Godrej Security Solutions తయారు చేసిన మాట్రిక్స్ లాకర్, అక్యూ గోల్డ్, స్మార్ట్ ఫాగ్ సిస్టంలతో దొంగల ఆటకట్టు..

125 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గోద్రెజ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ తాజాగా సరికొత్త సెక్యూరిటీ ఉత్పత్తులతో మార్కెట్లోకి అడుగు పెట్టింది సెక్యూర్ 4.0 పేరిట విడుదల చేసినటువంటి ఈ ఉత్పత్తులన్నింటిని నేడు హైదరాబాదులో ఆవిష్కరించారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Today Godrej Security Solutions launched Matrix Locker, Accu Gold, Smart Fog System in Hyderabad MKA

భారతదేశం గర్వించదగ్గ బ్రాండ్లలో ఒకటైనటువంటి గోద్రెజ్ వినూత్నమైనటువంటి సెక్యూరిటీ సొల్యూషన్స్ తో మార్కెట్లోకి వచ్చింది. తాజాగా సెక్యూర్  4.0  పేరిట  సరికొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది ఈ సరికొత్త గోద్రెజ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ పూర్తిగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్,  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ,  డిజిటల్ టెక్నాలజీకి  సమ్మిళితంగా ఉన్నాయి.  సాంప్రదాయ  బీరువాలు, లాకర్లకు భిన్నంగా గోద్రెజ్ అండ్ బోయ్స్  సంస్థ  సరికొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది.  తాజాగా హైదరాబాదులో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధి పుష్కర్ గోఖలే, గోద్రెజ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ బిజినెస్ హెడ్,  పలు ఉత్పత్తులను ఆవిష్కరించారు. 

ఆక్యూ గోల్డ్ పేరిట గోల్డ్ టెస్టింగ్ మెషిన్ ను  తెలంగాణ  మార్కెట్లో ఆవిష్కరించారు.  ప్రత్యేకత ఏమిటంటే ఇందులో బంగారం నాణ్యత ఖచ్చితంగా  తెలియజేస్తుంది.  ఒక బంగారు నాణాన్ని ఈ మెషిన్ లో పెట్టి టెస్ట్ చేసినట్లయితే ఆ నాణెంలో బంగారం శాతం ఎంత ఇతర లోహాల శాతం ఎంత  ఎన్ని క్యారెట్ల బంగారం ముందు డిజిటల్ పద్ధతిలో తెలియజేస్తుంది.  పూర్తి అత్యాధునికమైనటువంటి సాంకేతికతతో పనిచేసే ఈ ఆక్యూ గోల్డ్ టెస్టింగ్ మిషన్  ముఖ్యంగా నగల దుకాణాల వారికి,  అలాగే గోల్డ్ లోన్స్ సేవలు అందించే వారికి ఎక్కువగా ఉపయోగపడుతుందని సంస్థ ప్రతినిధి గోఖలే పేర్కొన్నారు. 

అలాగే సంస్థ విడుదల చేసినటువంటి కొత్త మాట్రిక్స్ లాకర్ కూడా అత్యాధునికమైనటువంటి ఫీచర్లను కలిగి ఉంది ముఖ్యంగా దొంగతనాలను నివారించేందుకు  ఈ సేఫ్టీ లాకర్లో ఐ వార్నెస్ సెన్సార్ లను  కలిగి ఉంది.  ఇందులో అదనపు భద్రత లభిస్తుంది.  అలాగే అనధికారిక మైనటువంటి యాక్సెస్ ఈ లోకంలో గమనించినట్లయితే వెంటనే యజమాని ఫోన్  రింగ్ అవుతుంది.  తద్వారా మీ ఇంట్లో దొంగతనం జరుగుతుందన్న సంగతి క్షణాల్లో తెలిసిపోయే అవకాశం ఉంది. 

Today Godrej Security Solutions launched Matrix Locker, Accu Gold, Smart Fog System in Hyderabad MKA

కొత్త మ్యాట్రిక్స్ లోకల్ డిజిటల్ లాక్ అలాగే కీ లాక్ వంటి వేరియన్స్ కూడా ఉన్నాయి.  జీఎస్ఎం మాడ్యూల్ తో పనిచేసే  ఈ లాకర్ ఇంటర్నెట్ సదుపాయం లేకపోయినా పని చేస్తుంది. . ముఖ్యంగా ఇందులోని సెక్యూరిటీ సిస్టమ్స్ లో ఎలాంటి కేబుల్స్ ఉపయోగించకపోవడం విశేషం. 

గోద్రెజ్ ప్రవేశపెట్టినటువంటి మార్ట్ ఫార్మ్ సెన్సార్ అనేది సరికొత్త సెక్యూరిటీ సిస్టం గా చెప్పవచ్చు.  ఈ స్మార్ట్ యంత్రం ఇంట్లో లేదా కార్యాలయంలో ఉంచడం ద్వారా దొంగతనం జరిగినప్పుడు సేఫ్టీ లాకర్  అనధికారిక యాక్సి స్  చేసినట్లయితే వెంటనే బర్గలర్ అలారం మోగటం తో పాటు  స్మార్ట్ ఫాగ్ మిషన్లోని పొగ  గది మొత్తం విస్తరిస్తుంది.  ఈ దట్టమైన పొగ దొంగతనానికి వచ్చిన వారికి  భయాందోళనకు గురి చేయడంతో పాటు వారికి మరే ఇతర వస్తువు కనబడకుండా చుట్టుముడుతుంది.  అలాగే మీ ఫోన్కు అలారం సైతం రింగ్ అవుతుంది.  అలా మీరు ఈ స్మార్ట్ ఫాగ్ యంత్రం ద్వారా  ప్రయోజనం పొందే అవకాశం ఉంది. 

Today Godrej Security Solutions launched Matrix Locker, Accu Gold, Smart Fog System in Hyderabad MKA

దీంతోపాటు గోద్రెజ్ సొల్యూషన్స్ వారు సోలార్ పవర్ తో నడిచేటువంటి సీసీ కెమెరాలను సైతం విడుదల చేశారు.  అలాగే పలు రకాల సీసీ కెమెరాలు మీకు పూర్తిస్థాయి సర్విలెన్స్  అనుభవాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని  గోద్రెజ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ బిజినెస్ హెడ్ పుష్కర్ గోఖలే  పేర్కొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios