మార్చిలోగా 1000 చోట్ల క్లౌడ్ కిచెన్లు : స్విగ్గీ

2020 మార్చి నాటికి 1000 క్లౌడ్ కిచెన్లు ఏర్పాటు చేయాలని ఫుడ్ అగ్రిగేటర్ స్విగ్గీ తెలిపింది. మరో 12 నగరాలకు సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్న స్విగ్గి ఇందుకోసం రూ. 250 కోట్ల పెట్టుబడి పెట్టనున్నది. తద్వారా 8 వేల కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి. దీంతో చైనా తర్వాత ఎక్కువ క్లౌడ్ కిచెన్లు ఉన్న దేశంగా భారత్ నిలువనున్నది.

Swiggy set up 1,000 cloud kitchens; to expand it in 12 new cities by March 2020

న్యూఢిల్లీ: ఫుడ్ అగ్రిగేటర్ సేవల సంస్థ స్విగ్గీ తన రెస్టారెంట్ పార్టనర్ల కోసం వెయ్యికి పైగా క్లౌడ్ కిచెన్లను ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి 12 కొత్త నగరాల్లో ఇలాంటి వసతులను మరిన్ని కల్పిస్తామని తెలిపింది. కేవలం రెండేళ్లలో, 14 సిటీల్లో 10 లక్షల చదరపు అడుగులకు పైగా రియల్ ఎస్టేట్ స్పేస్‌‌లో పెట్టుబడులు పెట్టినట్టు తెలిపింది. 

ఈ రియల్‌‌ ఎస్టేట్‌‌ స్పేస్‌‌లోనే  తమ చిన్న, పెద్ద, మధ్య తరహా రెస్టారెంట్ పార్టనర్లకు క్లౌడ్ కిచెన్లను ఏర్పాటు చేస్తున్నట్టు  చెప్పింది.  భవిష్యత్‌‌లో ఫుడ్ డెలివరీకి క్లౌడ్ కిచెన్లను ఎప్పటికీ ఏర్పాటు చేస్తుంటామని, చైనా తర్వాత క్లౌడ్ కిచెన్లు ఉన్న రెండో అతిపెద్ద దేశంగా ఇండియా అవతరిస్తుందని స్విగ్గీ కొత్త సప్లయి సీఈవో విశాల్ భాటియా తెలిపారు.

also read  రతన్ టాటా భుజంపై చెయ్యి వేసి కుర్రాడు...ఇప్పుడు ఏంచేస్తున్నాడో తెలుసా...

ఎండ్ కస్టమర్లకు డైన్‌‌ ఇన్ ఫెసిలిటీ అందించాల్సిన అవసరం లేకుండా.. ఆపరేటర్స్ ఫుడ్‌‌ను ప్రిపేర్ చేసి, ప్యాకేజ్ చేసి కస్టమర్లకు డెలివరీ చేయడమే క్లౌడ్ కిచెన్ల ఉద్దేశం. ఈ కిచెన్లను ఏర్పాటు చేయడానికి, రన్ చేయడానికి స్విగ్గీ గత రెండేళ్లలో రూ.175 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది.

Swiggy set up 1,000 cloud kitchens; to expand it in 12 new cities by March 2020

2020 మార్చి నాటికి 12 కొత్త నగరాల్లో మరిన్ని క్లౌడ్ కిచెన్లు ఏర్పాటు చేయడానికి అదనంగా రూ.75 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నట్టు భాటియా ప్రకటించారు. మెట్రోల్లో, టైర్ 2, టైర్ 3 నగరాల్లో కొత్త ఉద్యోగావకాశాలను కూడా కల్పిస్తున్నట్టు చెప్పారు. పార్టనర్ రెస్టారెంట్లు, సొంత బ్రాండ్‌‌ల క్లౌడ్ కిచెన్ ఆపరేషన్స్ ద్వారా, స్విగ్గీ రెస్టారెంట్ ఇండస్ట్రీలో ఎనిమిది వేలకు పైగా డైరెక్ట్, ఇన్‌‌డైరెక్ట్ ఉద్యోగాలను కల్పిస్తోందని తెలిపారు.

ఇదిలా ఉంటే స్విగ్గీ, జొమాటో మధ్య మళ్లీ విలీన చర్చలు ప్రారంభించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇరు కంపెనీల ఇన్వెస్టర్లు ఇటీవల  చర్చలు ప్రారంభించారని చెప్పారు. ప్రస్తుత చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయని సమాచారం. 

also read పెళ్లికి రుణమిస్తాం.. ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే చాలు: బజాజ్ ఫిన్ సర్వ్

స్విగ్గీకి మెయిన్ ఇన్వెస్టర్లుగా యాక్సెల్,నాస్పర్స్, టెన్సెంట్ ఉండగా.. జొమాటోకి ఇన్ఫోఎడ్జ్ ఎంటర్‌‌‌‌ప్రైజ్, యాంట్ ఫైనాన్సియల్, సెకోవియా ఉన్నాయి. ఈ రిపోర్ట్‌‌లను జొమాటో కొట్టివేసింది. స్విగ్గీతో ఎలాంటి విలీన, కొనుగోలు చర్చలు జరుపడం లేదని తేల్చిచెప్పింది. గతంలోనూ  ఒకసారి, ఈ రెండు కంపెనీలు విలీన ప్రతిపాదన మీద చర్చలు జరిపాయి.

కాకపోతే, అప్పట్లో అవి సఫలం కాలేదు. ఫుడ్‌‌ డెలివరీ రంగంపై దృష్టి పెట్టాలని ఉబర్‌‌ ఈట్స్‌‌ నిర్ణయించడంతోపాటు, అమెజాన్‌‌ కూడా త్వరలో రంగంలోకి రానున్న నేపథ్యంలో ఈ దిశలో చర్చలు మళ్లీ మొదలైనట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడిస్తున్నాయి.  ఈ దిగ్గజాలను తట్టుకునేందుకు ఈ ప్లాన్​ చేస్తున్నాయని సమాచారం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios