యుఎస్ కంపెనీ టెస్లా అధికారికంగా భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. టెస్లా 2021లో భారతదేశంలో తన వ్యాపారాన్ని ప్రారంభిస్తుందని కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

టెస్లా వాహనాలను భారతదేశంలో విక్రయించడానికి టాటా మోటార్స్‌తో ఒప్పందం కుదుర్చుకోబోతోందని కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఒప్పందం కింద టెస్లా టాటా మోటార్స్‌లో ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను ఉపయోగించుకోనుంది.

ఈ నివేదికతో  టాటా మోటార్స్ స్టాక్ ఊపందుకుంది. ఆటోమొబైల్ కంపెనీ అయిన టాటా మోటార్స్ సోమవారం స్టాక్ మార్కెట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. 13 శాతం టిజ్జీతో కంపెనీ స్టాక్ 52 వారాల గరిష్టానికి చేరుకుంది.   

ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా దీనికి అవసరమైన సన్నాహాలు చేసిందని, టాటా మోటార్స్ మౌలిక సదుపాయాలు భారతదేశంలో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయడానికి బాగా సరిపోతాయని కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి.

also read మీ బ్యాంక్ అకౌంట్ డీయాక్టివ్ అయ్యిందా ? అయితే మీ డబ్బును ఎలా విత్ డ్రా చేయాలో తెలుసుకోండి.. ...

కానీ ఈ పుకార్లు ధృవీకరించలేదు. పుకార్లు పక్కనా పెడితే టాటా మోటార్స్ షేర్లు బాగా పెరిగి, ఎగువ సర్క్యూట్ స్థాయిని తాకింది. గత ఎనిమిది ట్రేడింగ్ రోజుల్లో టాటా మోటార్స్ షేర్లు దాదాపు 25 శాతం పెరిగాయి. నేడు 227 స్థాయిలో ప్రారంభమై మధ్యాహ్నం 12.21 గంటలకు 22.10 పాయింట్లతో 10.02 శాతం పెరిగి 242.75 స్థాయిలో ట్రేడవుతోంది.

కాగా, అంతకుముందు ట్రేడింగ్ రోజున 220.65 స్థాయిలో ముగిసింది. ప్రస్తుతం, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.803.51 బిలియన్లు. మార్చిలో కనిష్ట స్థాయికి పడిపోయిన తరువాత, కంపెనీ షేర్లు ఇప్పటివరకు 250 శాతం పెరిగాయి.

అదనంగా టాటా మోటార్స్ షేర్లు దాని దేశీయ వ్యాపారం, జెఎల్ఆర్ వ్యాపారం ఊహించిన దాని కంటే మెరుగ్గా పనిచేశాయి. డిసెంబర్‌లో కంపెనీ దేశీయ అమ్మకాలు 53430 యూనిట్లుగా ఉన్నాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 21 శాతం ఎక్కువ. 

టెస్లా ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటో కంపెనీ. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 800 బిలియన్ డాలర్లు. ఇది టెస్లా  సిఇఒ ఎలోన్ మస్క్ అమెజాన్ ఇంక్ యజమాని జెఫ్ బెజోస్‌ను ఓడించి  ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు కావడానికి సహాయపడింది. టొయోటా మోటార్స్, వోక్స్వ్యాగన్, జనరల్ మోటార్స్ వంటి పెద్ద ప్రత్యర్థులతో పోల్చితే ఈ ఆటో కంపెనీకి కేవలం 17 సంవత్సరాలు.