కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శుక్రవారం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ ప్రభావం స్టాక్ మార్కెట్లపై చూపెడుతోంది. నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. 

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 168 పాయింట్ల లాభంతో 36,424 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. కాగా  నిఫ్టీ 46 పాయింట్ల లాభంతో 10,877 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. బడ్జెట్ ముగిసే సమయానికి లాభాల్లోనే కొనసాగుతాయో.. నష్టాలకు పడిపోతాయో చూడాలి. 

కొనుగోళ్ల మద్దతుతో పలు రంగాల షేర్లు లాభపడుతున్నాయి. ఈ మధ్యంతర బడ్జెట్‌లో గ్రామీణ రైతాంగానికి మేలు చేసే విధంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ చదివి వినిపించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా వేతన జీవులకు ఊరటగా ఐటీ మినహాయింపు పరిమితిని పెంచుతారని భావిస్తున్నారు.