రిటైర్మెంట్ టైమ్ కి సింపుల్ గా రూ.15 కోట్లు సంపాదించాలంటే SIPలో ఇలా ఇన్వెస్ట్ చేయండి
రిటైర్మెంట్ తర్వాత కూడా మీరు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉండాలంటే ఇప్పటి నుంచే సరైన ప్లాన్ అవసరం. మీరు కనుక సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (SIP) లో ప్రతి నెలా కొంత మొత్తం దాచుకోగలిగితే ఆ డబ్బే మిమ్మల్ని కోటీశ్వరుడిని చేస్తుంది. అదెలాగో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం రండి.
మీరు పదవీ విరమణను మైండ్ లో పెట్టుకొని సరైన ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ చేస్తుంటే అది మీరు తీసుకొనే తెలివైన ఆర్థిక నిర్ణయం అవుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఖర్చులు, ఆర్థిక అవసరాలు విపరీతంగా పెరిగిపోతాయి. అందువల్ల ఇప్పుడు లక్షలు సంపాదిస్తుంటే, మరో 30, 40 ఏళ్ల తర్వాత కోట్లు సంపాదిస్తేనే అవసరాలు తీర్చుకుంటూ హ్యాపీగా జీవించే పరిస్థితి ఉంటుంది. అందువల్ల మీరు సంపాదిస్తున్నప్పుడే అందులో 20 శాతం పెట్టుబడుల్లో పెడితే అదే మీకు భవిష్యత్తులో బంగారు నిధిగా మారుతుంది.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందాలంటే SIP మీకు సరైన ఎంపిక. ఇందులో ఎంత ఎక్కువ కాలం పెట్టుబడి పెడితే అంత ఎక్కువ రెట్లు ఆదాయం వస్తుంది. మీరు ప్రతి నెల రూ.20,000 పొదుపు చేస్తే మీరు రిటైర్ అయ్యే సరికి రూ.15 కోట్లు మీ సొంతం అవుతాయి. అదెలాగో తెలుసుకుందాం రండి.
మీరు రిటైర్మెంట్ తర్వాత డబ్బు గురించి టెన్షన్ పడకుండా ప్రయాణాలు చేయాలన్నా, మీ అభిరుచులకు తగ్గట్టుగా జీవించాలన్నా, మీ కుటుంబాన్ని పోషించగలిగే స్థితిలో మీరు ఉండాలన్నా సులభమైన మార్గం సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ లో పెట్టుబడి పెట్టండి. మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) కాలక్రమేణా సంపదను వందల రెట్లు పెంచే సాధనం లాంటిది. SIPలో మీరు ప్రతి నెలా క్రమం తప్పకుండా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టండి.
మీరు నెలకు రూ. 1 లక్ష సంపాదిస్తారనుకుందాం. మీ ఆదాయంలో 20 శాతాన్ని అంటే రూ. 20,000 మ్యూచువల్ ఫండ్ SIPలో పెట్టుబడి పెట్టండి. ఇది 12 శాతం వార్షిక రాబడితో మీ రిటైర్మెంట్ కార్పస్ ఎలా పెరుగుతుందో ఇక్కడ చూడండి. అది రూ.15 కోట్లుగా మారడాన్ని గమనించండి.
1. 10 సంవత్సరాలలో
పెట్టుబడి మొత్తం: రూ. 24,00,000
మూలధన లాభాలు: రూ. 22,46,782
మొత్తం కార్పస్: రూ. 46,46,782
2. 20 సంవత్సరాలలో
పెట్టుబడి మొత్తం: రూ. 48,00,000
మూలధన లాభాలు: రూ.1,51,82,958
మొత్తం కార్పస్: రూ. 1,99,82,958
3. 30 సంవత్సరాలలో
పెట్టుబడి మొత్తం: రూ. 72,00,000
మూలధన లాభాలు: రూ. 6,34,00,000
మొత్తం కార్పస్: రూ. 7,06,00,000
4. 37 సంవత్సరాలలో
ఇక్కడే కాంపౌండింగ్ మాయాజాలం పనిచేస్తుంది. ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టినందుకు గాను..
పెట్టుబడి మొత్తం: రూ. 88,80,000 అవుతుంది.
మూలధన లాభాలు: రూ.15,66,10,228
మొత్తం కార్పస్: రూ. 16,54,90,228
మీరు ఎంత ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టారో, మీ కార్పస్ అంత పెద్దదిగా పెరుగుతుంది. మ్యూచువల్ ఫండ్ SIP ద్వారా నెలవారీ రూ. 20,000 ఆదా చేస్తూ మీరు 37 ఏళ్లలో రూ. 15 కోట్లు సంపాదించవచ్చు. ఇది మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత ఆనందంగా గడపడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పటి నుంచే డబ్బు పెట్టుబడిని అలవాటు చేసుకోండి.