పెట్రోల్, డీజిల్ ధరలను సోమవారం మళ్ళీ పెంచారు, గత 82 రోజుల లాక్ డౌన్ తరువాత జూన్ 7 నుండి ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు రోజువారీ సమీక్షల తరువాత వరుసగా పదహారవ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి.

తాజా పెంపుతో పెట్రోల్ పై లీటరుకు రూ.8.30, డీజిల్ పై లీటరుకు రూ.9.22 పెరిగింది. పెట్రోల్ ధర లీటరుకు నేడు 33 పైసలు పెంపుతో రూ .79.56 చేరుకుంది డీజిల్ ధర లీటరుకు 58 పైసలు పెంపుతో రూ. 78.85 చేరింది.

ముంబైలో పెట్రోల్‌ లీటరుకు రూ .86.36 కు, డీజిల్‌ ధర రూ .77.24 ఉన్నట్లు ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. చెన్నైలో పెట్రోల్‌కు లీటరుకు రూ .82.87, డీజిల్ రూ .76.30. కోల్‌కతాలోని పెట్రోల్ ధర రూ .81.27, డీజిల్ ధర రూ .74.14. హైదరబాద్ లో పెట్రోల్ ధర లీటరుకు 52 పైసల పెంపుతో రూ.81.88 కు చేరింది,

also read ఇక అన్నీ ‘ఆన్‌లైన్ లావాదేవీలే’..: ఎస్‌బి‌ఐ చైర్మన్

డీజిల్ ధర రూ.76.49 చేరింది. దేశవ్యాప్తంగా అన్నీ రాష్ట్రాలపై ఈ పెంపు ప్రభావం ఉండనుంది. జూన్ 7 నుండి ఇంధన ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. డీజిల్ ధరలు తాజాగా గరిష్ట స్థాయికి చేరుకోగా, పెట్రోల్ ధర కూడా రెండేళ్ల గరిష్ట స్థాయికి చేరింది.

మార్చి 14న ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 3 రూపాయలు పెంచింది, తరువాత మే 5న పెట్రోల్ పై లీటరుకు 10 రూపాయలు, డీజిల్‌పై 13 రూపాయలు పెంచింది. అదనపు పన్ను ఆదాయంతో ప్రభుత్వానికి రూ .2 లక్షల కోట్లు చేరుతుంది.

ఇండియన్ ఆయిల్ కార్ప్ (ఐఓసి), భారత్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్ (బిపిసిఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) వినియోగదారులకు ఎక్సైజ్ సుంకం పెంపుకు బదులు, రిటైల్ రేట్ల తగ్గుదలకు వ్యతిరేకంగా వాటిని సర్దుబాటు చేసింది. అప్పటి నుండి అంతర్జాతీయ చమురు ధరలు పుంజుకున్నాయి. చమురు సంస్థలు ఇప్పుడు వాటికి అనుగుణంగా రిటైల్ రేట్లను సవరిస్తున్నాయి.