చైనాలోని ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ తాజాగా ఒక ప్రకటన చేసింది. ఆపిల్ స్టోర్లను ఫిబ్రవరి 14 నుండి బీజింగ్‌లో కొన్ని స్టోర్లను తిరిగి ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. కాకపోతే కొన్ని గంటల వరకు మాత్రమే స్టోర్లు ఓపెన్ చేసి ఉంటాయి అని దాని అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.

అదే సమయంలో చైనాలోని ప్రధాన నగరంలో అనేక ఇతర దుకాణాలు, స్టోర్లు  మాత్రం ఎప్పటిలాగానే మూసివేసారు, ఎందుకంటే చైనా దేశంలో కరోనావైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతుంది.

also read స్టార్లను మించిన క్రేజ్... సోషల్ మీడియాలో దూకుకెళ్తున్నా వ్యాపారవేత్తలు

ఐఫోన్ తయారీదారి ఆపిల్ సంస్థ ఫిబ్రవరి 8న నుంచి చైనాలో తన రిటైల్ స్టోర్ల మూసివేత మరికొన్ని రోజులకు కొనసాగిస్తున్నట్లు చెప్పింది. ఇది తన కార్పొరేట్ కార్యాలయాలు, కాంటాక్ట్ సెంటర్లను తెరిచే దిశగా పనిచేసింది.

చైనాలో ఇప్పటివరకు 1,367 మంది కరోనావైరస్ వల్ల  మృతి చెందారు. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో చైనా వ్యాప్తంగా ఉన్న స్థానిక అధికారులు ప్రయాణికులపై పరిమితులను విధించారు.

అలాగే నగరంలో నివసించే వారిని బహిరంగ ప్రదేశాలకు వెళ్లకుండా ఉండాలని  హెచ్చరించడంతో ఆపిల్  స్టోర్లు మరికొన్ని రోజులపాటు మూసివేయాలని నిర్ణయం తీసుకుంది.

also read రూ. కోటి కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారు ఎంతమంది తెలుసా...

బీజింగ్‌లోని  ఐదు ఆపిల్ స్టోర్లు ఫిబ్రవరి 14 నుంచి ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరుచుకొని కుంటాయని ఆపిల్ వెబ్‌సైట్  ద్వారా  తెలిపింది. ఇది ఇంతకుముందు ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల ఓపెన్ చేసి  ఉండేది. షాంఘై, షెన్‌జెన్ వంటి నగరాల్లో ఆపిల్ స్టోర్లు మూసివేసారు.

"ప్రజారోగ్యం, వైరస్ నివారణ దృష్ట్యా, మా రిటైల్ స్టోర్లు కొన్ని తాత్కాలికంగా మూసివేశము" అని ఆపిల్ వెబ్‌సైట్‌లో ఒక నోటీసులో పేర్కొంది. అలాగే తెరిచిన ఔట్ లెట్లలను సందర్శించే వినియోగదారులను కరోనా వైరస్  మాస్కూలు ధరించి, శరీర ఉష్ణోగ్రత చెక్ చేయడానికి సహకరించాలి అని కూడా కోరింది.