సారాంశం
బ్యాంకు అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరికీ డెబిట్ కార్డు ఉంటుందని తెలిసిందే. ఒకప్పుడు అకౌంట్‌లో డబ్బులు తీయాలంటే బ్యాంకుకు వెళ్లి లైన్‌లో నిలబడి, వోచర్ రాసి పెద్ద తతంగం ఉండేది. కానీ ప్రస్తుతం డెబిట్ కార్డుతో ఏటీఎమ్‌లో డబ్బులు డ్రా చేస్తున్నారు. అదే విధంగా ఆన్‌లైన్ పేమెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే డెబిట్ కార్డు ఎప్పుడు మొదలైంది.? అసలు ఈ బ్యాంకు చరిత్ర ఏంటి.? లాంటి సమగ్ర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
నగదు లావాదేవీలకు బదులుగా బ్యాంకులు జారీ చేసే కార్డును డెబిట్ కార్డ్ అంటారు. ఈ కార్డుతో మనకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. అలాగే ఏటీఎమ్ సెంటర్స్ నుంచి నగదు విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు.
మొదటి డెబిట్ కార్డ్:
బ్యాంక్ ఆఫ్ డెలావేర్ 1966లో నగదు లేదా చెక్కులను తీసుకెళ్లేందుకు ప్రత్యామ్నాయంగా డెబిట్ కార్డ్ పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. వ్యాపారులను వారి వెలుపల ఉన్న బ్యాంకులతో అనుసంధానించే సాంకేతికత లేని కారణంగా ఈ బ్యాకు డెబిట్ కార్డ్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
ATM డెబిట్ కార్డ్:
యునైటెడ్ స్టేట్స్‌లో మొట్టమొదటి ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్ (ATM) 1969లో న్యూయార్క్‌లోని రాక్‌విల్లేలోని కెమికల్ బ్యాంక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఖాతాదారులు పిన్ నెంబర్ ఎంటర్ చేసి డబ్బులు విత్‌డ్రా చేసే అవకాశం అప్పటి నుంచి లభించింది. డెబిట్ కార్డులు 1970 తర్వాత పెద్ద ఎత్తున అందరికీ అందుబాటులోకి వచ్చాయి.
డెబిట్ కార్డును ఎవరు రూపొందించారు.?
డెబిట్ కార్డును 1950లో డైనర్స్ క్లబ్ పేరుతో ఒక కార్డును రూపొందించారు. దీనిని మొదటి ఆధునిక డెబిట్ కార్డుగా పిలుస్తుంటారు. న్యూయార్క్‌లో డిన్నర్‌కి వెళ్లినప్పుడు ఫ్రాంక్ మికామరా తన వాలెట్‌ను మర్చిపోయాడు. ఆ సమయంతో తన భాగస్వామి సైతం ఉంది. నగదు తీసుకెళ్లని సమయంలో చెల్లింపులు ఎలా చేయాలన్న ఆలోచన నుంచే డైనర్స్ క్లబ్ కార్డ్‌ను రూపొందించారు.
భారతదేశంలో డెబిట్ కార్డ్:
భారత్‌లో డెబిట్ కార్డులను ప్రవేశపెట్టిన మొదటి ప్రైవేట్ బ్యాంక్‌గా ఐసీఐసీఐ నిలిచింది.
భారతదేశంలో డెబిట్ కార్డులు:
డైనర్స్ కార్డ్:
భారతదేశంలో 1961లో మొట్టమొదటిసారి డైనర్స్ కార్డులను ప్రవేశపెట్టారు.
బ్యాంక్ డెబిట్ కార్డ్:
భారతదేశంలో సెంట్రల్ బ్యాంక్ 1980లో మొట్టమొదటి క్రెడిట్ కార్డును ప్రారంభించింది.
డెబిట్, క్రెడిట్ కార్డ్‌లు
ఐసీఐసీఐ బ్యాంక్ 2015లో మొట్టమొదటి డెబిట్, క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. "ATM కార్డ్" అనే పదం ATMల నుండి డబ్బును విత్‌డ్రా చేయడానికి డెబిట్ కార్డ్‌లను ఉపయోగించడం నుంచి వచ్చింది. భారతదేశంలో మొట్టమొదటి ATMను 1987లో HSBC బ్యాంక్ ప్రవేశపెట్టింది. ఖాతా తెరిచే సమయంలో బ్యాంకులు డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులను జారీ చేస్తాయి. తమ ఖాతాదారులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో బ్యాంకులు వీటిని అందిస్తాయి. ఖాతాదారులు కోరిక మేరకే కార్డులను జారీ చేస్తారు. ఖాతాదారుడు అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో డెబిట్ కార్డు కావాలని అభ్యర్థిస్తేనే కార్డును అందిస్తారు.
డెబిట్ కార్డ్:
* ఈ కార్డు ద్వారా డబ్బులు విత్‌డ్రా చేస్తే మీ సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా అవుతాయి.
* ఈ కార్డును ఉపయోగించుకోవాలంటే కచ్చితంగా మీ సేవింగ్స్ ఖాతాలో డబ్బులు ఉండాలి.
* మీ ఆదాయం, కరెంట్ లేదా సేవింగ్ ఖాతా ప్రకారం డెబిట్ కార్డ్ జారీ చేస్తారు.
* ఈ కార్డ్‌పై EMI ఆప్షన్ అనేది సదరు బ్యాంక్, కస్టమర్ మధ్య ఒప్పందం ప్రకారం ఉంటుంది.
డెబిట్ కార్డుల ప్రయోజనాలు ఏమిటి?
డెబిట్ కార్డ్‌ని ఉపయోగించి ATM నుండి డబ్బు తీసుకోవచ్చు , వస్తువులు కొనడానికి ఉపయోగించవచ్చు. ఒక ఖాతా నుంచి మరో ఖాతాలోకి డబ్బును పంపించుకోవచ్చు. ఆన్‌లైన్‌లో వస్తువులను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు. కొన్ని డెబిట్ కార్డులకు బోనస్ పాయింట్లు, గ్యాస్ బ్యాక్, ఉచిత ఇన్సూరెన్స్ వంటివి లభిస్తాయి. మన ఖాతా ద్వారా ఎంత డబ్బు ఖర్చు చేశాం వంటి వివరాలను ఈమెయిల్, ఎస్ ఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చు.
ఆరు రకాల డెబిట్ కార్డులు ఏమిటి?
వీసా డెబిట్ కార్డ్: ఈ కార్డ్ వీసా చెల్లింపు సేవతో ఒప్పందం ఆధారంగా జారీ చేస్తారు.
రూపే డెబిట్ కార్డు: ఈ కార్డును భారతదేశంలో ఉపయోగించడం కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది.
మాస్టర్ కార్డ్: ఈ కార్డు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ లావాదేవీల కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ కార్డులను ఉపయోగిస్తున్నారు.
మాస్ట్రో డెబిట్ కార్డు:
మాస్ట్రో డెబిట్ కార్డ్‌లు సైతం ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్నాయి. ATMల నుంచి నగదు విత్‌డ్రాతో పాటు ఆన్‌లైన్‌లో ప్రొడక్ట్‌లను కొనుగోలు చేసేందుకు పయోగపడుతుంది.
కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్‌లు:
ఇది నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC) టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. వీటితో స్వైపింగ్ లేకుండానే కేవలం మిసిన్‌పై ఉంచితే చాలు చెల్లింపులు పూర్తి చేసుకోవచ్చు.
వీసా ఎలక్ట్రాన్ డెబిట్ కార్డ్‌లు:
వీసా ఎలక్ట్రాన్ డెబిట్ కార్డ్‌లు వీసా డెబిట్ కార్డ్‌ల మాదిరిగానే ఉంటాయి. కానీ వారు ఓవర్‌డ్రాఫ్ట్ ఆప్షన్ లభిస్తుంది.
డెబిట్ కార్డుపై ఏముంటాయి.?
డెబిట్ కార్డుపై కార్డు హోల్డర్ పేరుతో పాటు 16 అంకెల్ నెంబర్ ఉంటుంది. అలాగే కార్డును ఎప్పుడు జారీ చేశారు.? గడువు ఎప్పటితో ముగియనుంది.? లాంటి వివరాలు పొంది పరిచి ఉంటాయి. వీటితో పాటు EMV చిప్ సిగ్నేచర్, బార్, కార్డ్ ధృవీకరణ విలువ వంటి అంశాలను అందిస్తారు.
డెబిట్ కార్డ్ ఫీజు: డెబిట్ కార్డ్ ఫీజులు అనేవి మారుతూ ఉంటాయి. ఒక బ్యాంకుకు మరో బ్యాంకుకు మారుతుంది.
వార్షిక రుసుము: బ్యాంకుల పాలసీ ప్రకారం డెబిట్ కార్డ్ వినియోగ రుసుము రూ. 100 నుంచి రూ. 500 వరకు ఉంటుంది. క్రెడిట్ కార్డులకు ఇది మరింత ఎక్కువగా ఉంటుంది.
కార్డ్ మార్పిడి రుసుము: కొన్ని బ్యాంకులు ఎటువంటి కార్డ్ మార్పిడి రుసుమును వసూలు చేయవు. ముఖ్యంగా కార్డులు పాడైపోతే ఎలాంటి ఛార్జీ ఉండదు. కానీ కార్డు పోయిందని కొత్త కార్డు అడిగితే హెచ్ డీఎఫ్ సీ వంటి బ్యాంకులు రూ. 200 వసూలు చేస్తాయి. ఇక కొన్ని బ్యాంకులు కార్డు పోయినా, పాడైపోయినా రూ. 100 నుంచి ర. 300 వరూ వసూలు చేస్తుంది.
విత్‌డ్రా ఛార్జీలు:
డెబిట్ కార్డుతో డబ్బులను విత్‌డ్రా చేసినా కొన్ని బ్యాంకులు ఛార్జీలను వసూలు చేస్తాయి. ముఖ్యంగా ఇతర బ్యాంకుల ఏటీఎమ్‌ల నుంచి డబ్బులను విత్‌డ్రా చేస్తే ట్రాన్సాక్షన్‌కు రూ. 10 నుంచి రూ. 30 వరకు వసూలు చేచేస్తుంది.
అంతర్జాతీయంగా ఉపయోగిస్తే:
అంతర్జాతీయంగా డెబిట్ కార్డులను ఉపయోగించడానికి ఛార్జీలను వసూలు చేస్తాయి. కార్డ్ బ్యాలెన్స్ చెకింగ్, విదేశీ కరెన్సీ ఉపసంహరణల కోసం రుసుము వసూలు చేస్తారు. మన ఎంత మొత్తంతో విత్‌డ్రా చేస్తామన్న దానిట్టి ఛార్జీలు ఆధారపడి ఉంటాయి.
డెబిట్ కార్డ్ పొందడానికి అర్హతలు ఏమిటి?
భారతీయుడై ఉండాలి, 15 ఏళ్లు పైబడి ఉండాలి. మీ ఇంటి చిరునామా, గుర్తింపు కార్డును కచ్చితంగా బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉండాలి.
బ్యాంక్ పాలసీల ప్రకారం వార్షిక నిర్వహణ రుసుమును చెల్లిస్తుండాలి.
కావాల్సిన డాక్యుమెంట్స్..
పాన్ కార్డ్, ఒకవేళ పాన్ కార్డ్ లేకపోతే ఫామ్ 16ని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే రెండు లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు కావాల్సి ఉంటుంది.
గుర్తింపు కార్డు:
ఐడీ ప్రూఫ్ కోసం ఓటర్ ఐడీ కార్డు లేదా పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఇక ఇంటి అడ్రస్ ప్రూఫ్ కోసం ఓటర్ ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్ వంటివి అవసరపడతాయి.
డెబిట్ కార్డ్ కోసం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి?
నేరుగా బ్యాంకులో కూడా బెబిట్ కార్డు అప్లైచేసుకోచచు. అయితే డెబిట్ కార్డు కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఖాతా పెన్ చేస్తు్న సమయంలోనే డెబిట్ కార్డు కావాలనే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఒకవేళ మీకు అప్పటికే ఖాతా ఉండి డెబిట్ కార్డు లేకపోతే నేరుగా బ్యాంకుకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది.
డెబిట్ కార్డ్ ఎలా పని చేస్తుంది?
చదరపు ఆకారంలో ఉండే ప్లాస్టిక్ కార్డు బ్యాంకు ఖాతాకు లింక్ అయి ఉంటుంది. కార్డుపై 16 అంకెలు ఉంటాయి. అలాగే నాలుగు లేదా ఐదు యూనిక్ CCV కోడ్‌లు ఉంటాయి. కస్టమర్ బ్యాంక్ ఖాతాలో ఉన్న మొత్తాన్ని బట్టి ఖర్చు పరిమితి ఉంటుంది. డెబిట్ కార్డ్‌పై కాల పరిమితి ఉంటుంది. తేదీ తర్వాత బ్యాంక్ కొత్త కార్డ్‌ని జారీ చేస్తుంది. డెబిట్ కార్డ్ లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నుంచి విత్‌డ్రా చేసుకోవచ్చు. మీరు డెబిట్ కార్డ్‌ని ఉపయోగించిన ప్రతిసారీ మీ మొబైల్‌కు మెసేజ్ వస్తుంది.
ఏటీఎమ్ డెబిట్ కార్డు వినియోగం:
డెబిట్ కార్డులను ఏటీఎమ్ నుంచి విత్‌డ్రా చేసేందుకు ఉపయోగిస్తారు. ఈ కార్డులతో మొబైల్ బిల్లులు, విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చు.
చెక్‌బుక్ ఇస్తారా: డెబిట్ కార్డు ఉంటే చెక్‌బుక్ తీసుకోవడానికి అర్హులు కారా అనే ప్రశ్న రావడం సహజం. అయితే డెబిట్ కార్డు ఉన్నా చెక్‌బుక్ పొందొచ్చు. బ్యాంకులో దరఖాస్తు చేసుకుంటే మీ చిరునామాకు వస్తుంది.
ATM కార్డ్‌ల ద్వారా పన్నులు చెల్లించడం: ఏటీఎమ్ కార్డుతో పన్ను చెల్లింపులు చేసేందుకు కార్డ్ హోల్డర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యక్ష పన్ను చెల్లింపు కోసం మాత్రమే ఈ సేవను ఉపయోగించుకోవచ్చు. ఈ సేవను ఎంచుకున్న సమయంలో డెబిట్ కార్డ్ హోల్డర్ ఖాతా నుంచి బకాయి మొత్తం డెబిట్ అవుతుంది. ఆ తర్వాత డెబిట్ హోల్డర్‌కు ప్రత్యేక నెంబర్‌ను కేటాయిస్తారు. ఇది వారు మత పన్నులు చెల్లించుకోవడానికి టోకెన్‌గా ఉపయోగించాల్సి ఉంటుంది.
ATM కార్డ్ ద్వారా మొబైల్ ఫోన్ రీఛార్జ్‌లు: డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి మొబైల్ రీఛార్జ్‌లు చేయవచ్చు. దీన్ని చేయడానికి, డెబిట్ కార్డ్ అందుకున్న బ్యాంక్ ATMకి వెళ్లండి. కార్డ్ హోల్డర్ వారి మొబైల్ నంబర్ మరియు ATM పిన్‌ను నమోదు చేయడం ద్వారా లావాదేవీని ధృవీకరించాల్సి ఉంటుంది.
డెబిట్ కార్డ్‌ల రకాలు: ప్రామాణిక డెబిట్ కార్డ్‌లు: ఈ కార్డులను బ్యాంకులు జారీ చేసిన సేవింగ్స్ ఖాతాలకు లింక్ చేస్తారు.
ప్రీపెయిడ్ డెబిట్ కార్డ్‌లు: ఈ రకమైన డెబిట్ కార్డ్‌లు డబ్బుతో లోడ్ చేయబడతాయి. బ్యాంక్‌కి లింక్ చేయబడలేదు.
వర్చువల్ డెబిట్ కార్డ్‌లు: ఆన్‌లైన్ లావాదేవీలు, డిజిటల్ వాలెట్ల కోసం మాత్రమే వీటిని ఉపయోగిస్తారు.
డెబిట్ కార్డుల ప్రయోజనాలు:
డెబిట్ కార్డులను ఉపయోగించడం వల్ల నగదును క్యారీ చేయాల్సిన అవసరం ఉండదు. దీంతో డబ్బు భ్రద్రత విషయంలో ఎలాంటి టెన్షన్ ఉండదు. డబ్బు పోగొట్టుకుంటామన్న భయం ఉండదు. కార్డును జాగ్రత్తగా దాచుకుంటే సరిపోతుంది.
డైరెక్ట్ ఫండింగ్: ఈ కార్డుల్లో యూజర్లు తమ నగదును పిరిమితితోనే ఖర్చు చేసే అవకాశ ఉంటుంది. దీంతో ఎక్కువ ఖర్చు చేయరు. అప్పుల బాధ నుంచి బయటపడొచ్చు.
ప్రపంచ ఆమోదం: ATM కార్డ్‌లను ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వ్యాపారులు ఉపయోగిస్తున్నారు.
భద్రత: పోయిన డెబిట్ కార్డ్‌ను వెంటనే రిపోర్ట్ చేయడం వల్ల మోసాన్ని నిరోధించవచ్చు.
సెక్యూరిటీ రిస్క్‌లు: అయితే డెబిట్ కార్డు విషయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కార్డ్ స్కిమ్మింగ్, ఫిషింగ్ వంటి సమస్యలు రావొచ్చు.
రివార్డ్ స్కీమ్‌లు: డెబిట్ కార్డ్‌లు సాధారణంగా క్రెడిట్ కార్డ్‌ల మాదిరిగా క్యాష్‌బ్యాక్, రివార్డ్ స్కీమ్‌లను అందించవు.
క్రెడిట్ స్కోర్: కేవలం డెబిట్ కార్డులు మాత్రమే ఉపయోగిస్తే క్రెడిట్ స్కోర్ పెరిగే అవకాశం ఉండదు.
డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మధ్య తేడా ఏంటి.?
డెబిట్ కార్డ్: డెబిట్ కార్డులో కేవలం మీ సేవింగ్స్ ఖాతాలో ఉన్న డబ్బును మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అదే క్రెడిట్ కార్డులో అయితే మీ దగ్గర డబ్బులేకపోయినా చెల్లింపులు చేయొచ్చు. క్రెడిట్ కార్డును ఉపయోగించడం వల్ల క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. క్రెడిట్ కార్డుపై రూ. 2500 అంతకు మించి కొనుగోళ్లు చేస్తే ఈఎమ్‌ఐకి కన్వర్ట్ చేసుకునే సదుపాయం లభిస్తుంది. క్రెడిట్ కార్డులపై రూ. 500 వరకు వార్షిక ఫీజులు వసూలు చేస్తారు. అదే డెబిట్ కార్డులో ఛార్జీలు నామమాత్రంగా ఉంటాయి.
డెబిట్ కార్డుకు సంబంధించి తరచూగా వచ్చే సందేహాలు, సమాధానాలు.
డెబిట్ కార్డ్‌లో CVV అంటే ఏమిటి?
ఇది డెబిట్ కార్డు ధృవీకరణగా చెబుతారు. కార్డు వెనకాల మూడు అంకెల్లో ఉంటుంది. ఇది కార్డు హోల్డర్ గుర్తింపును ధృవీకరించడానికి అందించారు.
జీవితకాలం ఉచిత డెబిట్ కార్డ్ అందిస్తారా.?
అవును హెచ్‌ఎస్‌బీసీ వంటి జీవితకాల డెబిట్ కార్డును అందిస్తారు. దీనికి ఎలాంటి రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ఏటీఎం కార్డు, డెబిట్ కార్డు ఒకటేనా?
కాదు.. ఏటీఎమ్, డెబిట్ కార్డు భిన్నమైనవి. ఏటీఎమ్ మెషీన్ నుంచి నగదు విత్‌డ్రా చేయడానికి ఏటీఎమ్ కార్డు ఉపయోగపడుతుంది. అలాగే ఆన్‌లైన్ చెల్లింపుల కోసం డెబిట్ కార్డును ఉపయోగించుకోవచ్చు.
ATM కార్డ్‌ని డెబిట్ కార్డ్‌గా ఉపయోగించవచ్చా?
లేదు, ATM కార్డ్‌లను డెబిట్ కార్డ్‌లుగా ఉపయోగించలేరు. అయితే డెబిట్ కార్డును ఏటీఎం కార్డుగా ఉపయోగించుకోవచ్చు.
ఆన్‌లైన్ చెల్లింపులు చేయడానికి నేను ATM కార్డ్‌ని ఉపయోగించవచ్చా?
ఆన్‌లైన్ చెల్లింపు చేయడానికి ముందు ATMని ఉపయోగించలేరు. అయితే, కొన్ని బ్యాంకులు ఇప్పుడు ఆ ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టాయి. ఇప్పుడు ఏటీఎం కార్డు వినియోగదారులు ఆన్‌లైన్‌లో కూడా చెల్లించవచ్చు.
నేను నా ATM కార్డ్ పిన్ నంబర్‌ని మార్చవచ్చా?
అవను మీ ఏటీఎమ్ కార్డు పిన్‌ను ఎప్పుడైనా మార్చుకోవచ్చు.
రోజువారీ ATM విత్‌డ్రాలపై పరిమితి ఉందా?
అవును.. బ్యాంకులు దీన్ని నిర్ణయిస్తాయి.
డెబిట్ కార్డులు ఎన్ని సంవత్సరాలు చెల్లుతాయి?
సాధారణంగా డెబిట్ కార్డు వ్యాలిడిటీ ఎనిమిదేళ్లు ఉంటుంది. ఇది కూడా ఆయా బ్యాంకులపై ఆధారపడి ఉంటుంది.
నా బ్యాంక్ ఖాతాలో డబ్బు లేకుండా డెబిట్ కార్డ్‌ని ఉపయోగించవచ్చా?
సేవింగ్స్ అకౌంట్‌లో డబ్బు లేకపోతే కార్డ్‌ని ఉపయోగించలేరు. అయితే కొన్ని బ్యాంకులు మాత్రం ఓవర్‌డ్రాఫ్ట్ పేరుతో ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి.
డెబిట్ కార్డ్ ఎక్కువ కాలం ఉపయోగించకుంటే పెనాల్టీ ఛార్జ్ ఉంటుందా?
అవును. నాన్-ఇంప్లిమెంటేషన్ కింద కొన్ని బ్యాంకులు పెనాల్టీని విధించే అవకాశం ఉంది.
డెబిట్ కార్డ్ పిన్‌లో ఎన్ని అంకెలు ఉంటాయి?
నాలుగు అంకెలు ఉంటాయి.
నేను ఒక డెబిట్ కార్డ్‌తో పలు బ్యాంకుల సేవలను పొందొచ్చా?
అవును. కొన్ని బ్యాంకులు దీన్ని అనుమతిస్తాయి.
నేను తప్పు పిన్ నంబర్‌ను నమోదు చేస్తే ఏమి జరుగుతుంది?
మీరు మూడు కంటే ఎక్కువ సార్లు తప్పు పిన్ నమోదు చేస్తే, బ్యాంక్ డెబిట్ కార్డ్‌ను బ్లాక్ చేస్తుంది. భద్రతా కారణాల కోసమే ఇలా చేస్తార.
డెబిట్ కార్డ్ పోతే ఏం చేయాలి?
వెంటనే మీ బ్యాంకుకుకు ఈ విషయాన్ని తెలియజేయాలి. మీ బ్యాంక్ ఖాతా నెంబర్‌ను చెబితే వెంటనే కార్డును బ్లాక్ చేస్తారు.
కొత్త డెబిట్ కార్డ్ పిన్ నంబర్ ఎన్ని రోజులు చెల్లుబాటవుతుంది?
భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి మూడు నెలలకు పిన్‌ని మార్చుకోవచ్చు.
డెబిట్ కార్డ్‌ల భవిష్యత్తు ఎలా ఉంటుంది.?
బయోమెట్రిక్ కార్డ్‌లు: మరింత ఎక్కువ భద్రత కోసం డెబిట్ కార్డ్‌లను వేలిముద్ర లేదా రెటీనా స్కానింగ్‌తో అనుసంధానించే అవకాశాలు ఉన్నాయి.
పర్యావరణ అనుకూల కార్డులు: రీసైకిల్ ప్లాస్టిక్ కార్డులు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.
డిజిటల్-ఫస్ట్ కార్డ్ : యాప్ లేదా వర్చువల్ ద్వారా కార్డ్‌లు లేకుండా డిజిటల్ కార్డ్‌లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
డెబిట్ కార్డ్ వినియోగం :
వ్యాపారుల వద్ద: టెర్మినల్ వద్ద స్వైప్ చేయండి. అదే విధనంగా ఆన్‌లైన్‌లోనే కొనుగోళ్లు చేయడానికి కార్డ్ నెంబర్, గడువు తేదీ, సీవీవీని ఉపయోగించవచ్చు. ఇక నగదు విత్‌డ్రా కోసం ఏటీఎమ్ కార్డును ఉపయోగించుకోవచ్చు.
భద్రతా చిట్కాలు:
మీ డెబిట్ పిన్‌ను గోప్యంగా ఉంచాలి. అనధికార లావాదేవీల కోసం మీ ఖాతాను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. ఎల్లప్పుడూ మంచి పిన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. పిన్‌ను ఎవితోనూ షేర్ చేసుకోవద్దు. కార్డ్ పోయినా లేదా దొంగిలించినా వెంటనే మీ బ్యాంకుకు తెలియజేయాలి.