ప్రముఖ జర్మనీ ఫుట్ వేర్ బ్రాండ్ వాన్ వెల్క్స్ దాని ఉత్పత్తుల తయారీ స్థావరాన్ని చైనా నుండి భారతదేశానికి మార్చాలని నిర్ణయించినట్లు అధికారిక నివేదికలు తెలిపాయి. కరోనా వైరస్ సంక్షోభం మధ్య విదేశీ సంస్థలను ఆకర్షించడానికి, భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రముఖులతో సమావేశాలు నిర్వహించిన కొద్ది రోజుల తరువాత ఈ ప్రకటన వెల్లడైంది.

కాసా ఎవర్జ్ జిఎమ్‌బి యాజమాన్యంలోని దాని ఉత్పత్తి ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో ఉన్న ఇట్రిక్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఉన్నట్లు సమాచారం.ఈ సహకారం వల్ల  10 వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలను సృష్టించడానికి సహాయపడుతుందని ఐట్రిక్ ఇండస్ట్రీస్ డైరెక్టర్, సిఇఒ ఆశిష్ జైన్ అన్నారు.

also read కరోనా ఎఫెక్ట్: చైనాతో ఒప్పందంపై మాట మార్చిన ట్రంప్..

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి (ఎంఎస్‌ఎంఇ) ఉదయ్ బహన్ సింగ్ కూడా దీనిని స్వాగతించారు. "చాలా మందికి ఉపాధి కల్పించబోయే కాసా ఎవర్జ్ జిఎంబి పెట్టుబడులు చైనా నుంచి ఇప్పుడు భారతదేశానికి, ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ ఎంచుకోవడాన్ని మేము చాలా సంతోషంగా ఉన్నాము" అని ఆయన అన్నారు.

పురుషులు, మహిళల కోసం ఆర్థోపెడిక్ పాదరక్షలను విక్రయించే బ్రాండ్ 80 దేశాలలో 100 మిలియన్లకు పైగా వినియోగదారులలో స్తోర్లను కలిగి ఉంది. ఇది 2019 లో భారతదేశంలో ప్రారంభించారు దాదాపు 500కి పైగా రిటైల్, ఆన్‌లైన్ షాపులలో వాటి ఉత్పత్తులు లభిస్తున్నాయి.

కోవిడ్ -19 మహమ్మారి, బీజింగ్ విధించిన ఆంక్షల కారణంగా చైనా నుండి వైదొలగాలని  చూస్తున్నసంస్థల నుండి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించే వ్యూహంపై ప్రధాని నరేంద్ర మోడీ గత నెలలో ఒక సమావేశం నిర్వహించారు.