Asianet News TeluguAsianet News Telugu

బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ? వెంటనే రూ.10 లక్షల లోన్ కావాలా.. ఇదే సులువైన మార్గం !

కేంద్ర ప్రభుత్వం 2015లో పారిశ్రామికవేత్తల కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు ఆర్థిక సహాయం అందజేస్తారు. 
 

Want to start a business? Get loan of Rs. 10 lakh immediately... Here is the easy way-sak
Author
First Published Mar 14, 2024, 11:58 AM IST

సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించే ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నవారికి డబ్బు సమస్యగా ఉంటుంది. ఇందుకు వారు ఆందోళన చెందవల్సిన ఆవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం  ముద్రా యోజన కింద రూ.10 లక్షల వరకు బ్యాంకు లోన్  అందిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం 2015లో పారిశ్రామికవేత్తల కోసం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు ఆర్థిక సహాయం అందజేస్తారు. కార్పొరేట్లు ఇంకా  వ్యవసాయం పై ముద్ర యోజన పథకం కింద లోన్  పొందలేరు.

ముద్ర లోన్ ఎక్కడ పొందాలి?

ముద్రా పథకం కింద ఒక్కో వ్యక్తికి రూ.10 లక్షల వరకు బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ద్వారా లోన్ అందజేస్తారు. ఈ లోన్ మొత్తాన్ని పొందడానికి తాకట్టుగా ఎం పెట్టాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత గుర్తింపుకు సంబంధించిన ప్రాథమిక డాకుమెంట్స్ తో  మాత్రమే లోన్ పొందవచ్చు.

ముద్రా లోన్  ఎవరు పొందవచ్చు?

భారతదేశ పౌరులు ఎవరైనా ఈ పథకం నుండి ప్రయోజనం పొందేందుకు అర్హులు. చిన్న వ్యాపార సంస్థను ప్రారంభించడానికి ఇష్టపడే ఎవరైనా ఈ పథకం కింద లోన్  పొందవచ్చు. తయారీ, ట్రేడింగ్ అండ్  సర్వీస్   రంగాలలో వ్యాపారం ప్రారంభించాలనుకునే వారు కూడా ఈ పథకం కింద లోన్  పొందవచ్చు.

ముద్రా లోన్ దరఖాస్తుదారులు  కనీసం 3 సంవత్సరాల వ్యాపార అనుభవం కలిగి ఉండాలి. అలాగే పారిశ్రామికవేత్తలు  24 నుంచి 70 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న వారై  ఉండాలి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?

ముద్రా లోన్ దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. మీరు చేయాల్సిందల్లా పేరు, ఇమెయిల్ చిరునామా, మొబైల్ నంబర్ వంటి వివరాలతో రిజిస్టర్ చేసుకోండి. ముద్రా పథకం కింద రుణాలపై వడ్డీ రేటు రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా లోన్  ఇచ్చే బ్యాంకు లేదా ఆర్థిక సంస్థలచే నిర్ణయించబడుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios