Asianet News TeluguAsianet News Telugu

ట్రేడ్ వార్: ట్రంప్ ‘సుంకాల’ ట్వీట్లు: ఉద్రిక్తతల నివారణకు డ్రాగన్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 200 మిలియన్ డాలర్ల విలువైన సుంకాలు విధిస్తామని చేసిన ప్రకటనలో చైనా- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రపంచ దేశాల మార్కెట్లన్నీ కుదేలయ్యాయి. 

Trade war to end? Chinese envoys preparing to travel to US for high-level talks
Author
Washington D.C., First Published May 7, 2019, 10:25 AM IST

వాషింగ్టన్‌/బీజింగ్‌: అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతాయా? అంటే.. చల్లబడటానికే అధిక అవకాశాలు కనపడుతున్నాయి. మరో 200 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.14 లక్షల కోట్ల) విలువ గల చైనా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు.

కానీ ‘ట్రంప్‌పై సంప్రదింపులకు అత్యున్నత వాణిజ్య రాయబార బృందాన్ని అమెరికా పంపుతామని చైనా ప్రకటించడమే’ ఈ అభిప్రాయం బలపడేందుకు కారణం. గతంలో అయితే అమెరికా, చైనా సుంకాలపై పోటాపోటీ హెచ్చరికలు చేసుకోవడం గమనార్హం. 

అమెరికా హెచ్చరికల నేపథ్యంలో, ఆ దేశంతో వాణిజ్య సంప్రదింపులకు అత్యున్నత బృంద పర్యటనను చైనా రద్దు చేయాలనే ప్రతిపాదన చేస్తోందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌, సీఎన్‌బీసీ న్యూస్‌ వంటివి ప్రకటించిన నేపథ్యంలో, చైనా విదేశీ మంత్రిత్వశాఖ ప్రతినిధి గెంగ్‌ షాంగ్‌ ‘వాణిజ్య రాయబార పర్యటన’ అంశాన్ని బయట పెట్టారు.

చైనా వైస్‌ ప్రీమియర్‌ లీ హీ వాషింగ్టన్‌ పర్యటకు వెళ్తారా అని ప్రశ్నించగా, ‘చైనా బృందం అమెరికాకు వాణిజ్య సంప్రదింపులకు వెళ్తోంది’ అని గెంగ్‌ షాంగ్‌ బదులిచ్చారు. ‘బుధవారం నుంచి చర్చలు పునఃప్రారంభమవుతాయా, చైనా నుంచి బృందం ఎప్పుడు బయలుదేరుతుంది’ వంటి వివరాలను బహిర్గతం చేయడానికి ఆయన నిరాకరించారు. 

వాస్తవానికి వైస్‌ ప్రీమియర్‌ నేతృత్వంలో వాణిజ్య ప్రతినిధి బృందం వాషింగ్టన్‌కు వెళ్లి, సంప్రదింపులు పునరుద్ధరించి, ఉద్రిక్తతలను చల్లబరచాల్సి ఉంది. శుక్రవారానికి ఒక ఒప్పందం కుదురుతుందనే అంచనాలు గతంలో వెలువడ్డాయి. అమెరికా హెచ్చరికలు గతంలోనూ పలుమార్లు వచ్చాయని, ఇప్పుడు కొత్తేమీ కాదన్నారు. 

చైనా, అమెరికా మధ్య వాణిజ్య సంప్రదింపులు 10వ రౌండ్‌కు చేరాయని, సానుకూలంగా పురోగమిస్తున్నాయన్నారు. గత డిసెంబర్ నుంచి అమెరికా, చైనా మధ్య వాణిజ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయి.

100 రోజుల్లోపు ఒప్పందం చేసుకోవాలనే అమెరికా-చైనా అధ్యక్షుల మధ్య కుదిరిన అంగీకారం మేరకు ఇవి జరుగుతున్నాయి. అయితే ఈనెల 5న ట్రంప్‌ తాజా హెచ్చరికలు చేయడంతో, మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతాయనే ఆందోళనతో ప్రపంచ స్టాక్‌మార్కెట్లు నష్టపోయిన సంగతి విదితమే.

గత 10 నెలల కాలంలో 50 బిలియన్‌ డాలర్ల హైటెక్‌ ఉత్పత్తులపై 25 శాతం, మరో 200 బిలియన్ డాలర్లు. ఇతర ఉత్పత్తులపై 10 శాతం సుంకాన్ని చైనా చెల్లించిందని అమెరికా అధ్యక్షుడు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

వచ్చే శుక్రవారం నుంచి ఈ 10 శాతం సుంకం 25 శాతం కానుంది. మాకు పంపిస్తున్న మరో 325 బిలియన్ డాలర్ల విలువైన ఇతర ఉత్పత్తులపై ఇప్పటివరకు పన్నేమీ విధించడం లేదు. కానీ త్వరలోనే వీటిపైనా 25 శాతం చేస్తాం అని ట్వీట్ చేశారు.

అమెరికాకు సుంకాలు చెల్లించడం వల్ల, ఉత్పత్తి వ్యయాలపై స్వల్ప భారం మాత్రమే పడుతుందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చైనాతో వాణిజ్య సంప్రదింపులు సాగుతున్నాయని, కానీ అతి నెమ్మదిగా.. వారు మళ్లీ ఏదో సవరించాలనుకుంటున్నారని, అదేమీ కుదరదని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

అమెరికా ఒత్తిళ్లకు చైనా తలొగ్గదని ఆ దేశ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అమెరికా తాజా ప్రతిపాదన వల్ల రసాయనాల నుంచి వస్త్రాల వరకు చైనాకు చెందిన 5000 రకాల ఉత్పత్తులపై సుంకాలు అధికమవుతాయి. 

వాస్తవానికి రసాయనాలు, వస్త్రాలు తదితర ఉత్పత్తులపై 10 శాతం సుంకాన్ని గత సెప్టెంబర్ నెలలోనే ట్రంప్‌ సుంకాలు విధించారు. ఈ ఏడాది జనవరిలో పన్ను రేటును పెంచాల్సి ఉండగా, సంప్రదింపుల నేపథ్యంలో వాయిదా వేశారు.

‘చైనాతో 100 రోజుల్లోపు వాణిజ్య ఒప్పందం కుదిరితే, సుంకాలు పెంచబోమని అర్జెంటీనా పర్యటనలో ట్రంప్‌ చెప్పారు. ఆ గడువు మార్చిలోనే పూర్తియినా కూడా, ఇప్పటివరకు పెంచలేదు. మరో 6 వారాలు ఎదురు చూస్తామనే రీతిలో ప్రకటించారు’ అని కూడా చైనా అధికార వర్గాలు గుర్తు చేస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios