MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Business
  • ఇండియాలో క్రిప్టోకరెన్సీనిపై నిషేధం విధించవచ్చా..? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే..

ఇండియాలో క్రిప్టోకరెన్సీనిపై నిషేధం విధించవచ్చా..? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏమన్నారంటే..

క్రిప్టోకరెన్సీలపై కేంద్ర ప్రభుత్వం త్వరలో మరో అడుగు ముందుకు వేయనుంది. ఈ నేపథ్యంలో ప్రతిపాదిత బిల్లును కేబినెట్ ముందు ఉంచినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. డిజిటల్ కరెన్సీకి సంబంధించిన బిల్లుపై కేబినెట్ ఆమోదం కోసం వేచి చూస్తున్నట్లు సీతారామన్ తెలియజేశారు. 

2 Min read
Author : Ashok Kumar
Published : Aug 17 2021, 01:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

 క్రిప్టోకరెన్సీలపై ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అధ్యక్షతన ఏర్పడిన ఇంటర్-మినిస్టీరియల్ కమిటీ డిజిటల్ కరెన్సీకి సంబంధించిన సమస్యలను అధ్యయనం చేయడానికి అలాగే నిర్దిష్ట చర్యలను ప్రతిపాదించడానికి ఒక నివేదికను కూడా సమర్పించింది.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఇంటర్-మినిస్టీరియల్ కమిటీ తన నివేదికలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన డిజిటల్ కరెన్సీ మినహా  మిగతా అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించాలని సిఫార్సు చేసింది. 'క్రిప్టోకరెన్సీ (బిల్లు) పై కేబినెట్ నోట్ కూడా సిద్ధంగా ఉంది అలాగే నేను కేబినెట్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాను' అని ఆర్థిక మంత్రి చెప్పారు. క్రిప్టోకరెన్సీలపై చట్టవిరుద్ధ కార్యకలాపాలు తొలగించడానికి ఇంకా క్రిప్టోకరెన్సీల చెల్లింపు వ్యవస్థలపై అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి గతంలో  చెప్పారు. అందువల్ల బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించవచ్చనే భయం కూడా పెట్టుబడిదారులలో నెలకొంది. 

34
ఆర్‌బి‌ఐ   డిజిటల్ కరెన్సీ

ఆర్‌బి‌ఐ   డిజిటల్ కరెన్సీ

క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన ఆందోళనల గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బి‌ఐ) కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేసింది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ టి రవిశంకర్ ఆర్బిఐ  సొంత డిజిటల్ కరెన్సీని దశలవారీగా ప్రవేశపెట్టే వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఆర్‌బి‌ఐ దీనిని హోల్‌సేల్ అండ్ రిటైల్ రంగాలలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టే ప్రక్రియలో ఉంది. భారతదేశమే కాదు ప్రపంచంలోని  చాలా కేంద్ర బ్యాంకులు ఈ దిశగా పనిచేస్తున్నాయి. చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు సి‌బి‌డి‌సిల అవకాశాలను అన్వేషిస్తున్నాయి. కొన్ని దేశాలు నిర్దిష్ట ప్రయోజనం కోసం సి‌బి‌డి‌సిని అమలు చేశాయి. ఆర్‌బిఐ, ఇతర సెంట్రల్ బ్యాంకుల లాగానే కొంతకాలంగా సి‌బి‌డి‌సి వివిధ అంశాలను పరిశీలిస్తోంది. 
 

44
సి‌బి‌డి‌సి అంటే ఏమిటి?

సి‌బి‌డి‌సి అంటే ఏమిటి?

సి‌బి‌డి‌సి అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. ఆర్‌బి‌ఐ జారీ చేసిన దీనిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తిస్తుంది. భారతదేశంలో దీనిని డిజిటల్ రూపి అని కూడా పిలుస్తారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయి - రిటైల్ అండ్ హోల్ సేల్. రిటైల్ డిజిటల్ కరెన్సీని సాధారణ ప్రజలు, కంపెనీలు ఉపయోగిస్తాయి. అయితే, హోల్‌సేల్ డిజిటల్ కరెన్సీని ఆర్థిక సంస్థలు ఉపయోగిస్తాయి.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Fridge: ఇంట్లోనే కాదు.. కారులోనూ వాడొచ్చు.. ఈ చిన్న ఫ్రిజ్‌లో ఎన్ని ప్రత్యేకతలో
Recommended image2
Gold Prices Fall: రెండో రోజు పసిడి ప్రియులకు భారీ ఊరట.. మళ్లీ పతనమైన బంగారం..ఎంతో తెలుసా?
Recommended image3
iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రో కొనేందుకు ఇదే మంచి సమయం.. సగం ధరకే అదిరిపోయే ఫోన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved