Petrol and Diesel Rate Today: హైదరాబాదులో శుక్రవారం కూడా పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి గడిచిన 8 నెలలుగా పెట్రోల్ డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. . అయితే తాజాగా నిర్మలా సీతారామన్ పెట్రోల్ డీజిల్ ధరలను జిఎస్టి పరిధిలోకి తెస్తాము అనే  ప్రతిపాదన పై పరిశీలిస్తున్నాము అనే ప్రకటన చేయడంతో పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత మేర తగ్గుతాయనే చర్చ ప్రస్తుతం మొదలైంది.

Petrol and Diesel Rate Today: పెట్రోల్, డీజిల్ ధరలు గడచిన తొమ్మిది నెలలుగా పెరగలేదు అనే చెప్పవచ్చు. నేడు కూడా అంటే ఫిబ్రవరి 17 శుక్రవారం కూడా పెట్రోలు, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాలు అయినటువంటి ఢిల్లీ, ముంబై, కోల్ కత, చెన్నై వంటి నగరాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.72గా ఉంది. అదే సమయంలో ముంబైలో 106.31 రూపాయలు, కోల్‌కతాలో 106.03 రూపాయలు, చెన్నైలో 102.63 రూపాయలుగా ఉంది. అలాగే డీజిల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో రూ. 89.62, ముంబైలో రూ. 94.27, కోల్‌కతాలో రూ. 92.76, చెన్నైలో రూ. 94.24 గా ఉంది.

హైదరాబాద్ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్ ధర రూ. 109.66గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ. 97.82గా ఉంది. అయితే ఒక లీటరు పెట్రోల్ ధర 109 రూపాయలు ఎందుకు ఉంది అనే సందేహం మీకు కలగవచ్చు. కనుక ఈ పెట్రోల్ ధర వెనుక ఉన్న మతలబును తెలుసుకుందాం. క్రూడ్ ఆయిల్ లీటరు ధర రూ. 40.40, రిఫైనరీ ప్రాసెసింగ్ + రిఫైనరీ మార్జిన్లు + OMC మార్జిన్ + సరుకు రవాణా ఖర్చు, లాజిస్టిక్స్ కలుపుకుంటే దాదాపు లీటరుకు రూ. 4.01 ఖర్చును కలుపుతారు. డీలర్‌ వసూలు చేసే ధర (ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ మినహాంచాలి) లీటరుకు రూ. 44.41 చార్జీని కలుపుతారు, ఇందుకు అదనంగా ఎక్సైజ్ సుంకం + కేంద్ర ప్రభుత్వం విధించిన రోడ్డు సెస్సు పేరిట రూ. 32.90/లీటర్ కలుపుతారు, పెట్రోల్ పంప్ డీలర్‌లకు కమీషన్ రూ. 3.79/లీటర్ కలపాలి. VAT కలపకుండా ఇప్పుడు పెట్రోల్ ధర రూ. 81.11/లీటర్, వాటు 35.20% కలిపిన అనంతరం (రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటుంది) రూ. 28.55/లీటర్, చివరకు వాహనదారులకు లభించె పెట్రోల్ రిటైల్ ధర రూ. 109.66/లీటర్. 

అయితే ప్రస్తుతం డీజిల్ పెట్రోల్ ధరలను జీఎస్టీ కిందికి తెస్తామని ఇటీవలే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రతిపాదన ముందు పెట్టారు అయితే జీఎస్టీ కిందకు నిజంగానే పెట్రోల్ డీజిల్ లను తెచ్చినట్లయితే భారీగా తగ్గే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వసూలు చేస్తున్నటువంటి 35% వ్యాటు స్థానంలో జీఎస్టీ లోని గరిష్ట స్లాబు అయినటువంటి 28 శాతం విధించే అవకాశం ఉంటుంది. తద్వారా దాదాపు 7 శాతం పన్ను తగ్గే అవకాశం ఉంది.