ఐదోవ రోజు కూడా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
గత ఐదు రోజుల్లో నాలుగు ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర లీటరుకు 87 పైసల నుండి 93 పైసల వరకు తగ్గింది.ప్రస్తుతం ఉన్న స్థానిక పన్నులను బట్టి పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కో నగరాలలో ధరలు మారుతుంటాయి.
ఢిల్లీ, కోల్‌కత్తా, ముంబై, చెన్నై నాలుగు మెట్రో నగరాల్లో సోమవారం వరుసగా ఐదవ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించారు.గత ఐదు రోజుల్లో నాలుగు ప్రధాన మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర లీటరుకు 87 పైసల నుండి 93 పైసల వరకు తగ్గింది.
పెట్రోల్ ధరలను ఢిల్లీ, ముంబైలలో లీటరుకు 13 పైసలు, చెన్నైలో లీటరుకు 14 పైసలు, కోల్‌కతాలో లీటరుకు 18 పైసలు తగ్గించినట్లు ప్రభుత్వ రంగ రిఫైనర్ ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ https://www.iocl.com తెలిపింది.
also read మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ కొత్త షిప్ చూశారా..?
డీజిల్ ధరలను చెన్నై, ముంబైలలో లీటరుకు 17 పైసలు, కోల్‌కతాలో లీటరుకు 20 పైసలు, ఢిల్లీలో లీటరుకు 16 పైసలు తగ్గించారు. ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు వివరాలు
సిటీ పెట్రోల్ డీజిల్
ఢిల్లీ 72,10 65,07
కోలకతా 74,74 67,39
ముంబై 77,76 68,19
చెన్నై 74,90 68,72
గత ఐదు రోజుల్లో పెట్రోల్ ధరలను ఢిల్లీలో లీటరుకు 88 పైసలు, కోల్‌కతాలో లీటరుకు 91 పైసలు, ముంబైలో లీటరుకు 87 పైసలు, చెన్నైలో లీటరుకు 93 పైసలు తగ్గించారు.డీజిల్ ధరలను ఢిల్లీలో లీటరుకు 97 పైసలు, కోల్‌కతాలో లీటరుకు 1.02 రూపాయలు, ముంబైలో లీటరుకు 1.03 రూపాయలు, చెన్నైలో లీటరుకు 1.04 రూపాయలు తగ్గించారు.
ప్రస్తుతం ఉన్న స్థానిక పన్నులను బట్టి పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కో నగరాలలో ధరలు మారుతుంటాయి. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వంటి చమురు మార్కెటింగ్ సంస్థలు రోజు పెట్రోల్, డీజిల్ రేట్లను సమీక్షిస్తాయి. విదేశాలలో ముడి చమురు ధరలు, రూపాయి డాలర్ల విదేశీ మారకపు రేటును బట్టి రేట్లను సర్దుబాటు చేస్తారు.
also read నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్... సెన్సెక్స్ 300 పాయింట్లు పతనం
ప్రతిరోజూ ఉదయం 6:00 గంటలకు పెట్రోల్ పంపుల వద్ద ఇంధన ధరలలో ఏదైనా సవరణ ఉంటే అమలు చేయబడుతుంది.కరోనావైరస్ వ్యాప్తి తరువాత చైనా చమురు డిమాండ్ ను వ్యాపారులు అంచనా వేసినందున చమురు ధరలు సోమవారం తగ్గాయి. మార్కెట్లను బాలేన్స్ చేయడానికి ఉత్పత్తిని మరింత తగ్గించాలని ప్రధాన ఉత్పత్తిదారుల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాయి.
కరోనవైరస్ వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రపంచంలోని అతిపెద్ద చమురు దిగుమతిదారులో ఒకటైన ఇండియాలో డిమాండ్ మరియు అదనపు సరఫరా పై ప్రభావం పడింది. ఆసియా ట్రేడు ప్రారంభంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 53.63 డాలర్లకు పడిపోయింది. 2019 జనవరి నుండి ఇది కనిష్ట స్థాయి 54.37 డాలర్లకు చేరుకుంది.ముడి చమురు ధరలను సడలించడం, విదేశీ మార్కెట్లో అమెరికన్ డాలర్ బలహీనపడటం మధ్య సోమవారం రూపాయి విలువ 8 పైసలు పెరిగి 71.32 కు చేరుకుంది.