దృష్టి సారించనుంది.

ఈ కార్యక్రమంలో భారతదేశం, అల్బేనియా, అర్మేనియా, ఆస్ట్రియా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, హాంకాంగ్, ఐర్లాండ్, ఇజ్రాయెల్, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మలేషియా, పోలాండ్, సింగపూర్, రష్యా, స్వీడన్, స్విట్జర్లాండ్, తైవాన్, థాయిలాండ్, టర్కీ, యూకే, యూఎస్ఐ, వియత్నాం వంటి దేశాల నుండి కంపెనీలు పాల్గొంటున్నాయి.

ముఖ్యంగా, ఎలక్ట్రానికా ఇండియా 2024 లో AI టెక్నాలజీ ఇంక్‌తో సహా యూఎస్ఐ నుండి 23 సంస్థలు,  మెస్సే మున్చెన్ షాంఘై కార్పొరేషన్ లిమిటెడ్‌తో సహా చైనా నుండి 24 కంపెనీలు,  ప్రముఖ తైవానీస్ సెమీకండక్టర్ తయారీదారు అయిన ABC తైవాన్ ఎలక్ట్రానిక్స్ కార్ప్ వంటి 49 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. 

ఈ కార్యక్రమం ప్రపంచ ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రత్యేక స్ధానంలో నిలిచేలా నిర్వహిస్తున్నారు.  ఉత్తరప్రదేశ్ తో పాటు భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికేలా వుండనుంది. 

Yogi govt hosts Electronica India 2024 showcasing UPs electronics prowess AKP

 ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఐటీ ఆండ్ ఎలక్ట్రానిక్స్ విభాగం, యూపీ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (UPLC) ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటాయి. ఈ విభాగం 145 చదరపు మీటర్ల పెవిలియన్‌ను కూడా ఏర్పాటు చేసి నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో వరుస సమావేశాలు, ఇంటరాక్టివ్ సెషన్‌లు ఉంటాయి, ఇ-మొబిలిటీ, ఇ-ఫ్యూచర్చ ఇండియా పిసిబి టెక్ కాన్ఫరెన్స్‌లు కీలకమైనవి.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios