400 పాయింట్లకు పైగా దూసుకుపోతున్న సెన్సెక్స్ ..లాభాల మధ్య నిఫ్టీ...
రెండు రోజుల నష్టాల తరువాత దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం సెషన్‌ను సానుకూలంగా ప్రారంభించాయి.నిన్నటితో పోల్చుకుంటే 130.55 పాయింట్లు పెరిగింది.
ఆర్థిక వ్యవస్థ స్థితిపై మరింత స్పష్టత కోసం వినియోగదారుల ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తిపై అధికారిక డేటా కోసం విశ్లేషకులు బుధవారం ఎదురుచూశారు.రెండు రోజుల నష్టాల తరువాత దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం సెషన్‌ను సానుకూలంగా ప్రారంభించాయి.
ఎస్&పి బిఎస్ఇ సెన్సెక్స్ ఇండెక్స్ 439.02 పాయింట్లు పెరిగి 41,418.64 ను తాకింది. బిజినెస్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లో సెన్సెక్స్ పైకి ఎగబాకింది. అయితే ఎన్ఎస్ఇ నిఫ్టీ బెంచ్మార్క్ 12,162.05 కు పెరిగింది. నిన్నటితో పోల్చుకుంటే 130.55 పాయింట్లు పెరిగింది.
also read ఐదోవ రోజు కూడా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
బ్యాంకింగ్, ఆటో, మెటల్, ఎనర్జీ షేర్లు లాభాలతో స్టాక్ మార్కెట్లకు ఊపందించాయి. ఉదయం 9:32 గంటలకు సెన్సెక్స్ 428.11 పాయింట్లు పెరిగి 41,407.73 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 129.30 పాయింట్లు పెరిగి 12,160.80 వద్ద ట్రేడవుతోంది.
గెయిల్, టాటా మోటార్స్, టాటా స్టీల్, హిండాల్కో, యాక్సిస్ బ్యాంక్ ఐటిసిలో లాభాలు 1.97 శాతం నుండి 3.33 శాతం అధికంగా ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సెన్సెక్స్‌లో లాభాలతో అగ్రస్థానంలో నిలిచాయి. ఇవి ఇండెక్స్‌లో 150 పాయింట్లకు పైగా పెరిగాయి.
also read మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ కొత్త షిప్ చూశారా..?
చైనాలో ఇప్పటివరకు 1,000 మందికి పైగా కరోనావైరస్ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయరు. జపాన్ లో ఆసియా పసిఫిక్ షేర్ల ఎంఎస్సిఐ చివరి ఇండెక్స్ 0.95 శాతం, జపాన్ నిక్కీ 225 బెంచ్ మార్క్ 0.60 శాతం క్షీణించింది. కరోనావైరస్ వ్యాప్తి చెందుతు మరణాలు పెరుగుతున్నందున చైనాలో ఫ్యాక్టరీలు, ఇండస్ట్రిలు ఎంత త్వరగా మళ్ళీ ప్రారంభిస్తారో పెట్టుబడిదారులు అంచనా వేసినందున యుఎస్ స్టాక్స్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
ప్రపంచ ఆర్థిక వృద్ధిని భయపెడుతున్నకరోనావైరస్ దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపుతుంది అని విశ్లేషకులు అంటున్నారు. నేడు మంగళవారం ఢిల్లీ ఎన్నికలకు లెక్కింపు ప్రారంభమైంది. ఢిల్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ (బిజెపి) పై ముందంజ వేసింది.