Vivo T4x 5G: ఏదైనా స్మార్ట్ ఫోన్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ ఫీచర్లు ఉన్నాయంటే దాని ధర కచ్చితంగా రూ.30 వేలు పైనే ఉంటుంది. అయితే వివో కంపెనీ ఇండియాలో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ వివో T4x 5G ని రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అద్భుతమైన AI ఫీచర్లు ఉన్నాయి. అయితే దీని ధర కేవలం రూ.14 వేల నుంచి ప్రారంభమవడం నిజంగా షాకింగ్ విషయమే. వివో T4x 5G స్మార్ట్ ఫోన్ ఫీచర్లు తెలుసుకుందాం రండి.  

వివో కంపెనీ ఇండియాలో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ వివో T4x 5G ని రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో AI కెమెరా ఫీచర్లు, మీడియాటెక్ చిప్‌సెట్ ఉన్నాయి. ఇంకా ఇది 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీ లాంటి బెస్ట్ ఫీచర్లను కలిగి ఉంది. 

వివో T4x 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇక్కడ ఉన్నాయి

ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72 ఇంచ్ డిస్‌ప్లేతో వస్తోంది. ఇందులో రెండు సిమ్ స్లాట్‌లు ఉన్నాయి. ఈ డ్యుయల్ సిమ్ స్లాట్స్ రెండూ 5G సిమ్ లను సపోర్ట్ చేస్తాయి. అంతేకాకుండా ఈ ఫోన్ స్క్రీన్ కంటి చూపును ఎఫెక్ట్ చేయదు. ఎందుకుంటే ఇది TUV Rheinland సర్టిఫికేషన్ పొందింది. ఈ స్మార్ట్ ఫోన్ 1050 నిట్స్ సామర్థ్యంతో అత్యధిక బ్రైట్‌నెస్ ని ఇస్తుంది. 

మీడియాటెక్ డైమెన్సిటీ 7300 CPU, 8GB వరకు ర్యామ్ ఈ ఫోన్లో ఉన్నాయి. ఇంకా వివో 8 GB వరకు వర్చువల్ ర్యామ్ ఎక్స్‌టెన్షన్‌ను కూడా ఇస్తోంది. దీనివల్ల మల్టీటాస్కింగ్ బాగా జరుగుతుంది.

వివో T4x 5Gలో AI ఫీచర్లు ఇవిగో..

వివో T4x 5Gలో ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌ టచ్ OS 15 ఇన్ స్టాల్ చేశారు. ఇందులో లైవ్ టెక్స్ట్, సర్కిల్ టు సెర్చ్, AI స్క్రీన్ ట్రాన్స్‌లేషన్ లాంటి AI ఫీచర్లు ఉన్నాయి.

కెమెరా విషయానికొస్తే 4K వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 50MP AI మెయిన్ కెమెరా ఫోటోలు తీయడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లకి ఈ ఫోన్ బాగా నచ్చుతుంది. కెమెరా యాప్‌లో తక్కువ వెలుతురులో ఫోటోలు తీయడానికి నైట్ మోడ్ ఉంది. గ్యాలరీ యాప్‌లో AI ఎరేజర్, AI ఫోటో ఎన్‌హాన్స్‌మెంట్, AI డాక్యుమెంట్ మోడ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.

6500mAh బ్యాటరీతో వివో T4x 5G బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. T4x 5G కి IP64 రేటింగ్ ఉంది. దీనివల్ల దుమ్ము, నీటి తుంపర్ల నుంచి ఫోన్‌ను కాపాడుకోవచ్చు. 

వివో T4x 5G మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది

వివో T4x 5G మూడు వేరియంట్లలో వస్తోంది. బేసిక్ మోడల్ 13,999 రూపాయలు. దీనిలో 128GB స్టోరేజ్, 6GB ర్యామ్ ఉంటాయి. మిడిల్ మోడల్ 14,999 రూపాయలు. దీనిలో 128GB స్టోరేజ్, 8GB ర్యామ్ ఉంటాయి. టాప్ మోడల్ 16,999 రూపాయలు. దీనిలో 256GB స్టోరేజ్, 8GB ర్యామ్ ఉంటాయి.

ఫ్రాంటో పర్పుల్, మెరైన్ బ్లూ కలర్స్‌లో ఈ ఫోన్ లభిస్తుంది. మార్చి 12న ఫ్లిప్‌కార్ట్, వివో ఆన్‌లైన్ స్టోర్, కొన్ని పార్టనర్ షాపుల్లో ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఉంటుంది. HDFC, SBI, Axis Bank కార్డ్‌లతో పేమెంట్ చేస్తే వివో వెంటనే 1,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తోంది.

తక్కువ ధరలో మంచి ఫీచర్లు కావాలనుకునే వాళ్లకి ఈ స్మార్ట్‌ఫోన్ బెస్ట్ ఆప్షన్. దీని బ్యాటరీ లైఫ్, AI కెమెరా ఫీచర్లు చాలా బాగుంటాయి.