Asianet News TeluguAsianet News Telugu

వరల్డ్ టాప్-10 విమానాశ్రయాల్లో హైదరాబాద్ ఆర్‌జీఐఏ: ర్యాంకెంతంటే?

ప్రపంచంలోనే 10 అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు(ఆర్‌జీఐఏ)కు  స్థానం దక్కించుకుంది. మన దేశం నుంచి టాప్-10లో స్థానం దక్కించుకున్న ఏకైక ఎయిర్‌పోర్టు హైదరాబాద్ ఆర్‌జీఐఏ కావడం విశేషం. 

Top 10 airports in the world: Just one Indian airport makes the cut
Author
New Delhi, First Published May 10, 2019, 1:49 PM IST

ప్రపంచంలోనే 10 అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు(ఆర్‌జీఐఏ)కు  స్థానం దక్కించుకుంది. మన దేశం నుంచి టాప్-10లో స్థానం దక్కించుకున్న ఏకైక ఎయిర్‌పోర్టు హైదరాబాద్ ఆర్‌జీఐఏ కావడం విశేషం. 

2019 సంవత్సరానికి గానూ విమానాశ్రయాల ర్యాంకింగ్స్‌ను ఎయిర్‌హెల్ప్ అనే సంస్థ తాజాగా విడుదల చేసింది. ఇందులో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 8వ స్థానంలో నిలిచింది. ఇక ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా ఖతార్‌లోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిలిచింది. 

ఆ తర్వాతి స్థానంలో జపాన్‌లోని టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, మూడో స్థానంలో గ్రీస్‌లోని ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మూడో స్థానంలో నిలిచాయి. కాగా, అమెరికా, యూకే నుంచి ఏ విమానాశ్రయాలు కూడా టాప్ 10లో చోటుదక్కించుకోకపోవడం గమనార్హం. 

ప్రపంచంలో టాప్‌ 10 అత్యుత్తమ విమానాశ్రయాలివే:

1. హమద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం(ఖతార్‌)

2. టోక్యో అంతర్జాతీయ విమానాశ్రయం(జపాన్‌)

3. ఏథెన్స్‌ అంతర్జాతీయ విమానాశ్రయం(గ్రీస్‌)

4. అఫోన్సో పెనా అంతర్జాతీయ విమానాశ్రయం(బ్రెజిల్‌)

5. గాన్స్‌ లెచ్‌ వలేసా ఎయిర్‌పోర్టు(పోలాండ్‌)

6. షెరెమెటేవో అంతర్జాతీయ విమానాశ్రయం(రష్యా)

7. షాంఘి ఎయిర్‌పోర్టు సింగపూర్‌(సింగపూర్‌)

8. రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(భారత్‌)

9. టెనెరిఫె నార్త్‌ ఎయిర్‌పోర్టు(స్పెయిన్‌)

10. విరాకోపస్‌/కాంపినస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం(బ్రెజిల్‌).

ఎయిర్‌పోర్టు ఆన్‌టైం నిర్వహణ, సేవల నాణ్యత, ఆహారం, షాపింగ్ అవకాశాల వంటివి పరిగణలోకి తీసుకుని ఎయిర్‌హెల్ప్ విమానాశ్రయాలకు ర్యాంకింగ్స్ ఇచ్చింది. 40 దేశాల్లోని 40వేల మంది ప్రయాణికులతో సర్వే జరిపి ఈ జాబితా రూపొందించింది. 

ఎయిర్‌హెల్ప్ ఈ జాబితాను 2015 నుంచీ విడుదల చేస్తుండగా.. అప్పటి నుంచి కూడా హమద్, టోక్యో, ఏథెన్స్ విమానాశ్రయాలు వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉండటం విశేషం.

Follow Us:
Download App:
  • android
  • ios