కరోనా వైరస్ కారణంగా చాలాకాలం నిలిచిపోయిన ముంబై లోకల్ ట్రైన్స్ మళ్లీ ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుతం రైలు రద్దీ అంతగా లేదు. అయితే త్వరలో సెంట్రల్ రైల్వే వారు లోకల్ ట్రైన్స్ లో ప్రయాణికులు సినిమాలు, సీరియల్స్, వీడియో పాటలను చూసే విధంగా ప్రణాలికలు రూపొందిస్తోంది.

వచ్చే వర్షాకాలం లోగా రైలు బోగీల లోపల ఈ  ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీ ఏర్పాటు చేయనున్నారు, తద్వారా ప్రయాణీకులు  ప్రయాణించేటప్పుడు ఎంటర్టైన్మెంట్  సౌకర్యం పొందవచ్చు. ఇప్పటికే ఎంటర్టైన్మెంట్ మోడ్లకు కంటెంట్, ప్రకటనలను జోడించింది.

ఈ సౌకర్యం కోసం రైలులో ప్రయాణించే ప్రయాణీకులు మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మొబైల్ యాప్ సహాయంతో రైల్  కోచ్‌ లోపల సినిమాలు, సీరియల్స్ ఇంకా ఇతర కంటెంట్ చూడవచ్చు.

also read ఆ దేశంలో కుమార్తెను తండ్రి వివాహం చేసుకోవచ్చు.. ప్రపంచంలోని వింత చట్టాలు గురించి తెలుసుకోండి.. ...

ప్రయాణీకులకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, దాని సహాయంతో వారు లోకల్ భాషను ఎన్నుకోవచ్చు. దీని ద్వారా వారి స్థానిక బాష కంటెంట్  చూడవచ్చు.  అలాగే వారు తమ మొబైల్ ఫోన్లలో లోడ్ చేసిన సినిమాలు, సీరియళ్లను ఈ మోడ్లలో చూడవచ్చు.

ప్రయాణికులు ఇంటర్నెట్ లేకుండా కూడా ఈ కంటెంట్ చూడవచ్చు. రైల్ కోచ్‌ లోపల ఏ సౌకర్యం కోసం  ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని సెంట్రల్ రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.  

వర్షాకాలంలోగా రైలు బోగీలలో ఈ డివైజెస్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ డివైజెస్ 165 లోకల్ రైళ్లలో ఇన్‌స్టాల్ చేయనున్నట్లు వివరించారు.  

ఇంతకుముందు సెంట్రల్ రైల్వే ఈ డివైజెస్ పరీక్షించింది. ప్రస్తుతం, లగ్జరీ రైళ్ల ఆపరేషన్‌లో లోడ్ చేసిన ఇన్ఫోటైన్‌మెంట్ కంటెంట్ సౌకర్యం ఇప్పటికే కల్పించింది. ఈ లగ్జరీ రైళ్లలో వీడియోలు, పాటలు, సినిమాలు లేదా సీరియల్స్ ఎల్‌సిడి టివిలలో చూడవచ్చు.