సీట్‌బెల్ట్ అలారం డియాక్టివేట్ చేసే పరికరాల అమ్మకాలను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం అమెజాన్ ఇండియాను ఆదేశించింది. త్వరలోనే వెనుక కూర్చునే పాసింజర్లు సైతం సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకునే నిబంధన జారీ చేస్తామని ప్రకటన
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ ప్రమాదంలో మరణించిన తర్వాత, సీటు బెల్ట్ ప్రాముఖ్యతపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వెనుక సీట్లలో కూర్చున్నప్పుడు సీట్ బెల్ట్ ఎంత ముఖ్యమో ఈ సంఘటన తెలియజేస్తుంది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాయిటర్స్‌తో మాట్లాడుతూ, ఈ సంఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడం ప్రారంభించినట్లు తెలిపారు. కార్ సీట్ బెల్ట్ అలారాంలను నిలిపివేయడానికి రూపొందించిన పరికరాల అమ్మకాన్ని నిలిపివేయాలని ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్‌ను ఆదేశించినట్లు తెలిపారు. ఇలాంటి పరికరాలను ప్రజలకు అందుబాటులో ఉంచడం ప్రమాదమని అమెజాన్‌ను కోరినట్లు ఆయన చెప్పారు.
మెటల్ క్లిప్‌ల విక్రయం చట్టవిరుద్ధం కానప్పటికీ, ఇటీవల భారతీయ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ కారు ప్రమాదంలో మరణించిన తర్వాత ఇటువంటి పరికరాలు, విస్తృతంగా పరిశీలనలోకి వచ్చాయి. సైరస్ మిస్త్రీ సీటు బెల్ట్ ధరించలేదని అందుకే ప్రమాదం జరిగిందనే పలు విశ్లేషణలు వినిపించాయి. ప్రపంచంలోని నాల్గవ అతిపెద్ద కార్ మార్కెట్ అయిన భారత్ లో రహదారి భద్రతపై చర్చను రేకెత్తించింది.
నితిన్ గడ్కరీ భద్రతా చర్యల గురించి చర్చించిన ఒక ఇంటర్వ్యూలో, అమెజాన్‌లో అందుబాటులో ఉన్న మెటల్ క్లిప్‌లను సీట్‌బెల్ట్ స్లాట్‌లలో ఇన్‌స్టాల్ చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని. కారు నడిపేటప్పుడు సీటు బెల్టు పెట్టుకోకున్నా.. ఆ మెటల్ క్లిప్ వల్ల వార్నింగ్ రాదని ఆయన తెలిపారు. అన్నారు. మరియు, "ప్రజలు సీటు బెల్ట్ ధరించకుండా ఆపడానికి అమెజాన్ లో ఈ క్లిప్‌లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అందుకే మెటల్ క్లిప్పుల అమ్మకాలు ఆపాలని తాము అమెజాన్‌కు నోటీసు పంపామని నితిన్ గడ్కరీ చెప్పారు. అయితే ఈ విషయంలో అమెజాన్ ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదని సమాచారం.
2021లో వాహన ప్రమాదాల వల్ల భారతదేశంలో దాదాపు లక్షన్నర మంది చనిపోయాని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా చెప్పారు. భారతదేశంలోని రోడ్లపై ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మరణం సంభవిస్తుందని ప్రపంచ బ్యాంకు గత ఏడాది తెలిపింది. ఈ నేపథ్యంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. డ్రైవర్, ముందు ప్రయాణికుల సీట్లకే కాకుండా వెనుక సీట్లకు కూడా సీట్‌బెల్ట్ అలారంలను తప్పనిసరి చేయాలని భారత్ యోచిస్తోందని చెప్పారు.
అమెజాన్ లో రూ. 249లకే సీట్‌బెల్ట్ యాంటీ అలారం క్లిప్ లభ్యం..
అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో అనేక చిన్న మెటల్ క్లిప్‌లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. సీట్‌బెల్ట్ అలారాలను తొలగించేందుకు ఈ క్లిప్పులను కార్ వేరియంట్, మోడల్ ప్రాతిపదికన ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే, ఈ పరికరాల ధర దాదాపు 249 రూపాయల నుండి ప్రారంభమవుతుంది.
