Asianet News TeluguAsianet News Telugu

రతన్ టాటా భుజంపై చెయ్యి వేసి కుర్రాడు...ఇప్పుడు ఏంచేస్తున్నాడో తెలుసా...

రతన్ టాటా అంతటి దిగ్గజంతో పనిచేసే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు. వదులుకోరు. కానీ ఆయనతో పనిచేసే అవకాశం రావాలిగా. కానీ రతన్ టాటాతో కలిసి పని చేసే అవకాశం ఓ యువకుడికి లభించింది.

This enterprising youth's compassion got an opportunity to work with Ratan Tata
Author
Hyderabad, First Published Nov 22, 2019, 10:18 AM IST

ముంబై: రతన్ టాటా..వ్యాపార దిగ్గజం..! నష్టాల్లో ఉన్న కంపెనీలను లాభాల బాట పట్టించడంలో నేర్పరి. అంతేకాదు అలా  సంపాదించిన లాభాల్లో 95శాతం సేవాకార్యక్రమాల్లో వినియోగించే గొప్ప మానవతావాది. అంతటి దిగ్గజంతో పనిచేసే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు. వదులుకోరు. కానీ ఆయనతో పనిచేసే అవకాశం రావాలిగా.

రతన్ టాటాతో కలిసి పని చేసే అవకాశం ఓ యువకుడికి లభించింది. శాంతను నాయుడు (27) 2014లో ఇంజినీరింగ్ పూర్తిచేసుకొని రతన్ టాటా సంస్థలో ఉద్యోగిగా చేరాడు. ఓ రోజు ఆఫీస్ ముగించుకొని ఇంటికి తిరిగివస్తుండగా..మార్గం మధ్యలో నడిరోడ్డుపై రక్తపు మడుగులో విల్లవిల్లాడుతూ చనిపోయిన ఓ కుక్కను చూశాడు.

also read కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ సంస్ధలు అన్ని ప్రైవేటీకరణం!

రోడ్డు ప్రమాదం వల్లే ఆ కుక్క చనిపోయిందని భావించిన శాంతను..తన స్నేహితులకు ఫోన్ చేసి కుక్కల సంరక్షణ కోసం ఓ ఐడియా ఇచ్చాడు. ఆ ఐడియానే రతన్ టాటా అసిస్టెంట్గా పనిచేసే అవకాశం వచ్చింది.

కుక్కలు రోడ్డు ప్రమాదానికి గురి కాకుండా శాంతను తన స్నేహితులతో కలిసి వివిధ రంగులతో కలిపి ఓ బెల్ట్ తయారు చేశాడు. ఆ బెల్ట్ ధరించిన కుక్కలు ప్రమాదానికి గురి కావు. రోడ్డు మీద వెళ్లే సమయంలో వాహనాదారుడికి కళ్లకు ఆ బెల్ట్ రిఫ్లెక్ట్ అయ్యేలా రూపొందించాడు.

This enterprising youth's compassion got an opportunity to work with Ratan Tata

తయారు చేసిన ఆ బెల్ట్ ను ఓ కుక్కకు ధరించాడు. తరువాతి రోజు కుక్క గురించి ఆరా తీయడంతో శాంతనకు బెల్ట్ గురించి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. తమకు ఓ బెల్ట్ కావాలంటూ స్థానికులు కోరడంతో ఆ యువకుడి ఆనందానికి అవధుల్లేవు.

కానీ దీన్ని బిజినెస్‌గా బిల్డ్ చేయాలంటే నిధులు కావాలి. ఆ నిధుల్లేక ప్రాజెక్ట్ గురించి పక్కకి తప్పుకుంటున్న విషయాన్ని తన తండ్రికి చెప్పాడు. తండ్రి ఏమాంత్ర ఆలోచించకుండా ప్రాజెక్ట్ లో ఫండింగ్ చేయాలని రతన్ టాటాకు లేఖ రాయమని సూచించాడు. రతన్ టాటా ఎక్కడా..తానెక్కడ. అసలు నేను రాసిన లెటర్ ను రతన్ టాటా చూస్తారా అనుకుంటూ అనేక సందేహాలతో స్వయంగా తనచేత్తో రాసిన ఓ లెటర్ ను రతన్ టాటా ఆఫీస్‌కు పోస్ట్ చేశాడు.

also read అగ్రశ్రేణి బిజినెస్ పర్సన్ సత్యనాదెళ్ల: బంగా, ఉల్లాల్‌లకూ ఫార్చ్యూన్‌లో చోటు

ఓ సారి ముంబై ఆఫీస్‌కు రావాలని  శాంతనుకు రెండు నెలల తరువాత  రతన్ టాటా దగ్గర నుంచి లెటర్ వచ్చింది . ఆ లెటర్ తో శాంతను లైఫ్ మారిపోయింది. ముంబైలో రతన్ టాటా ఆఫీస్‌కి వెళ్లిన శాంతనుకు రతన్  మూగజీవాలపై ఎంతటి ప్రేమను కురిపిస్తున్నాడో అర్ధమైంది. శాంతను ప్రాజెక్ట్‌కు ఫండింగ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు రతన్ టాటా చెప్పడంతో మోటో పావాస్ అంటూ ఓ కంపెనీని ప్రారంభించాడు.

కంపెనీని తన స్నేహితులు నిర్వహిస్తుండగా శాంతను ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాడు. కొన్నినెలల తరువాత ఉన్నత విద్యను ముగించుకొని ఇంటికి వచ్చిన శాంతనుకు ఓ రోజు ‘నా ఆఫీస్‌లో ఎక్కడిపని అక్కడే ఆగిపోయింది. వచ్చి నాకు పనిచేసి పెడతావా’ అంటూ రతన్ టాటా ఫోన్ చేయడంతో శాంతను ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

రతన్ టాటా ఎక్కడా. తానెక్కడా. తనకు రతన్ టాటా ఫోన్ చేయడం ఏంటని అనుకుంటూనే రతన్ టాటాతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. అలా శాంతనుకు 18నెలలు రతన్ పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేసే అవకాశం వచ్చింది.

Follow Us:
Download App:
  • android
  • ios