Asianet News TeluguAsianet News Telugu

Today Gold And Silver Rate: ప‌సిడి ప్రియుల‌కు బ్యాడ్ న్యూస్‌.. భారీగా పెరిగిన ధ‌ర‌లు..!

బంగారం ధ‌ర‌ మరోసారి పరుగులు పెడుతోంది. బంగారం ధర రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
 

Today Gold And Silver Rate
Author
Hyderabad, First Published Jan 21, 2022, 10:19 AM IST

బంగారం ధ‌ర‌ మరోసారి పరుగులు పెడుతోంది. బంగారం ధర రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలోని వివిధ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, డాలర్ విలువ, ద్రవ్యోల్బణం, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, వివిధ దేశాల మధ్య భౌతిక పరిస్థితులు, కరోనా మహమ్మారి.. ఇలా చాలా అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే బంగారం ధర రోజురోజుకూ మారుతుంటుంది. గత పది రోజుల్లో బంగారం ధర ఐదుసార్లు పెరగగా..రెండుసార్లు మాత్రమే తగ్గింది. 2-3 సార్లు స్థిరంగా ఉంది. ఇవాళ వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం (Gold Rate) పది గ్రాముల ధర రూ. 47, 700 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర అత్యధికంగా రూ. 52, 040 రూపాయలు ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 47, 800 కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 50, 500 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 45, 550 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 49, 700 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 45, 810 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 50, 000వేలకు చేరింది. ఇక దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 47, 590 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 49 వేల 590 రూపాయలుగా ఉంది. 

ఇక తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఈవిధంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 500పైకి కదిలింది. దీంతో బంగారం ధర రూ. 49,700కు ఎగసింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ. 450 పెరిగింది. దీంతో ఈ పసిడి రేటు రూ. 45,550కు చేరింది.ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. 

పెరిగిన వెండి ధ‌ర‌లు

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 68,800గా ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ. 68,800గా ఉంది. విశాఖపట్నంలో కిలో వెండి ధ‌ర‌ రూ. 68,800 వద్ద కొనసాగుతోంది. కాగా.. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 64,600లుగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 64,600లుగా కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 68,800లుగా ఉంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 64,600లుగా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 68,800గా ఉంది. కేరళలో కిలో వెండి ధర రూ. 68,800లుగా కొనసాగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios