ఆన్ లైన్ లో ఐటీ రిటర్న్స్ చాలా సులువు..

Six steps to e-filing your income tax return
Highlights

మరి అసలు ఈ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం ఎలా..? అనుకుంటున్నారా.. ఈ కింది సింపుల్ 6 స్టెప్స్ ఫాలో అయిపోతే  చాలు.. మరిఇంకెందుకు ఆలస్యం చదివేయండి.

ఉద్యోగం, వృత్తి, వ్యాపారం... ఏదైనా సరే.. ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం... పరిమితికి మించి ఆదాయం ఉన్నప్పుడు కచ్చితంగా ఆదాయపు రిటర్నులు దాఖలు చేయాల్సిందే. 2017-18 ఆర్థిక సంవత్సరానికి రిటర్నులు దాఖలు చేయడానికి ఆఖరి రోజు దగ్గరపడుతోంది. మరి అసలు ఈ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం ఎలా..? అనుకుంటున్నారా.. ఈ కింది సింపుల్ 6 స్టెప్స్ ఫాలో అయిపోతే  చాలు.. మరిఇంకెందుకు ఆలస్యం చదివేయండి.

స్టెప్ నెం.1..

ఆన్ లైన్ లో ఆదాయపన్ను చెల్లింపులు జరపాలి అనుకుంటే ముందుగా ఆదాయపన్నుశాఖ అధికారిక వెబ్ సైట్( incometaxindiaefiling.gov.in) లో ముందుగా రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. అందులో మీ పాన్ కార్డ్ నెంబర్,  మీ పుట్టిన తేదీ వివరాలు ఇవ్వాలి. రిజిస్టర్ అయినప్పుడు పాన్ కార్డ్ ఐడీ మీ యూసర్ నేమ్ అవుతుంది. పాస్ వర్డ్ కొత్తది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

స్టెప్ నెం.2
ఆ తరువాత ఈ-ఫైలింగ్ సెలెక్ట్ చేసి, టాక్స్ రిటర్న్స్ సెలెక్ట్ చేసి, అసెస్‌మెంట్ ఇయర్ 2018-19లో ఐటీఆర్ 1 ఫారాన్ని నింపాలి.

స్టెప్ నెం.3
ఆ ఫారం దాఖలు చేసే విధానాన్ని కూడా ఎంచుకోవాలి. ఇందులో ఆన్‌లైన్‌లోనే ఫారాన్ని నింపి, ఆన్‌లైన్‌లోనే దాఖలు చేసే ఆప్షన్ ఎంచుకోవచ్చు.

స్టెప్ నెం.4

దీనికి సంబంధించిన అన్ని డ్యాంక్యుమెంట్లను  సరిచూసుకోవాలి. అంటే ముఖ్యంగా పాన్ కార్డ్, ఫామ్ 16, ఇంట్రస్ట్ స్టేట్ మెంట్స్, టీడీఎస్ సర్టిఫికేట్స్,  పెట్టుబడులు, ఇన్సూరెన్స్, హోమ్ లోన్ తదితర వివరాలు ముందుగానే చూసుకోవాలి. 26ఏఎస్ ఫామ్ డౌన్ లోడ్ చేసుకోవాలి. 

స్టెప్ నెం.5

ఆన్ లైన్ లోనే దాఖలు చేయాలనుకుంటే..ఫామ్ డౌన్ లోడ్ చేసుకొని వివరాలన్నీ నింపాలి. ఆ తర్వాత దానిని 'generate XML’ బటన్ ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వెబ్ సైట్ లోకి వెళ్లి 'upload XML' button సెలెక్ట్ చేసుకొని దానిని అప్ లోడ్ చేసి సబ్ మిట్ బటన్ క్లిక్ చేయాలి.

స్టెప్ నెం.6

చివరగా ఐటీఆర్ వెరిఫికేషన్ చేసుకోవడం మర్చిపోవద్దు.  ఇక్కడే మీరు మీ ఐటీ రిటర్న్ ఏ విధంగా వెరిఫై చేస్తారో కూడా సెలెక్ట్ చేయాలి. ఇవి రెండు రకాలు. ఆధార్ లేదా నెట్ బ్యాంకింగ్. ఈ రెండూ కాదనుకుంటే ఐటీఆర్ వెరిఫికేషన్ ఫారంపై సంతకం చేసి బెంగుళూరు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్‌కు పోస్టు చేయాలి. ఐటీఆర్ వెరిఫికేషన్ అనేది మొత్తం ప్రాసెస్‌లో చివరి స్టెప్.


 

loader