Asianet News TeluguAsianet News Telugu

స్టాక్ మార్కెట్లకు ఆర్‌బి‌ఐ బూస్ట్.. నేడు లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిసాయి. ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలకు తోడు ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత దాస్‌ మీడియాతో మాట్లాడు తారన్న అంచనా మధ్య లాభాలతో ట్రేడింగ్‌ను ఆరభించాయి.

stock gains: Sensex closes with rise of 424 points after RBI announcements
Author
Hyderabad, First Published May 5, 2021, 5:43 PM IST

నేడు వారంలోని మూడవ ట్రేడింగ్ రోజున బుధవారం స్టాక్ మార్కెట్ లాభాలతో  ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రైమరీ ఇండెక్స్ సెన్సెక్స్ 424.04 పాయింట్ల వద్ద 0.88 శాతం పెరిగి 48,677.55 స్థాయిలో ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 121.35 పాయింట్లతో 0.84 శాతం లాభంతో 14,617.85 వద్ద ముగిసింది.

అంతకుముందు వారంలో సెన్సెక్స్ 903.91 పాయింట్లతో 1.88 శాతం పెరిగింది. ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలతో తోడు ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత దాస్‌ మీడియాతో మాట్లాడు తారన్న అంచనా మధ్య లాభాలతో ట్రేడింగ్‌ను ఆరభించాయి. భారీ ఉపశమన ప్యాకేజీ లభించనుందన్న ఆశలు ఇన్వెస్టర్లనను ఊరించాయి.  కానీ అలాంటి చర్యలేవీ  శక్తికాంత దాస్‌ ప్రకటించలేదు.

 కోవిడ్ -19 కు సంబంధించిన ఆరోగ్య సదుపాయాల కోసం 2022 మార్చి నాటికి ఆర్‌బిఐ రూ .50 వేల కోట్ల ప్రత్యేక లిక్విడిటీ సౌకర్యాన్ని ప్రకటించింది. దీని ద్వారా   ఆస్పత్రులు, ఆరోగ్య సేవా సంస్థలు కూడా ప్రయోజనం పొందుతాయి. 

ఈరోజు హెవీవెయిట్స్ గురించి మాట్లాడితే యుపిఎల్, సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు   గ్రీన్ మార్క్ మీద ముగిశాయి. ఎస్‌బిఐ లైఫ్, ఏషియన్ పెయింట్స్, హిందుస్తాన్ యూనిలీవర్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్ రెడ్ మార్క్ మీద ముగిశాయి. 

నేడు  రియాల్టీ కాకుండా మిగతా అన్ని రంగాలు  లాభాలతో ముగిశాయి. వీటిలో పిఎస్‌యు బ్యాంక్, ఐటి, ఎఫ్‌ఎంసిజి, మెటల్, ఆటో, ఫార్మా, మీడియా, ఫార్మా, ప్రైవేట్ బ్యాంకులు, బ్యాంకులు, ఫైనాన్స్ సర్వీసెస్ ఉన్నాయి.

 కోవిడ్ -19 ఫ్రంట్,  ఆర్థిక డేటా, కంపెనీల త్రైమాసిక ఫలితాలు, ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులకు అనుగుణంగా ఈ వారంలో దేశ స్టాక్ మార్కెట్ల కదలికలు ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దేశంలోని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు స్టాక్  మార్కెట్‌పై ఎటువంటి ప్రభావం చూపవని ఆయన అభిప్రాయపడ్డారు, అయితే ఈ వారంలో కోవిడ్ -19 ఫ్రంట్‌లో జరిగిన పరిణామాలు, పరిస్థితులను ఎదుర్కోవటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యూహం స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయి.

 సెన్సెక్స్ నేడు ఉదయం 263.50 పాయింట్లు (0.55 శాతం) 48517.01 స్థాయిలో ప్రారంభమైంది. అలాగే నిఫ్టీ 73.90 పాయింట్లతో 0.51 శాతం లాభంతో 14570.40 వద్ద ప్రారంభమైంది. 

 స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాలతో  ముగిసింది. సెన్సెక్స్ 465.01 పాయింట్లతో 0.95 శాతం పడిపోయి 48,253.51 స్థాయిలో ముగిసింది.  నిఫ్టీ 137.65 పాయింట్లతో  0.94 శాతం క్షీణించి 14,496.50 వద్ద ముగిసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios