‘చెప్పు’తో కొట్టుకున్నట్లే..: ఆనంద్ మహీంద్ర ట్వీట్ వైరల్

ఇటీవల ఆనంద్ మహీంద్ర పంచుకున్న ఓ ఫొటో విస్తృతంగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం యువతతోపాటు పెద్దవాళ్లు కూడా విపరీతంగా సెల్‌ఫోన్ ఉపయోగిస్తున్నారు. ఫొన్లలో ఎక్కువ సేపు మాట్లాడటం లేదా, ఫోన్లోనే వీడియోలు చూస్తూ గడపడం లాంటి చేస్తూ తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. 

Slipper phone cover Photo Shared by Anand Mahindra Goes Viral on   Social Media

బెంగళూరు: మహీంద్రా కంపెనీ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో గత కొంతకాలంగా ఎంతో చురుగ్గా ఉంటున్నారు. సామాజిక అంశాలు, యువతలో స్ఫూర్తినిచ్చే సందేశాలతో కూడిన ట్వీట్లను చేస్తూ ఆయన ఆకట్టుకుంటున్నారు. 

ఇటీవల ఆయన పంచుకున్న ఓ ఫొటో విస్తృతంగా వైరల్ అవుతోంది. ప్రస్తుతం యువతతోపాటు పెద్దవాళ్లు కూడా విపరీతంగా సెల్‌ఫోన్ ఉపయోగిస్తున్నారు. ఫొన్లలో ఎక్కువ సేపు మాట్లాడటం లేదా, ఫోన్లోనే వీడియోలు చూస్తూ గడపడం లాంటి చేస్తూ తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. 

ఇలాంటివారిని ఉద్దేశించే ఆనంద్ మహీంద్ర ఓ ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. సెల్‌ఫోన్‌కు చెప్పులను పోలి ఉన్న కవర్లు అయితే బాగుంటుందని ఆ ఫొటోను పంచుకున్నారు. మనకు సెల్‌ఫోన్ వినియోగంలో నియంత్రణ లేకపోతే ఇలాంటి కవర్ సెల్‌ఫోన్లకు అమర్చాలని సూచించారు.

అప్పుడైతేనే మనం ఎంత ఎక్కువ సమయం ఫోన్‌తో గడిపితే అన్నిసార్లు చెప్పుతో కొట్టుకున్నట్లే ఉంటుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ఏడాది జనవరిలో ఆనంద్ మహీంద్రా ఈ ఫొటోను పంచుకున్నప్పటికీ.. ఇంకా ఈ ఫొటో వైరల్ అవుతూనే ఉంది. వాట్సప్‌వండర్‌బాక్స్‌ హ్యాష్‌ట్యాగ్‌తో ఆయన ఈ ఫొటోను ట్వీట్ చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios