Asianet News TeluguAsianet News Telugu

144 సంవత్సరాల పురాతన ట్రేడింగ్ హాల్ మూసివేత.. కరోనా వైరస్ కారణంగా..

ఈ హాలు 144 సంవత్సరాల పురాతనమైంది. గత 144 సంవత్సరాలుగా రాగి, జింక్, అల్యూమినియం వంటి లోహాల ధరలను ఈ హాలులో నిర్ణయించబడ్డాయి. 

the ring london metal exchange to be closed soon it is working in the world from 144 years
Author
Hyderabad, First Published Jan 20, 2021, 2:33 PM IST

ప్రపంచవ్యాప్తంగా లోహాలకు బెంచ్ మార్క్ ధరను నిర్ణయించే లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ యొక్క ఓపెన్ ట్రేడింగ్ ఫ్లోర్  శాశ్వతంగా మూసివేయనున్నారు. ఈ హాలు 144 సంవత్సరాల పురాతనమైంది.

గత 144 సంవత్సరాలుగా రాగి, జింక్, అల్యూమినియం వంటి లోహాల ధరలను ఈ హాలులో నిర్ణయించబడ్డాయి. లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ అనేది అతిపెద్ద  మెటల్ ఎక్స్ఛేంజీలలో ఒకటి.  కరోనా కారణంగా లాక్ డౌన్ సమయంలో మూసివేసారు. దీనిని 'ది రింగ్'  అని కూడా పిలుస్తారు.

also read 2 నెలల తరువాత కనిపించిన జాక్ మా.. వీడియో కాన్ఫరెన్స్‌లో ఏం చెప్పాడంటే.. ...

లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ లో ముఖాముఖి ఒప్పందాలు జరుగుతాయుయి. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని నివారించడానికి  లాక్ డౌన్ సమయంలో  ఈ ట్రేడింగ్ హాల్ మూసివేసారు.  

కానీ ఇప్పుడు లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్ (LME)శాశ్వతంగా మూసివేయనున్నారు.లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్  ట్రేడింగ్ హాల్ 1877 సంవత్సరంలో స్థాపించారు. దీనిని మూసివేశాక 

లోహాల వ్యాపారం ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా మాత్రమే జరుగుతుంది. ఎల్‌ఎంఇ నిర్వహణ మంగళవారం సభ్యులకు సమాచారం ఇచ్చింది.  

Follow Us:
Download App:
  • android
  • ios