యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2024: సాంప్రదాయ కళలకు యోగి స్టైల్లో బ్రాండింగ్

సెప్టెంబర్ 25-29 వరకు ఉత్తర ప్రదేశ్ లో ఇంటర్నేషనల్ ట్రేడ్ షో- 2024 నిర్వహించనున్నారు. ఈ షో ద్వార రాష్ట్రీయంగా తయారయ్యే ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసేందుకు యోగి సర్కార్ ప్రయత్నిస్తోంది. 

 

 

UP International Trade Show 2024: A Global Platform for Traditional Entrepreneurs AKP

లక్నో : ఉత్తర ప్రదేశ్‌ లో నిరుద్యోగం అనేదే లేకుండా చేయాలని యోగి సర్కార్ భావిస్తోంది.అందులో భాగంగానే ఓవైపు ప్రభుత్వ ఉద్యోగ భర్తీ చేపడుతూనే మరోవైపు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలను సృష్టించే ప్రయత్నం చేస్తోంది యూపీ ప్రభుత్వం. ఇక రాష్ట్రంలో సాంప్రదాయ వృత్తులవారికి సహకారం అందించి వారి జీవనోపాధిని మెరుగుపర్చే ప్రయత్నం చేస్తోంది యోగి. అందులో భాగంగానే సెప్టెంబర్ 25-29 వరకు  రాష్ట్రంలో ఇంటర్నేషనల్ ట్రేడ్ షో నిర్వహిస్తోంది. 

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ప్రతి వేదికపై రాష్ట్ర ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు ప్రయత్నిస్తుంటారు. అంతేకాకుండా, వివిధ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో స్వయంఉపాధి పొందేవారికి తమ ఉత్పత్తులను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకోసమే ఇంటర్నేషన్ ట్రేడ్ షో ఏర్పాటుచేసారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాాలని యోగి సర్కార్ సూచిస్తోంది. 

ఈ ట్రేడ్ షో కోసం వారణాసి, అయోధ్య, గోరఖ్‌పూర్, ప్రయాగ్‌రాజ్, ఝాన్సీ ప్రాంతాలకు చెందిన 270కి పైగా స్థానిక, సంప్రదాయ ఉత్పత్తుల తయారీదారులు వివిధ విభాగాలలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో హస్తకళలు, టెర్రకోటా, హ్యాండ్‌క్రాఫ్ట్స్, చిన్న తరహా పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలు, ఓడీఓపీలు వంటి వివిధ రంగాలకు చెందిన చిరు వ్యాపారులు ఉన్నారు. ఈ గొప్ప కార్యక్రమంలో వారు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు.

సాంప్రదాయ హస్తకళాకారులు, మహిళాలు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉత్సాహంగా ఉన్నారు. సీఎం యోగి విధానాలు రాష్ట్ర సంప్రదాయాన్ని కాపాడుతున్నాయని... తమ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్‌ను అందుబాటులోకి తెస్తున్నాయని వారు అంటున్నారు. దీంతో తమ ఉత్పత్తులు ప్రపంచంలోని వివిధ దేశాలకు చేరుతున్నాయి...  తమ ఆదాయం కూడా పెరుగుతోందని అంటున్నారు.

UP International Trade Show 2024: A Global Platform for Traditional Entrepreneurs AKP

వారణాసి ప్రాంతంనుండి 44 మంది హస్తకళాకారులు : 

వారణాసి ప్రాంతంనుండి నుండి 44 మంది హస్తకళాకారులు, చిరు వ్యాపారులు, మహిళలు ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ షోలో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. పరిశ్రమల శాఖ జాయింట్ కమిషనర్ ఉమేష్ సింగ్ మాట్లాడుతూ... యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షోలో వారణాసి, చందౌలి, జౌన్‌పూర్, ఘజియాబాద్‌ జిల్లాల నుండి కళాకారులు పాల్లొంటున్నారని తెలిపారు. 

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (చెక్క బొమ్మలు, గులాబీ మీనాకారీ, తివాచీలు, పానీయాలు, వైద్య ఉత్పత్తులు, బయో ఎరువులు, మసాలా నూడుల్స్, బనారస్ పట్టు పరిశ్రమ మొదలైనవి) నుండి కూడా ఉత్పత్తిదారులు పాల్గొంటున్నారని తెలిపారు. బనారస్ పట్టు చీరలు, తివాచీల పరిశ్రమ నుండి 8 మంది కొత్త ఉత్పత్తిదారులు పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఉమేష్ సింగ్ వెల్లడించారు.

వారణాసి పరిధిలోని 4 జిల్లాలలో వివిధ విభాగాలకు చెందిన కళాకారుల సంఖ్య

ఎంఎస్‌ఎంఈ మహిళా యువ ఉద్యోగులు

  • వారణాసి: 6
  • జౌన్‌పూర్: 4
  • ఘజియాబాద్: 2
  • చందౌలి: 4

ఒక జిల్లా ఒక ఉత్పత్తి

  • వారణాసి:15
  • జౌన్‌పూర్: 3
  • ఘజియాబాద్: 1
  • చందౌలి: 1

కొత్త ఎగుమతిదారులు

  • వారణాసి: 8

ఆగ్రా నుండి 134 మంది వ్యవస్థాపకుల రిజిస్ట్రేషన్ 

యూపీఐటీఎస్ 2024లో పాల్గొనడానికి ఆగ్రా పరిధిలోని 134 మంది హస్తకళాకారులు, కొత్త ఉత్పత్తిదారులు, మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో ఆగ్రా నుండి 51, మథుర నుండి 23, ఫిరోజాబాద్ నుండి 56, మైన్‌పురి నుండి 4 మంది ఉన్నారు. వీరిలో ఆగ్రా నుండి డోవర్ ఫుట్‌వేర్, గుప్తా ఓవర్సీస్, స్టోన్‌మాన్ వంటి ఎగుమతి సంస్థలు ఉన్నాయి. బ్రజ్ ప్రాంతంలోని సంప్రదాయ హస్తకళలు, ఆధునిక ఉత్పత్తులకు ఈ కార్యక్రమం ద్వారా మంచి వేదిక లభిస్తుంది.

ఇక గోరఖ్‌పూర్ నుండి ఓడీఓపీ కింద ఐదు (నాలుగు టెర్రకోటా, రెడీమేడ్ దుస్తులు), ఎంఎస్‌ఎంఈ కింద ఆరు, ఇతర విభాగాల నుండి ఇద్దరు ఉత్పత్తిదారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అదేవిధంగా కుషీనగర్ జిల్లా నుండి ఓడీఓపీ, ఎంఎస్‌ఎంఈ కలిపి నాలుగు రిజిస్ట్రేషన్లు, మహరాజ్‌గంజ్‌లో ఐదు, దేవరియాలో మూడు రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. 

ప్రయాగ్‌రాజ్‌లో 7 మంది వ్యవస్థాపకుల రిజిస్ట్రేషన్ 

ప్రయాగ్‌రాజ్‌లో మొత్తం 7 మంది వ్యవస్థాపకులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, వీరిలో 3 ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు చెందినవారు ఉన్నారు. ఈ వ్యవస్థాపకులకు ట్రేడ్ షోలో రాయితీ ధరలకు స్టాల్స్ లభిస్తాయి. వీరిలో మెస్సర్స్ ఇకావో అగ్రో డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్, మెస్సర్స్ ఆర్.డి. ఎంటర్‌ప్రైజెస్, మెస్సర్స్ మునీర్ అలీ ఆండ్ మెస్సర్స్ హ్యాపీ కల్చర్ ఉన్నారు. అదేవిధంగా ఎంఎస్‌ఎంఈ యూనిట్లలో మెస్సర్స్ మెస్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్, మెస్సర్స్ విష్ణు సేల్స్ ఉన్నాయి.

అయోధ్య జిల్లా నుండి ముగ్గురు వ్యవస్థాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంబేద్కర్ నగర్ నుండి ఓడీఓపీ కింద 4, సుల్తాన్‌పూర్ నుండి ఎంఎస్‌ఎంఈ కింద 2, ఓడీఓపీ కింద 1, బారాబంకీ నుండి ఎంఎస్‌ఎంఈ కింద 4. ఓడీఓపీ కింద 2,  అమేథీ నుండి 2 ఓడీఓపీ ఉత్పత్తులకు సంబంధించిన వ్యవస్ధాపకులకు యూపీఐటీఎస్ 2024లో పాల్గొనే అవకాశం లభిస్తుంది.

ఝాన్సీ, లలిత్‌పూర్, జలాన్ నుండి 10 మంది ఉత్పత్తిదారులు

యూపీఐటీఎస్ 2024లో ఝాన్సీ పరిధిలోని మూడు జిల్లాల నుండి 10 మంది వ్యవస్థాపకులు పాల్గొననున్నారు.  ఝాన్సీ, లలిత్‌పూర్, జలాన్ కు చెందిన ఉత్పత్తులను ప్రదర్శిస్తారు.  ట్రేడ్ షోలో పాల్గొనడానికి జలాన్ నుండి 1, లలిత్‌పూర్ నుండి 2, ఝాన్సీ నుండి ఏడుగురు వ్యవస్థాపకులు ప్రతిపాదనలు సమర్పించారు. జలాన్ జిల్లా నుండి ఆకాష్ నిరంజన్, లలిత్‌పూర్ జిల్లా నుండి సరోజ్ సింగ్, జన్మే పంత్,  ఝాన్సీ జిల్లా నుండి నీలం సారంగి, శివానీ బుందేలా, నిహారికా తల్వార్, యోగేంద్ర ఆర్య, మనోహర్ లాల్, అరుణ శర్మ, నిఖిల్ చౌదరి ట్రేడ్ షోలో పాల్గొంటారు.

ఈ ట్రేడ్ షోలో హ్యాండ్‌లూమ్, ఫార్మా,  హార్టికల్చర్, గృహాలంకరణకు సంబంధించిన ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. అదేవిధంగా బరేలీ నుండి వివిధ రంగాలకు చెందిన 22 మంది కళాకారులు, బదాయూన్ నుండి 3, పిలిభిత్ నుండి 4, షాజహాన్‌పూర్ నుండి ముగ్గురు వ్యవస్థాపకులు పాల్గొంటున్నారు. మొత్తం మీద బరేలీ పరిధిలోని 32 మంది వ్యవస్థాపకులు యూపీఐటీఎస్ 2024లో పాల్గొనడం ఖరారు చేసుకున్నారు.

ఉత్పత్తిదారుల కామెంట్స్

యూపీ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో హస్తకళాకారులు, కళాకారులకు యోగి ప్రభుత్వం ఇచ్చిన గొప్ప కానుక. దీని ద్వారా అంతర్జాతీయ కొనుగోలుదారులను నేరుగా కలవగలుగుతున్నాం. మధ్యవర్తులు లేకపోవడంతో మా కళకు తగిన గుర్తింపు లభిస్తోంది. సీఎం యోగి ఓడీఓపీ, జీఐ ఉత్పత్తులకు కొత్త గుర్తింపు తెచ్చి, వాటిని స్వయంగా బ్రాండ్ చేయకపోతే ఈ కళ కనుమరుగయ్యేది. శతాబ్దాల నాటి ఈ కళతో పాటుగా దీనిపై ఆధారపడిన వారు కూడా ఉపాధి కోల్పోయేవారు. ఈరోజు ఈ కళకు పునర్జన్మ లభించడంతో కళాకారుల ఇళ్లలో చిరుదీపాలు వెలుగుతున్నాయి.

-ఖైసర్ జహాన్ అహ్మద్, డైరెక్టర్ (మొహమ్మద్ ఇజ్రాయెల్ హ్యాండీక్రాఫ్ట్)

సీఎం యోగి ఉత్తర ప్రదేశ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ షో 2024 ద్వారా బనారస్ వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా కొత్త రూపాన్ని ఇవ్వడానికి అవకాశం కల్పించారు. గతంలో బనారస్ వస్త్రాలు బయటకు వెళ్లి డిజైన్ చేయబడేవి, ఇప్పుడు ప్రభుత్వం వారణాసికి నిఫ్ట్‌ను బహుమతిగా ఇవ్వడంతో మంచి డిజైనర్లు కూడా ఇక్కడ లభిస్తున్నారు. గత సంవత్సరం జరిగిన ఇంటర్నేషనల్ ట్రేడ్ షోలో అంతర్జాతీయ కొనుగోలుదారుల నుండి మంచి వ్యాపారం జరిగింది. ఈసారి మేము మరింత మెరుగైన బనారస్ వస్త్రాలు, డిజైన్‌లతో వెళ్తున్నాం. ముఖ్యంగా మహిళల కోసం 'రెడీ టు వేర్ చీరలు' ఉన్నాయి, వీటిని విదేశీ మహిళలు, యువతులు, మెట్రో నగరాల్లోని మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

-హుర్రియా బానో, డైరెక్టర్, షీ క్రియేషన్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios