యూపీఐ ట్రాన్సాక్షన్స్ @ రూ.100 కోట్లు.. మూడేళ్లలోనే రికార్డు
ఆన్ లైన్ చెల్లింపుల కోసం మూడేళ్ల క్రితం 2016లో నోట్ల రద్దుకు ముందు కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ సంస్థ (యూపీఐ)ను తీసుకొచ్చింది. కానీ రికార్డు స్థాయిలో సంస్థ లావాదేవీలు మూడేళ్లలోనే రూ.100 కోట్లకు చేరుకున్నాయి.
ముంబై: అక్టోబర్ నెలలో యూపీఐ పేమెంట్స్ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) సంస్థ జంట మైలురాళ్లను దాటింది. లావాదేవీల్లో బిలియన్ మార్కును దాటేసింది యూపీఐ. మొదలైన మూడేళ్లలోనే యూపీఐ ఈ ఘనతను సాధించడం విశేషం. ఇటీవలే యూపీఐ యూజర్ల సంఖ్య కూడా 10 కోట్లను కూడా అధిగమించింది. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఈ పేమెంట్స్ సిస్టమ్ చాలా వేగంగా ఎదిగింది.
భారతదేశంలో పేమెంట్స్‌లో సాధించిన ప్రగతితో ఇప్పుడు యూపీఐ ప్లాట్‌ఫామ్‌ను సింగపూర్, యూఏఈలలోనూ అందుబాటులోకి తేవాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రయత్నిస్తోంది. పెద్ద నోట్ల రద్దుకు ముందు 2016 లో యూపీఐ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది కేంద్రంలోని మోదీ సర్కార్.
also read పన్నుల్లో కోత.. ‘ఐటీ’ లిమిట్స్‌పై ‘నిర్మల’ ఫోకస్
వినియోగదారులు తమ బ్యాంకు ఖాతా నుంచి ఇతరుల బ్యాంకు అకౌంట్ వివరాలు ఎంటర్ చేయకుండానే డబ్బు పంపుకునే వీలును యూపీఐ కల్పిస్తోంది. దేశంలో డిజిటల్ పేమెంట్స్‌కు ఊపు ఇచ్చేందుకే యూపీఐ ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశ పెట్టింది కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్.
సోషల్ మీడియా లేదా ఇతర ప్లాట్‌ఫామ్స్‌కు 10 కోట్ల మంది యూజర్లు చేరడానికి పట్టిన టైంతో పోలిస్తే, చాలా తక్కువ టైంలోనే తాము ఈ ఘనతను సాధించగలిగామని ఎన్‌పీసీఐ సీఈఓ దిలీప్ ఆస్బె చెప్పారు. ఆగస్టులో ఇండియాలో కార్డ్ ట్రాన్సాక్షన్స్ (డెబిట్, క్రెడిట్ కలిపి) మొత్తం 142 కోట్లకు చేరాయన్నారు.
also read ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 5.5 శాతానికే
వివిధ బ్యాంకులకు తమ సొంత యాప్స్ ఉన్నా, అవన్నీ యూపీఐతో అనుసంధానమై ఉంటాయి. ఓపెన్ ఆర్కిటెక్చర్‌తో యూపీఐని అభివృద్ధిపరచడంతో ఇది సాధ్యమవుతోంది. వార్షికంగా పరిశీలిస్తే యూపీఐ ట్రాన్సాక్షన్స్ 2.3 రెట్లు పెరిగాయి. సెప్టెంబర్ నెలలో యూపీఐ లావాదేవీలు రూ.955.02 మిలియన్ల మేరకు జరిగాయి. యూపీఐతో ప్రస్తుతం 141కి పైగా బ్యాంకులు లావాదేవీలు జరుపుతున్నాయి.