ట్విట్టర్ కొత్త సిఈఓ పరాగ్ అగర్వాల్ నెలకి ఎంత సంపాడిస్తున్నాడో తెలుసా..
ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే తన పదవి నుంచి వైదొలగడంతో భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ సోమవారం ట్విట్టర్ కొత్త సిఈఓగా నియమితులయ్యారు. మైక్రోబ్లాగింగ్ సైట్ కంపెనీ బోర్డు తదుపరి సిఈఓగా సిటిఓ(చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్) పరాగ్ అగర్వాల్ ని ఎన్నుకుంది.
మరోవైపు పరాగ్ అగర్వాల్ జీతం గురించి మాట్లాడితే సోమవారం కంపెనీ దాఖలు చేసిన ప్రకారం పరాగ్ అగర్వాల్ వార్షిక ప్యాకేజీగా ఒక మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 7,50,54,500 పొందుతారు. అదనంగా బోనస్‌తో పాటు రిస్టృక్టెడ్ షేర్ యూనిట్‌లతో సహా 12.5 మిలియన్ల డాలర్ల పర్ఫర్మెంస్-ఆధారిత స్టాక్ యూనిట్‌లు కూడా అందజేయబడతాయి.
జాక్ డోర్సే
జాక్ డోర్సే ఒక ట్వీట్‌లో అతను వైదొలిగిన తరువాత అతని స్థానంలో నియమితుడైన పరాగ్ అగర్వాల్‌ను మెచ్చుకున్నాడు. జాక్ డోర్సే ప్రతి ముఖ్యమైన నిర్ణయం వెనుక పరాగ్ అగర్వాల్ ఉన్నాడని, కంపెనీని మార్చడంలో అతను సహాయపడినట్లు చెప్పాడు. విశేషమేమిటంటే పరాగ్ అగర్వాల్ నవంబర్ 29న ట్విట్టర్ సిఈఓగా నియమితులయ్యారు, అతనికంటే ముందు భారత సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్ సిఈఓ సుందర్ పిచాయ్, ఐబిఎం సిఈఓ అరవింద్ కృష్ణ, అడోబ్ సిఈఓ శాంతను నారాయణ్ వంటి భారతదేశ గ్లోబల్ టెక్ సిఈఓల జాబితాలో చేరారు.
పరాగ్ అగర్వాల్ 2011లో కంపెనీతో
పరాగ్ అగర్వాల్ 2011లో ట్విట్టర్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు. దీనికి ముందు అతను యాహూ, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజా కంపెనీల పనిచేశాడు. IIT బాంబే నుండి ఇంజనీరింగ్ చేసిన తర్వాత అతను USAలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి కంప్యూటర్ సైన్స్‌లో పిహెచ్‌డి చేసాడు. ట్విట్టర్‌లో అతను అక్టోబర్ 2017లో కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO)గా నియమితులయ్యాడు. ఒక నివేదిక ప్రకారం పరాగ్ నికర విలువ 1.52 మిలియన్ల డాలర్లు అంటే సుమారు 15 కోట్ల 20 లక్షలు.
2015లో వినీతతో వివాహం
ట్విట్టర్ కొత్త సిఈఓ పరాగ్ అగర్వాల్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే అతను వినీతా అగర్వాల్‌ను వివాహం చేసుకున్నాడు. అక్టోబర్ 2015లో నిశ్చితార్థం జరిగిన తర్వాత పరాగ్ అగర్వాల్, వినీత జనవరి 2016లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం పరాగ్ అగర్వాల్ తన భార్యతో కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్నాడు, వారికి అన్ష్ అనే కుమారుడు ఉన్నాడు.