Asianet News TeluguAsianet News Telugu

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ కరోనా వైరస్ పేరుతో వాల్​మార్ట్​ బంపర్​ ఆఫర్

కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వాల్​మార్ట్​ సంస్థ బంపర్​ ఆఫర్​ ప్రకటించింది. అమెరికాలో కొత్తగా 1,50,000 మందికి వాల్​మార్ట్​లో పనిచేసే అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా బోనస్​ల రూపంలో 365 మిలియన్​ డాలర్ల(రూ.36.5 కోట్లు)ను చెల్లించనుంది. 

Walmart to hire 150,000 workers as coronavirus spreads in US
Author
Hyderabad, First Published Mar 21, 2020, 1:09 PM IST

శాన్ ఫ్రాన్సిస్కో: కరోనా విజృంభిస్తుండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉద్యోగాలు కోల్పోయిన వేళ ఈ-రిటైల్ సంస్థ వాల్ మార్ట్ ఓ తీపి కబురు చెప్పింది. వినియోగదారులు అమెరికాలోనే నిత్యావసర వస్తువుల కోసం చేసే ఆర్డర్లను అందించేందుకు కొత్తగా 1,50,000 మందిని చేర్చుకోనున్నట్లు ప్రకటించింది. 

అంతే కాకుండా వారికి బోనల్​ల రూపంలో 365 మిలియన్​ డాలర్ల (36.5 కోట్ల)ను ఈ దిగ్గజ సంస్థ చెల్లించనుంది. ‘వీరిని మొదటగా తాత్కాలికంగా తీసుకొని తర్వాత కాలంలో శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తాం.

ఫుల్​టైమ్ ఉద్యోగం చేసిన వారికి 300 డాలర్లు, పార్ట్​టైమ్​ ఉద్యోగులకు 150 డాలర్లను బోనస్​గా అందిస్తాం’ అని వాల్​మార్ట్​ సీఈఓ డౌగ్ మెక్‌మిలన్ చెప్పారు. 

also read స్టాక్ మార్కెట్ల భారీ నష్టాలకు అడ్డుకట్ట వేసేందుకు...సెబీ ఆంక్షలు...

సంక్షోభం సమయంలో వినియోగదారులకు అంకితభావంతో సేవ చేసేవారికి బహుమతి చెల్లించాలని నిర్ణయించుకున్నట్లు వాల్​మార్ట్​ తెలిపింది. తర్వాతి త్రైమాసికం బోనస్​ల చెల్లింపులు కూడా వేగవంతం చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు దాదాపు 550 మిలియన్లను కేటాయించింది.

కరోనా మహమ్మారి వల్ల అమెరికా  వ్యాప్తంగా ప్రయాణాలపై ఆంక్షలు విధించడమే కాకుండా అనేక సంస్థలు మూతపడ్డాయి. దీనివల్ల దాదాపు 70 వేల మంది ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి ఇళ్లకే పరిమితం అయ్యారు.

also read కస్టమర్ల ఆరోగ్యం కోసం డొమినోస్ పిజ్జా కొత్త సర్వీస్...

ప్రస్తుతం ఈ నియామకాలను వేగవంతం చేయడమే కాకుండా దరఖాస్తు ప్రక్రియ సమయాన్ని రెండు వారాల నుంచి 24 గంటలకు తగ్గిస్తున్నట్లు వాల్ మార్ట్ సీఈఓ డౌగ్ మెక్ మిలన్ తెలిపారు.

ఇంతకుముందు అమెజాన్ కూడా అమెరికాలో వస్తువుల డెలివరీ కోసం లక్ష మంది వర్కర్లను నియమించుకోనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోయి పని లేని వారికి తాత్కాలిక ఉపాధి కల్పిస్తున్నట్లు వాల్ మార్ట్ తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios