భారతదేశంలో అత్యధిక భూమికి ఓనర్ ఎవరు? చాలా మంది ప్రభుత్వమనే చెబుతారు. అది నిజమే. ప్రభుత్వం తరువాత ఎవరి దగ్గర అత్యధిక స్థాయి భూమికి యజమాని గురించి ఇక్కడ ఇచ్చాము. ఏకంగా వీరు 17 కోట్ల ఎకరాలకు ఓనర్.
మనదేశంలో భూమికి విలువ ఎక్కువ. అందుకే రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. భూమికి ఓనర్ అయితే అతడు ధనవంతుడనే అర్థం. భూమి ఉంటే సంపద, హోదాకు చిహ్నంగా కూడా భావిస్తారు. అంతెందుకు కౌరవులు సూది మొనంత భూమి కూడా పాండవులకు ఇవ్వమని చెప్పడంతోనే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. భూమిని బంగారంతో సమానంగా చూస్తారు ఎంతోమంది. ఇప్పుడు భూమి ధరలు అత్యధికంగా ఉన్నాయి. మనదేశంలో అత్యధిక శాతం భూమికి ఓనర్ ప్రభుత్వాలే.
భారతదేశం విశాలమైన దేశం. సుమారు 32.9 లక్షల చదరపు కిలోమీటర్లు భూమి ఇక్కడ ఉంది. మరి భారతదేశంలో అత్యధిక భూమిని కలిగి ఉన్నవి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలే. వీటి తరువాల అతిపెద్ద భూస్వామి ఎవరు? వారి దగ్గర ఎంత భూమి ఉందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
భారతదేశంలో అతిపెద్ద భూస్వామి
భారతదేశంలో అతిపెద్ద భూస్వామి ప్రభుత్వాలే అని ముందుగానే చెప్పుకున్నామే. ఇక. ఆ తర్వాత స్థానంలో కాథలిక్ చర్చి ఆఫ్ ఇండియా ఉంది. ప్రభుత్వ భూమి సమాచార వ్యవస్థ (GLIS) ఇచ్చిన నివేదిక ప్రకారం ఫిబ్రవరి 2021 నాటికి భారత ప్రభుత్వం దగ్గర ఉన్న భూమి 116 ప్రభుత్వ రంగ సంస్థలు, 51 కేంద్ర మంత్రిత్వ శాఖల మధ్య పంపిణీ అయి ఉంది.
చర్చి దగ్గర ఎంత భూమి?
భారతదేశంలో కాథలిక్ చర్చి దగ్గర సుమారు 7 కోట్ల హెక్టార్లు అంటే సుమారు 17.29 కోట్ల ఎకరాలు భూమి ఉంది. ఈ భూమిలో చర్చిలు, పాఠశాలలు, ఇతర సంస్థలు ఉన్నాయి. దీని విలువ లక్ష కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. అందుకే ప్రభుత్వం తరువాత అత్యధిక భూమిని కలిగిన భూస్వామిగా ఈ క్యాథలిక్ చర్చి నిలిచింది.
ఏ మంత్రిత్వ శాఖ దగ్గర ఎంత భూమి?
- రైల్వే శాఖ - సుమారు 2926.6 చ.కి.మీ
- రక్షణ శాఖ - సుమారు 2580.92 చ.కి.మీ
- బొగ్గు గనుల శాఖ - సుమారు 2580.92 చ.కి.మీ
- విద్యుత్ శాఖ - 1806.69 చ.కి.మీ
- భారీ పరిశ్రమల శాఖ - 1209.49 చ.కి.మీ
- నౌకాశ్రయాల శాఖ - 1146 చ.కి.మీ
పైన చెప్పిన విధంగా ప్రభుత్వ భూమి పంపిణీ జరిగింది.
చర్చికి అంత భూమి ఎలా వచ్చింది?
బ్రిటిష్ వారి పాలన మనదేశంలో సాగుతున్న కాలంలోనే ఈ చర్చికి ఈ భూమి కలిసి వచ్చింది. 1927 నాటి ఇండియన్ చర్చి చట్టం ప్రకారం కాథలిక్ చర్చికి పెద్ద ఎత్తున భూమి ఇచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ కాలంలో చాలా క్రైస్తవ సంస్థలకు మత ప్రచారం కోసం చాలా తక్కువ డబ్బుకే భూమిని లీజుకు ఇచ్చేవారు. అయితే, 1965లో భారత ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసి బ్రిటిష్ కాలంలో ఇచ్చిన లీజులు ఇక చెల్లవని ప్రకటించింది. కానీ ఇప్పటికీ ఆ భూములు చర్చి ఆధీనంలోనే ఉన్నాయి. కానీ వివాదాలు కూడా మాత్రం ఇంకా సాగుతున్నాయి.
కాథలిక్ చర్చి అనేది ప్రపంచంలోనే అతి పెద్ద క్రైస్తవ సంఘం. దాదాపు 140 కోట్ల మంది దీనిలో సభ్యులుగా ఉన్నాయి. పోప్ నాయకత్వంలో వీరు ఉంటారు. జెరూసలేంలో ఇది ప్రారంభమైందని అంటారు. మనదేశంలో కూడా 23 మిలియన్లకు పైగా కేథలిక్స్ ఉన్నారు. వీరిలో మనదేశంలో ఎన్నో చర్చిలు ఉన్నాయి. బ్రిటిష్ కాలంలోనే ఈ చర్చిలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా గోవాలోని బాసిలికా ఆఫ్ బోమ్ జీసెస్ ప్రధానమైన చర్చి.
