2025లో SIP చేద్దామనుకుంటున్నారా? ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు
కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీరు SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్)లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నట్లయితే మీరు సరైన మార్గంలో ఉన్నారన్న మాట. SIPలు మీ సంపదను క్రమంగా పెంచుకోవడానికి సులభమైన మార్గాల్లో ఒకటి.
SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) అనేది మీ సంపదను క్రమంగా పెంచుకోవడానికి సులభమైన మార్గాల్లో ఒకటి. స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు, సరైన మ్యూచువల్ ఫండ్‌ల ఎంపిక, స్టెప్ అప్ SIP ప్రయోజనాలు, సాధారణ తప్పులను నివారించడం వంటివి విజయవంతమైన SIP పెట్టుబడికి చాలా ముఖ్యం. పెట్టుబడిదారులు పెట్టడంలో అనుభవం ఉన్నవారికే కాకుండా ఇన్వెస్ట్ మెంట్ పెట్టడం స్టార్ట్ చేయాలనుకున్న వారికి కూడా ఇవి అనువైనవి. సాధారణ తప్పులను నివారించి, మీ SIP పెట్టుబడుల నుండి ఎక్కువ ప్రయోజనం పొందడంలో ఇక్కడ ఉన్న చిట్కాలు మీకు చాలా సహాయపడతాయి.
మ్యూచువల్ ఫండ్
SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) అనేది మ్యూచువల్ ఫండ్లలో ఒక నిర్ణీత మొత్తాన్ని రోజువారీ, వారం, నెల, త్రైమాసిక లేదా ఏడాది లెక్కన పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైనది. కాలం గడిచేకొద్దీ మీ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవడానికి ఇది ఒక క్రమబద్ధమైన, సులభమైన మార్గం. అయితే SIPల ప్రయోజనాలను పెంచుకోవడానికి మీ రాబడిని ప్రతికూలంగా ప్రభావితం చేసే తప్పుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు
మీ SIPని ప్రారంభించడానికి ముందు, ఒక స్పష్టమైన ఆర్థిక లక్ష్యాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ పెట్టుబడిని ఎందుకు ప్రారంభిస్తున్నారో మీరే ప్రశ్నించుకోండి. మీ లక్ష్యం ఇల్లు కొనడం, మీ పిల్లల చదువుకు డబ్బులు సమకూర్చడం లేదా పదవీ విరమణ తర్వాత ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే సేవింగ్స్ చేయడం కావచ్చు. మీ లక్ష్యం స్పష్టంగా ఉంటే దానిని సాధించడానికి అవసరమైన టైమ్, అంచనా రాబడిని మీరు మెరుగ్గా అంచనా వేయవచ్చు. ఈ స్పష్టత మీ పెట్టుబడి నిర్ణయాలను సులభతరం చేస్తుంది. మీ ఆర్థిక మైలురాళ్లపై దృష్టి పెట్టడంలో సహాయపడుతుంది.
సరైన మ్యూచువల్ ఫండ్‌లు
సరైన మ్యూచువల్ ఫండ్‌ను ఎంచుకోవడం SIP పెట్టుబడిలో అతి ముఖ్యమైన విషయం. పరిశోధన చేయకుండా ఏదో ఒకటి ఎంపిక చేయవద్దు. పెట్టుబడి పెట్టడానికి ముందు ఒక ఫండ్ పనితీరు, రిస్క్ ప్రొఫైల్, రాబడి సామర్థ్యాన్ని అంచనా వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. గత ఐదు సంవత్సరాలలో దాని ట్రాక్ రికార్డ్, ఫండ్ మేనేజర్ నైపుణ్యం, మార్కెట్ ట్రెండ్‌లను పరిశీలించండి. మీకు తెలియకపోతే ఆర్థిక సలహాదారు సలహా తీసుకోండి. సరైన శ్రద్ధ లేకుండా పెట్టుబడి పెట్టడం తక్కువ రాబడికి, నష్టాలకు దారితీస్తుంది. కాబట్టి కాస్త టైం తీసుకొని తెలివిగా ఎంచుకోండి.
స్టెప్-అప్ SIP ప్రయోజనం
దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు స్టెప్ అప్ SIP ఒక అద్భుతమైన ఎంపిక. మీ ఆదాయం పెరిగేకొద్దీ మీ SIP సహకారాన్ని క్రమంగా పెంచుకోండి. ఇది మీ పెట్టుబడి మొత్తాన్ని పెంచడమే కాకుండా చక్రవడ్డీ ప్రయోజనాలను పొందడానికి ఎక్కువ సమయం ఇస్తుంది. మీ SIP మొత్తాన్ని ప్రతి సంవత్సరం పెంచడం ద్వారా మీరు మీ ఆర్థిక లక్ష్యాలను వేగంగా సాధించవచ్చు. ఉదాహరణకు మీ సహకారంలో ఒక చిన్న వార్షిక పెరుగుదల కూడా కాలక్రమేణా గణనీయమైన మార్పును తెస్తుంది.
సాధారణ తప్పులు
SIPలు సులభమైనవి అయినప్పటికీ కొన్ని తప్పులు మీ పురోగతిని దెబ్బతీస్తాయి. మీ పెట్టుబడులను ముందస్తుగా ఉపసంహరించుకోవడం లేదా మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా మీ SIPలను ఆపడం మానుకోండి. మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా దీర్ఘకాలికంగా స్థిరంగా పెట్టుబడి పెట్టినప్పుడు SIPలు మెరుగ్గా పనిచేస్తాయి.
చిన్నగా ప్రారంభించండి
మీరు పెట్టుబడికి కొత్తవారైతే మీ బడ్జెట్‌కు సరిపోయే చిన్న SIP మొత్తంతో ప్రారంభించండి. మీరు నమ్మకం కుదిరినప్పుడు మీ పెట్టబడిని క్రమంగా పెంచుకోండి. SIPల ప్రయోజనాలను పొందడానికి స్థిరత్వం చాలా ముఖ్యం. మార్కెట్ పెరిగినా, పడిపోయినా మీ SIPపై స్థిరంగా ఉండటం వల్ల మీరు ప్రయోజనం పొందుతారు.
సూచన: అన్ని పెట్టుబడులు రిస్క్‌ను కలిగి ఉంటాయి. కాబట్టి నిర్ణయాలు తీసుకునే ముందు సరైన ఆర్థిక సలహాదారుని సంప్రదించడం చాలా ముఖ్యం.
ఇది కూడా చదవండి