Parag Agrawal: ట్విట్టర్ ఉద్యోగులకు సీఈవోగా తొలి మొయిల్ పంపిన పరాగ్ అగర్వాల్.. అందులో ఏం చెప్పారంటే..?
ట్విట్టర్ సీఈవోగా (Twitter CEO) బాధ్యతలు చేపట్టిన తర్వాత పరాగ్.. సంస్థలోని తన తోటి ఉద్యోగులకు తొలి మెయిల్ (Parag First Email To Twitter Employees) పంపారు. ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపిన పరాగ్.. ‘మనం కలిసి చేసేదానికి పరిమితి లేదు’ అని వ్యాఖ్యానించారు.
భారత సంతతికి చెందిన టెక్కీ పరాగ్ అగర్వాల్ (Parag Agrawal) ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సె (Jack Dorsey) సోమవారం ఆ బాధత్యల నుంచి తప్పుకోవడంతో.. పరాగ్ అగర్వాల్ ఆ స్థానంలో నియమితులయ్యారు. ఇప్పటివరకు పరాగ్ ఆ కంపెనీ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఇక, ట్విట్టర్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరాగ్.. సంస్థలోని తన తోటి ఉద్యోగులకు తొలి మెయిల్ (Parag First Email To Twitter Employees) పంపారు. ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపిన పరాగ్.. ‘మనం కలిసి చేసేదానికి పరిమితి లేదు’ అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా జాక్ మార్గదర్వకత్వానికి, స్నేహానికి తాను కృతజ్ఞుడనని చెప్పారు. ఇప్పుడు ప్రపంచం మరింతగా తమని గమనిస్తుందని.. ట్విట్టర్ పూర్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపిద్దాం అని పిలుపునిచ్చారు.
తాను 10 ఏళ్ల క్రితం కంపెనీలో చేరానని.. అప్పుడు ఇక్కడ 1,000 కంటే తక్కువ ఉద్యోగులు ఉన్నారని గుర్తుచేసుకున్నారు. అప్పటి రోజులు తనకు నిన్నటిలాగే అనిపిస్తున్నాయని చెప్పారు. తన జర్నీలో హెచ్చు తగ్గులు, సవాళ్లు, అడ్డంకులు, విజయాలు, తప్పులను చూశానని పరాగ్ అగర్వాల్ చెప్పారు. కానీ అప్పుడైనా.. ఇప్పుడైనా.. తాను ట్విట్టర్ అద్భుతమైన ప్రభావాన్ని, నిరంతర పురోగతిని, ముందున్న అద్భుతమైన అవకాశాలను చూస్తున్నట్టుగా వెల్లడించారు.
Also read: ట్విట్టర్ కొత్త సిఈఓ పరాగ్ అగర్వాల్ నెలకి ఎంత సంపాడిస్తున్నాడో తెలుసా..
‘మన లక్ష్యం ఎప్పుడూ ముఖ్యమైనది కాదు. మన ఉద్యోగులు, మన సంస్కృతి ప్రపంచంలో అన్నింటి కంటే భిన్నమైనది. మనం కలిసి చేసేదానికి పరిమితి లేదు.
ప్రతిష్టాత్మక లక్ష్యాలను చేరుకోవడానికి మేము ఇటీవల మన వ్యూహాన్ని నవీకరించాము. ఆ వ్యూహం సరైనదని నేను నమ్ముతున్నాను. అయితే దానిని అమలు చేయడానికి, ఫలితాలను అందించడానికి మనం ఎలా పని చేస్తామనేదే క్లిష్టమైన సవాలు.
ఆ విధంగా మన కస్టమర్‌లు, షేర్ హోల్డర్‌లు, మీలో ప్రతి ఒక్కరికీ ఉత్తమంగా Twitterని అందిస్తాము. మీరు ఎక్కడ పని చేస్తారో.. ఆ చోటును ప్రేమించాలని, కలిసి పని చేసే విధానాన్ని కూడా ఇష్టపడాలని నేను కోరుకుంటున్నాను. మీలో కొందరు నాకు బాగా తెలుసు. కొందరు కొంచెం మాత్రమే తెలుసు. మరికొందరు అసలు తెలియదు. ప్రారంభంలో మనల్ని మనం పరిశీలిద్దాం-మన భవిష్యత్తు వైపు మొదటి అడుగు వేద్దాం. మీలో చాలా ప్రశ్నలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను.. మనం చర్చించడానికి కూడా చాలా ఉన్నాయి. రేపు మనుకు Q&Aకు చర్చల కోసం చాలా సమయం తీసుకుంటాం. ఇది నేను కోరుకునే బహిరంగ, ప్రత్యక్ష సంభాషణలకు నాంది అవుతుంది’ అని పరాగ్ తన మెయిల్‌లో పేర్కొన్నారు.
పరాగ్ అగర్వాల్ ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థి. పరాగ్ అక్కడ అతను కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత తదుపరి చదువుల కోసం యూఎస్ వెళ్లారు. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అతడు డాక్టరేట్ పొందారు. అతను 2011లో Twitterలో చేరడానికి ముందు మైక్రోసాఫ్ట్, AT&T మరియు Yahooలో పని చేశారు. ట్విట్టర్‌లో చేరాక అతను యాడ్స్ ఇంజినీర్‌గా పనిచేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2017లో సంస్థ టెక్నాలజీ అధిపతిగా ప్రమోషన్ పొందారు.ఇప్పుడు ట్విట్టర్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టారు.