మీ బ్యాంక్ అకౌంట్ డీయాక్టివ్ అయ్యిదా.. అందులో నుండి డబ్బులు విత్ డ్రా చేయలేకపోతున్నారా ? సాధారణంగా ఎవరైనా వారి అకౌంట్ చాలా కాలంపాటు ఉపయోగించకపోతే అకౌంట్ డీయాక్టివేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ.

ఒకోసారి కొందరు అందులో మినిమమ్ బ్యాలెన్స్ మెయిన్ టైన్ చేస్తుంటారు... కానీ వారి అక్కౌంట్ లో మినిమమ్ బ్యాలెన్స్ ఉందిగా అని ఉపయోగించకుండ ఉంటారు. ఒకోసారి అక్కౌంట్ ఉపయోగించకుండ ఉండటం వల్ల అక్కౌంట్ డీయాక్టివేట్ లోకి వెళ్తుంది.

అలాంటప్పుడు వారి అక్కౌంట్ నుండి సేవింగ్స్ మనీ, లేదా మినిమమ్ బ్యాలెన్స్ విత్ డ్రా చేసుకోవడం ఎలా అని ఆలోచిస్తుంటారు.

డీయాక్టివ్ అక్కౌంట్ నుండి డబ్బులను ఎలా విత్ డ్రా చేసుకోవాలో తెలుసుకొండి..

also read త్వరలో పెరగనున్న నిత్యవసర వస్తువుల ధరలు.. దేనిపై ఎంత పెరుగుతుందో తేలుసుకొండీ.. ...

కొన్ని బ్యాంకుల్లో అకౌంట్ ఉన్న వారు వారి ఖాతా నుంచి పది సంవత్సరాల పాటు ఎలాంటి ట్రాన్సక్షన్స్ జరగపోతే వారి అకౌంట్ ఆటోమేటిక్‏గా డీయాక్టివ్ అయిపోతుంది. దీంతో వారి ఖాతాలో ఉన్న అమౌంట్ మొత్తం అన్‏క్లెయిమ్డ్ అవుతుంది.

2019 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బ్యాంకుల్లో రూ.18,380 కోట్ల అన్‏క్లెయిమ్డ్ డబ్బు ఉంది. ఏదైనా బ్యాంకులో మీ అకౌంట్ డీయాక్టివేట్ అయి ఉంటే ముందుగా మీరు ఆ బ్రాంచుకు మెయిల్ పంపాల్సి ఉంటుంది.

అన్‏యాక్టివ్‏లో ఉన్న అకౌంటను రీయాక్టివ్ చేయాలని కోరుతూ మెయిల్ లో ఆభ్యర్దించాలి. దీనికోసం మీరు మీ ఐడీ కార్డు, అడ్రస్ ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. మెయిల్ పంపిన తర్వాత కొన్ని రోజులకు అకౌంట్ తిరిగి రీయాక్టివ్ అవుతుంది.

ప్రస్తుతం సైబర్ నేరాలు ఎక్కువవుతున్న క్రమంలో ఆన్‏లైన్‏లో కేవైసీ అప్‏డేట్ చేయకపోవచ్చు. ఇందుకోసం మీరు నేరుగా బ్యాంకుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక సీనియర్ సిటిజన్స్ అయితే డోర్ స్టెప్ బ్యాంకింగ్ ద్వారా వారి అకౌంటును మళ్ళీ యాక్టివేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

మీ అక్కౌంట్ రీయాక్టివ్ అయిన తరువాత నేరుగా బ్యాంకులో మీ అక్కౌంట్ నుండి డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు.