Asianet News TeluguAsianet News Telugu

ఫారం-16తో ఐటీ రిటర్న్స్ చేయండిలా..!

అసలు ఆదాయ పన్ను చెల్లింపుకు ఫారం-16కి సంబంధం ఏమిటి.. ఈ సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..

what is the main role form16 has in income tax filling

ఉద్యోగం, వ్యాపరం, వృత్తి ఏదైనా సరే.. ఆదాయచట్టం ప్రకారం పన్ను కట్టాల్సిందే. ఆ పన్ను కట్టాల్సిన సమయం ప్రస్తుతం రానే వచ్చింది.  దీంతో అందరూ దానిని చెల్లించడం కోసం పరుగులు తీస్తున్నారు. మనకు సంవత్సరానికి వచ్చే ఆదాయానికి తగ్గట్టుగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.  దీంతో ఉద్యోగులు ఫారం-16 తీసుకొని, ఆన్‌లైన్‌లో రిటర్నులు దాఖలు చేసేందుకు  సిద్ధమవుతున్నారు. అయితే  ఇంకా చాలా మంది ఈ ఫారం-16 గురించి తెలుసుకునే పనిలోనే ఉన్నారు. అసలు ఆదాయ పన్ను చెల్లింపుకు ఫారం-16కి సంబంధం ఏమిటి.. ఈ సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..

ఫారం-16 ప్రాదాన్యత ఏమిటి?
  1961 ఐటీ చట్టంలోని సెక్షన్ 203 కిందకు ఫారం-16 వస్తుంది.  వచ్చే ఆదాయం ఎంత.. అందులో మీరు క్లైం చేసుకున్న మినహాయింపులు ఏంటి .. మొత్తంలో ఎంత పన్ను విధించారు( టీడీఎస్)లాంటి సమాచారం ఫారం-16లో ఉంటాయి.  పన్ను చెల్లింపులో ఈ ఫారం కీలకపాత్ర పోషిస్తుంది.

ఫారం-16, ఫారం-16ఎ తేడా ఏమిటి?
ఒక వేళ మీరు ఫ్రీలాన్సర్ ఉద్యోగి కానీ .. ఒప్పంద ఉద్యోగి గానీ అయ్యి ఉంటే  ఈ విషయాన్ని  ఫారం16 ఏ లో పొందుపరచాల్సి ఉంటుంది.  ఫారం16ఏ అనేది మీ కంపెనీ యజమాని నుంచిమీరు తీసుకునే టీడీస్ ప్రమాణ పత్రం లాంటిది. 

ఫారం-16ని ఎలా పొందాలి?
ఉద్యోగులందరికీ ఫారం-16 ఇవ్వాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంటుంది.  ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో  వీటిని అందజేస్తారు. చాలా మంది ఉద్యోగులు ఈ ఫారాన్ని ఆన్ లైన్ ద్వారాపంపిస్తుంటారు. కొన్ని అత్యవర పరిస్థితుల కారణంగా కొందరు ఉద్యోగాలు మారుతుంటారు. అలాంటి వారు రెండు కంపెనీల వద్ద నుంచి ఈ ఫారాన్ని తీసుకోవాల్సి  ఉంటుంది. 

ఈ ఫారం16లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి పార్ట్ ఏ, మరోకటి ఫార్ట్ బి.   పార్ట్ ఏలో ఉద్యోగికి సంబంధించిన పాన్ నెంబర్, చిరునామా, వచ్చే ఆదాయం, టీడీఎస్ వంటి సమాచారం ఉంటుంది.ఫార్ట్ బిలో ఉద్యోగ ఆదాయం, ఇతర ఆదాయాలు, మినహాయింపులు ఉంటాయి. అంతేకాకుండా ఇందులో పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా చెల్లించి ఉంటే అవి తిరిగి మీ ఖాతాలోకి కూడా వస్తాయి. 

ఫారం-16 అందుబాటులో లేకపోతే ఏం చేయాలి?
ఫారం-16తో మనం సులభంగా పన్ను చెల్లించవచ్చు. ఏదైన కారణం వలన ఫారం-16ను పొందలేక పోతే  ఆదాయపు పన్ను శాఖ ఇ ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి  ఫారం 26ఏఎస్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.ఇందులో పన్ను చెల్లింపులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. తద్వారా పన్ను చెల్లించవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios