Asianet News TeluguAsianet News Telugu

కొనసాగుతున్న స్టాక్ మార్కెట్ జోరు.. నేడు ఆల్‌టైం హైకి సెన్సెక్స్.. నిఫ్టీ 16600 పైకి..

స్టాక్‌మార్కెట్‌ జోరు వరుసగా రెండో వారంలోనూ ఇన్వెస్టర్లు లాభాలు పొందుతున్నారు. నేడు సెన్సెక్స్‌ ఒక దశలో రికార్డు స్థాయిలో లాభపడి 55,854 పాయింట్లను టచ్‌ చేసి రికార్డు సృష్టించింది. సెన్సెక్స్‌ ఉదయం 55,565 పాయింట్లతో ప్రారంభమై స్టాక్ మార్కెట్‌ ముగిసే సమయానికి 209 పాయింట్లు లాభపడి 55,792 పాయింట్ల వద్ద ముగిసింది. 

Stock Market today: share market continues to hit all time high today Sensex closes at 55800 and Nifty closes above 16600
Author
Hyderabad, First Published Aug 17, 2021, 6:06 PM IST


నేడు స్టాక్ మార్కెట్ రెండవ ట్రేడింగ్ రోజు మంగళవారం కొంత అస్థిరత తర్వాత మళ్లీ అత్యధిక స్థాయిలో ముగిసింది. నేడు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ 209.69 పాయింట్ల లాభంతో (0.38 శాతం) 55,792.27 వద్ద ముగిసింది.

మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 51.55 పాయింట్ల (0.31 శాతం) లాభంతో 16,614.60 వద్ద ముగిసింది. సెన్సెక్స్-నిఫ్టీ ముగింపులో నేడు సరికొత్త రికార్డు స్థాయికి చేరింది. ఈరోజు ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ 55854.88 గరిష్ట స్థాయికి, నిఫ్టీ 16,628.55 గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.  

గత వారం సెన్సెక్స్ 1,159.57 పాయింట్లు అంటే 2.13 శాతం లాభపడింది. శుక్రవారం బెంచ్ మార్క్ ఇండెక్స్ మొదటిసారిగా 55000 దాటింది దీంతో ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 55,487.79 కి చేరుకుంది. చాలా కంపెనీల జూన్ త్రైమాసిక ఫలితాలు వెల్లడించాయి.  దీంతో ఇప్పుడు పెట్టుబడిదారుల దృష్టి ప్రపంచ ధోరణిపై ఉంటుంది. ముహర్రం సందర్భంగా స్టాక్ మార్కెట్ గురువారం మూసివేయనుంది.

బిజినెస్ కన్స్యూమర్ టాటా, విప్రో, టెక్ హింద్రా, హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా కంపెనీల షేర్లు లాభాలు పొందాయి. మరోవైపు జే‌ఎస్‌డబల్యూ స్టీల్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, కోల్ ఇండియా, యూ‌పి‌ఎల్ షేర్లు నష్టాలతో ముగిశాయి.  

also read ఇండియాలో క్రిప్టోకరెన్సీనిపై నిషేధం విధించవచ్చా..? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే..

మరోవైపు ఇండస్‌ఇండ్‌బ్యాంకు, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, టాటాస్టీల్‌, ఎల్‌ అండ్‌ టీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ ఇండెక్స్‌ 0.6 శాతం పడిపోయింది. నిఫ్టీ ఐటీ 2.57 శాతం పెరిగింది. 

సెక్టోరల్ ఇండెక్స్‌ని పరిశీలిస్తే నేడు ఎఫ్‌ఎంసిజి, ఫార్మా, ఐటి మినహా అన్ని రంగాలు రెడ్ మార్క్‌తో ముగిశాయి. వీటిలో ఆర్థిక సేవలు, లోహాలు, పిఎస్‌యు బ్యాంకులు, రియల్టీ, బ్యాంకులు, మీడియా, ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి.

ఉదయం షేర్ మార్కెట్  ట్రేడ్‌ ప్రారంభంలో నష్టాలతో  ఓపెన్ అయ్యింది.  సెన్సెక్స్ 119.91 పాయింట్లు (0.22 శాతం) తగ్గి 55462.67 స్థాయిలో, నిఫ్టీ 37.80 పాయింట్ల (0.23 శాతం) క్షీణతతో 16525.20 వద్ద ప్రారంభమైంది. 

సెన్సెక్స్-నిఫ్టీ సోమవారం అత్యున్నత స్థాయిలో  ముగిసింది. సెన్సెక్స్ 145.29 పాయింట్లు (0.26 శాతం) పెరిగి 55,582.58 వద్ద ముగిసింది. మరోవైపు, నిఫ్టీ 33.95 పాయింట్ల (0.21 శాతం) లాభంతో 16,563.05 వద్ద ముగిసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios