Asianet News TeluguAsianet News Telugu

ఎంక్యాప్‌లో బిగ్గెస్ట్ గెయినర్ ఎస్బీఐ.. కానీ టాప్‌లో రిలయన్సే

గత ఆర్థిక సంవత్సరం మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ఎస్బీఐ భారీగా లబ్ది పొందింది. టాప్ -10 సంస్థలు రూ.57,402.93 కోట్లకు చేరాయి. ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, హిందూస్థానీ యునీ లివర్, ఎస్బీఐ లబ్ధి పొందాయి. టీసీఎస్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ భారీగా నష్టపోయాయి. 

Seven of top 10 most valued companies add Rs 57,403 crore to m-cap
Author
New Delhi, First Published Apr 1, 2019, 3:52 PM IST

 

న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లలో టాప్ - 10 సంస్థలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.57,402.93 కోట్ల మేరకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూపేణా లబ్ధి పొందాయి. వాటిల్లో ఎస్బీఐ గరిష్ఠంగా లబ్ధి పొందిన సంస్థగా నిలిచింది. ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిందూస్థానీ యూనీ లివర్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ సంస్థలు భారీగా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూపేణా లాభ పడ్డాయి. 

కానీ టీసీఎస్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ నష్టపోయాయి. ఎస్బీఐ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20,260.54 కోట్లు లాభ పడి రూ.2,86, 301.54 కోట్లకు చేరుకున్నది. రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,297.66 కోట్లు వ్రుద్ధి చెంది రూ.8,63,995.66 కోట్లకు పెరిగితే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.12,208.98 కోట్లు పెరిగి రూ.6,30,853.98 కోట్లకు ఎగబ్రాకింది. 

హిందూస్థానీ యూనీ లివర్స్ (హెచ్‌యూఎల్) ఎం - క్యాపిటలైజేషన్ రూ.6,341.22 కోట్లు పెరిగి రూ.3,69,688.22 కోట్లకు, ఐసీఐసీఐ బ్యాంక్ ఎం క్యాప్ రూ.4,884.11 కోట్లు పెరిగి రూ.2,57,106.11 కోట్లకు చేరింది.  మరోవైపు హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,544.62 కోట్లు నష్టపోయి రూ.1,593.96 కోట్లు తగ్గి రూ.7,50,627.04 కోట్లకు పడిపోయింది.

అయితే టాప్ 10 ర్యాంకుల్లో రిలయన్స్, టీసీఎస్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, హిందూస్థానీ యూనీలీవర్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ నిలిచాయి. స్టాక్స్ పరంగా గత ఆర్థిక సంవత్సరం (2018-19) స్టాక్‌మార్కెట్‌ మదుపర్లకు లాభాల పంట పండించింది.

గత నాలుగేళ్లలోనే అత్యధిక లాభాలను అందించింది. మార్చిలో ట్రేడింగ్‌కు చివరి రోజు శుక్రవారం ముగిసేసరికి సెన్సెక్స్‌ 5704.23 పాయింట్లు (17.30%) పెరిగింది. నిఫ్టీ సైతం 1510.20 పాయింట్లు (14.93%) దూసుకెళ్లింది. 

బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.142.24 లక్షల కోట్ల నుంచి రూ.8.83 లక్షల కోట్లు పెరిగి.. రూ.151.08 లక్షల కోట్లకు చేరింది. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ 11.57 శాతం, మిడ్‌క్యాప్‌ 3 శాతం మేర డీలాపడ్డాయి. గత ఆర్థిక సంవత్సరం (2017-18)లో సెన్సెక్స్‌, నిఫ్టీలు వరుసగా 11.30%, 10.25% చొప్పున వృద్ధి చెందాయి.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 20 లాభాలతో ముగిశాయి. వేదాంతా 3.20%, టాటా స్టీల్‌ 2.73%, ఎం అండ్‌ ఎం 2.27%, టాటా మోటార్స్‌ 2.17%, ఓఎన్‌జీసీ 1.66%, హిందుస్థాన్‌ యుని లీవర్‌ 1.40%, మారుతీ సుజుకీ 1.31%, బజాజ్‌ ఫైనాన్స్‌ 1.18%, హెచ్‌డీఎఫ్‌సీ 1.04%, హీరో మోటోకార్ప్‌ 0.92% చొప్పున రాణించిన వాటిలో ఉన్నాయి. 

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.08%, ఐటీసీ 1.10%, బజాజ్‌ ఆటో 0.89% మేర నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో లోహ సూచీ అత్యధికంగా 2.33 శాతం లాభపడింది. ఆరోగ్య సంరక్షణ 1.37%, వాహన 1.22% అదే బాటలో నడిచాయి. ఎఫ్‌ఎంసీజీ, యుటిలిటీస్‌, బ్యాంకింగ్‌ షేర్లు మాత్రం డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో 1457 షేర్లు లాభాల్లోనూ, 1187 షేర్లు నష్టాలతోనూ ముగిశాయి. 159 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
 

Follow Us:
Download App:
  • android
  • ios