Asianet News TeluguAsianet News Telugu

Today Petrol Diesel Prices: నేటి పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లివే.. తగ్గాయా..? పెరిగాయా..?

పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ మంటలకు బ్రేక్ పడింది. గత కొన్ని నెలలుగా పెద్దగా మార్పులు లేకుండానే కొనసాగుతోంది. చమురు ధరలు స్థిరంగా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొద్దిగా వ్యత్యాసాలు ఉన్నాయి. 

Today Petrol Diesel Prices
Author
Hyderabad, First Published Jan 21, 2022, 9:18 AM IST

పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ మంటలకు బ్రేక్ పడింది. గత కొన్ని నెలలుగా పెద్దగా మార్పులు లేకుండానే కొనసాగుతోంది. చమురు ధరలు స్థిరంగా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొద్దిగా వ్యత్యాసాలు ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ (IOCL) పెట్రోల్, డీజిల్ కొత్త రేట్లను శుక్రవారం తాజాగా విడుదల చేసింది. మెట్రో నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని చాలా చోట్ల ధరల్లో హెచ్చుతగ్గులు కనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ వివరాలను వెబ్ సైట్  అందించిన సమాచారం ప్రకారం ఈవిధంగా ఉన్నాయి. 

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు వేగంగా పెరుగుతున్నప్పటికీ.. ప్రస్తుతం భారతదేశంలో దాని అధిక ధరల ప్రభావం లేదు. అవును, క్రూడ్ ఆయిల్ ధర రోజురోజుకు పెరుగుతోంది. ఆ కోణంలో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను కూడా ప్రతిరోజూ పెంచవచ్చు. కానీ, ప్రస్తుతం దేశంలో అలాంటిదేమీ జరగడం లేదు. ఒకవైపు ముడిచమురు ధరలు పెరుగుతూనే మరోవైపు 78 రోజులుగా దేశంలో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి.

ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.41, డీజిల్ లీటర్ కు రూ. 86.67

చెన్నైలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.40, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.43

కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 104.67, డీజిల్ ధర లీటర్ కు రూ. 89.79

త్రివేండ్రంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 106.36, డీజిల్ ధర లీటర్ కు రూ. 93.47

హైదరాబాద్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 108.20, డీజిల్ ధర లీటర్ కు రూ. 94.62

విశాఖ‌ప‌ట్నంలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 109.05, డీజిల్ ధర లీటర్ కు రూ. 95.18

బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 100.58, డీజిల్ ధర లీటర్ కు రూ. 85.01

జైపూర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 107.06, డీజిల్ ధర  లీటర్ కు రూ. 90.70

లక్నోలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 95.28, డీజిల్ ధర లీటర్ కు రూ. 86.80

భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 101.81, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.62

 ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 2022 క్యాలెండర్ ఏడాది మూడో త్రైమాసికంలో బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని గోల్డ్ మన్ శాక్స్ అంచనా వేస్తోంది. ఒమిక్రాన్ కారణంగా డిమాండ్ తగ్గుతుందని భావించినప్పటికీ, ఇది పెరుగుతుందని పేర్కొంది. సరఫరా డిమాండ్, ఒపెక్ ప్లస్ దేశాల ఉత్పత్తి క్షీణత ప్రభావంతో ధరలు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తోంది. అదే జరిగితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి మండిపోయే అవకాశముంది.

Follow Us:
Download App:
  • android
  • ios