ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ జున్ జున్ వాలా (Rakesh Jhunjhunwala) రాడార్ లోని స్టాక్ అంటే ఇన్వెస్టర్లకు మంచి గురి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన పోర్టుఫోలియోలోని స్టాక్స్ కొన్నింటిని కొనుగోలు చేసి తడిగుడ్డ వేసుకొని పడుకోవచ్చు అనేంతగా, భరోసా ఉంటుంది. అలాంటి లాంగ్ టర్మ్ స్టాక్ గురించి ఇప్పుడు చూద్దాం.  

ఏస్ ఇన్వెస్టర్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా (Rakesh Jhunjhunwala) పట్టిందల్లా బంగారం అని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు భావిస్తుంటారు. ఆయన పోర్టు ఫోలియోపై ఇన్వెస్టర్లు ఎప్పుడు ఓ కన్నేసి ఉంచుతారు. ఇండియన్ వారెన్ బఫెట్ గా పేర్కొందిన రాకేష్ జున్ జున్ వాలా (Rakesh Jhunjhunwala) ఏ కంపెనీలో షేర్లను తన పోర్టు ఫోలియోలో హోల్డ్ చేస్తున్నారా అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే ఇటీవల ఆయన పోర్టుఫోలియోలోని ఓ షేరు ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరింది. ఆ షేరు మరేదో కాదు టాటా సన్స్ వారి Titan షేర్ గత వారం రోజులుగా మంచి ర్యాలీలో కొనసాగుతోంది. 

రాకేష్ జున్ జున్ వాలా (Rakesh Jhunjhunwala) పోర్ట్‌ఫోలియోలో టైటాన్ షేర్ ప్రధానమైన వాటా కలిగి ఉంది. రాకేష్ జున్ జున్ వాలా, అతని భార్య రేఖా మొత్తం 5.09 శాతం వాటా కలిగి ఉన్నారు. టైటాన్ షేర్లు గత వారం రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఇది ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. కంపెనీ జీవితకాల గరిష్టం రూ.2687.25గా ఉంది.

ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో టైటాన్ షేర్లు రూ.2556 వద్ద ఉన్నాయి. రూ.2537 స్థాయిని బ్రేక్ చేసి, ఆ తర్వాత మరింత పెరగవచ్చని అంచనా. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ షేర్ దీర్ఘకాలికంగా రూ.3200 స్థాయిని తాకవచ్చని అంచనా వేస్తున్నారు. 

ఈ స్టాక్‌ను కొనుగోలు చేయాలని ఇన్వెస్టర్లకు సూచించినట్లు జిసిఎల్ సెక్యూరిటీస్ వైస్ చైర్మన్ కె రవి సింఘాల్ తెలిపారు. "ఆభరణాల విభాగంలో టైటాన్ కంపెనీ వృద్ధి నిరంతరం పెరుగుతోంది. ఈ కంపెనీ సన్ గ్లాసెస్ నుండి వాచ్ సెగ్మెంట్ వరకు విస్తరించి ఉంది. కంపెనీ పెర్ఫ్యూమ్ వ్యాపారంలోకి సైతం ప్రవేశించబోతోంది. కంపెనీ స్మార్ట్ వాచీలను కూడా విడుదల చేయబోతోంది. ఇవన్నీ కంపెనీ డిమాండ్ ను మరింత పెంచే వీలుంది. 

ఇదే కాకుండా, బంగారం ధరల పెరుగుదల నుండి కంపెనీ కూడా లాభపడుతుంది.అందువలన, రాకేష్ జున్‌జున్‌వాలా పెట్టుబడి పెట్టిన ఈ స్టాక్ దీర్ఘకాలికంగా మరింత పెరగవచ్చు. లాంగ్ టర్మ్ కోసం ఈ స్టాక్ లో పెట్టుబడి పెట్టవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

రాకేష్ జున్ జున్‌వాలా ఫేవరెట్ స్టాక్ కూడా టైటాన్ కావడం విశేషం. ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా మాట్లాడుతూ, “టైటాన్ షేర్ ధర 6 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది రూ. 2537 స్థాయిని దాటింది. కంపెనీకి తదుపరి రెసిస్టెన్స్ స్థాయి రూ. 2600. అయితే టైటాన్ ఈ స్థాయిని దాటితే, స్వల్పకాలికంలో రూ. 2900 వరకు వెళ్లవచ్చు. అయితే దీర్ఘకాలంలో, ఈ స్టాక్ రూ. 3000 నుండి 3200 వరకు ఉంటుంది.

Titanలో రాకేష్ జున్‌జున్‌వాలా వాటా ఎంత?
డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన షేర్‌హోల్డింగ్ సరళి ప్రకారం, రాకేష్ జున్ జున్ వాలా, రేఖా ఝున్‌జున్‌వాలా కలిసి 5.09 శాతం వాటాను కలిగి ఉన్నారు. రాకేష్ జున్‌జున్‌వాలా కంపెనీలో 3,57,10,395 షేర్లు అంటే 4.02% వాటాను కలిగి ఉన్నారు. రేఖ 95,40,575 షేర్లు అంటే 1.07% వాటాను కలిగి ఉన్నారు.