ప్రపంచంలో అత్యంత ధనవంతురాలు ఎవరో తెలుసా
ప్రపంచంలోనే అందరికంటే ధనవంతుడు ఎవరంటే ఈజీగా ఎలోన్ మస్క్ అని చెప్పేస్తారు. మరి మహిళల్లో ధనవంతురాలు ఎవరంటే డౌట్ లేకుండా ఆయన భార్య అని మీరు అంటే మీరు తప్పులో కాలేసినట్టే. బిలియనీర్లలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉన్నారు. వారిలో టాప్ 1 మహిళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా అందరూ ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు అనే మాట్లాడుకుంటారు. కాని ప్రపంచంలో అత్యంత ధనవంతురాలు ఎవరన్న విషయం గురించి పెద్దగా చర్చ జరగదు. ఎందుకంటే అత్యంత ధనవంతుడి భార్య అత్యంత ధనవంతురాలు అవుతుందని అందరూ భావిస్తారు. కాని అది తప్పు. ఎందుకంటే వారి పేరు ఉన్న ఆస్తుల ద్వారా వారు ధనవంతులవుతారు. ఈ విధంగా చూస్తే పురుషులతో సమానంగా, ఒక్కో సారి అంతకంటే ఎక్కువ సంపాదించే మహిళలు కూడా ఉన్నారు.
2024 ఫోర్బ్స్ నివేదిక ప్రకారం..
2024 ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా $1.56 ట్రిలియన్ల నికర విలువ కలిగిన 327 మంది మహిళలు ఉన్నారు. దీన్ని బట్టి వారు కూడా బిలియనీర్ల జాబితాలో ఉన్నారు. వారిలో టాప్ 1 ప్లేస్ లో ఉన్న మాత్రం ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్.
ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలు. ఆమె ఫ్రెంచ్ దేశస్తురాలు. బిజినెస్ ఒమెన్ మాత్రమే కాకుండా ఆమె ఫిలాంత్రపిస్ట్ కూడా. ఆమె ఆస్తి విలువ దాదాపు $100 బిలియన్లు. ఆమె L'Oreal వ్యవస్థాపకుడైన యూజీన్ షుల్లెర్ మనవరాలు. 2017లో ఆమె తన తల్లి మరణించారు. దీంతో ఆమె వారసత్వంగా వచ్చిన వ్యాపార బాధ్యతలు తీసుకున్నారు. ఆమె L'Oreal సంస్థలో 33 శాతం వాటాను కలిగి ఉన్నారని ఫోర్బ్స్ నివేదిక ద్వారా తెలుస్తోంది.
అంతేకాకుండా ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్1997 నుంచి L'Oreal సంస్థలో డైరెక్టర్‌గా ఉన్నారు. ఇవే కాకుండా బెట్టెన్‌కోర్ట్ స్కెల్లర్ ఫౌండేషన్‌కు ఫ్రాంకోయిస్ ఫౌండర్, ప్రెసిడెంట్ కూడా. ఈ ఫౌండేషన్ సైన్స్, ఆర్ట్స్‌ను అభివృద్ధి చేసే వారికి ప్రోత్సాహం ఇస్తుంది. సమాజ అభివృద్ధికి కూడా కృషి చేస్తుంది.