కోర్టు ఆదేశాల‌ను ధిక్క‌రించి 40 మిలియ‌న్ డాల‌ర్ల‌ను త‌న పిల్ల‌ల పేరు మీద‌కు బ‌దిలీ చేసినందుకు మాల్యాను దోషి తేలుస్తూ 2017 మేలో సుప్రీంకోర్టు తీర్పు వెల్ల‌డించింది. దీనిపై సోమ‌వారం ఉద‌యం మాల్యా పిటిష‌న్‌ను కొట్టివేస్తు తీర్పును వెల్ల‌డించింది.

వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు మ‌రోసారి షాకిచ్చింది. 2017లోని తీర్పును సమీక్షించాలని కోరుతూ విజయ్ మాల్యా చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ఈ రోజు తిరస్కరించింది.

 కోర్టు ఆదేశాల‌ను ధిక్క‌రించి 40 మిలియ‌న్ డాల‌ర్ల‌ను త‌న పిల్ల‌ల పేరు మీద‌కు బ‌దిలీ చేసినందుకు మాల్యాను దోషి తేలుస్తూ 2017 మేలో సుప్రీంకోర్టు తీర్పు వెల్ల‌డించింది. దీనిపై సోమ‌వారం ఉద‌యం మాల్యా పిటిష‌న్‌ను కొట్టివేస్తు తీర్పును వెల్ల‌డించింది.

2017లోని తీర్పుపై పునఃస‌మీక్ష చేయ‌డానికి మాల్యా వేసిన పిటిష‌న్‌లో కొత్త విష‌యాలు ఏమీ లేవ‌ని న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది. ఆగస్టు 27న ఈ కేసులో వాదనలను విన్న తర్వాత కోర్టు ఉత్తర్వులను రిజర్వు చేసింది.

also read విమాన ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. అంతర్జాతీయ విమానాల‌పై నిషేధం మళ్ళీ పొడిగింపు.. ...

విజయ్ మాల్యా 9వేల కోట్లకు పైగా బ్యాంక్ లోన్ డిఫాల్ట్ కేసులో నిందితుడు, ప్రస్తుతం లండన్ లో ఉన్నాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మే 9, 2017న ఉత్తర్వులు జారీ చేసింది.

మాల్యా కోర్టు ఆదేశాల‌ను ధిక్కరిస్తూ బ్రిట‌న్ సంస్థ నుంచి త‌న‌కు రావాల్సిన 40 మిలియ‌న్ డాల‌ర్ల‌ను త‌న పిల్ల‌ల‌కు పేర్ల మీదకు మ‌ళ్లించార‌ని ఆరోపిస్తూ గ‌తంలో ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల క‌న్సార్టియం సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసింది.

కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించిన మాల్యా వాస్తవాలను దాచిపెట్టిందని, డబ్బును తన కుమారుడు సిద్ధార్థ్ మాల్యా, కుమార్తెలు లియానా మాల్యా, తాన్య మాల్యాకు మళ్లించారని బ్యాంకులు ఆరోపించాయి.